సారాంశం
రుతు చక్రం (బహిష్ఠు కావడం) అనేది సంఘటనల పరంపర, ఇది ప్రతి నెల స్త్రీ యొక్క పునరుత్పత్తి వయస్సులో సంభవిస్తుంది, ఇది యుక్తవయస్సు (12-14 సంవత్సరాలు) నుండి మొదలై 45-50 సంవత్సరాల వయస్సుతో ముగుస్తుంది. ఏ కారణం చేతనైనా, రుతుక్రమం యుక్తవయస్సులో ప్రారంభం కాకపోయినా లేదా ముగింపు వయస్సు (రుతువిరతి) కి ముందే పూర్తిగా ఆగిపోకపోతే, ఈ పరిస్థితిని “అమెనోరియా” లేక “ముట్టుకాకపోవడం” అని పిలుస్తారు. బహిష్ఠు కాకుండటం అని కూడా దీన్ని వ్యవహరిస్తారు. మచ్చ ఏర్పడటం, గర్భాశయం లేదా యోని లేకపోవడం, జీవక్రియ లోపాలు, హార్మోన్ల అసమతుల్యత మరియు మరిన్ని అటువంటి జన్యుపరమైన లేదా మధ్యలో పొందిన కారణాల వల్ల ముట్టుకాకపోవడమనే (అమెనోరోయా) రుగ్మత లేక సమస్య సంభవిస్తుంది. కుషింగ్స్ సిండ్రోమ్ మరియు చక్కెరవ్యాధి (డయాబెటిస్) వంటి మధ్యలో పొందిన రుగ్మతలకు నివారణ సాధ్యమవుతుంది. రోగ నిర్ధారణలో శారీరక పరీక్ష, హార్మోన్ స్థాయిలకు ప్రయోగశాల పరీక్షలు, గర్భాశయం యొక్క ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్ మరియు ఇతర ఇమేజింగ్ పరీక్షలు ఉంటాయి. చికిత్సలో అంతర్లీన పరిస్థితిని నయం చేయడం మరియు జన్యుపరమైన లోపాల విషయంలో కష్టంగా ఉంటుంది. హార్మోన్ల పునస్థాపన (replacement) చికిత్స చాలా సందర్భాలలో చికిత్సకు ప్రధానమైనది. కారణం జన్యుసంబంధం కాని చాలా సందర్భాల్లో ఫలితం బాగుంటుంది.