మహిళలు అనుభవించే అతి సాధారణ రొమ్ము సంబంధిత సమస్య అనేది రొమ్ము నొప్పి, దీనిని మాస్టాల్జియా అని కూడా అంటారు. మహిళలలో 70% మంది తమ జీవితంలో ఏదో ఒక సమయంలో ఈ నొప్పికు గురి అవుతారు. ఋతుస్రావాలు, అంటువ్యాధులు, మంట (వాపు), చనుబాలివ్వడం మొదలైనవాటి వలన మీ రొమ్ములో నొప్పి కలుగవచ్చు. ఒకటి రొమ్ము లేదా రెండింటిలోనూ మీకు నొప్పి కలుగవచ్చు.

సాధారణంగా, రొమ్ము నొప్పి తీవ్రమైన స్థితి కాదు. తరచూ మహిళలు రొమ్ము క్యాన్సర్ లక్షణం కావచ్చని ఆందోళన చెందుతుంటారు, కానీ ఇది చాలా అరుదుగా కలుగుతుంది.

అయితే, తక్షణమే నిర్ధారణ మరియు చికిత్స చేయుట మంచిది. అవసరమైన పరీక్షలు చేయించుకోమని వైద్యులు మీకు చెబుతారు. చికిత్స అనేది సంబంధిత కారణం మీద ఆధారపడి ఉంటుంది, తేలికపాటి నొప్పి అయితే కౌన్సెలింగ్ చేయబడుతుంది మరియు నొప్పి మరింత తీవ్రతరంగా ఉంటే, మందులు లేదా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు వాడబడతాయి. శస్త్రచికిత్స చాలా అరుదుగా అవసరమవుతుంది.

వ్యాధి లక్షణాలు, కారణాలు మరియు రొమ్ము నొప్పి యొక్క చికిత్స గురించి వివరంగా తెలుసుకోవడానికి చదవండి.

  1. రొమ్ము నొప్పి రకాలు - Breast pain types in Telugu
  2. రొమ్ము నొప్పి లక్షణాలు - Breast pain symptoms in Telugu
  3. రొమ్ము నొప్పికు కారణాలు - Causes of breast pain in Telugu
  4. రొమ్ము నొప్పి నివారణ - Breast pain prevention in Telugu
  5. రొమ్ము నొప్పి యొక్క నిర్ధారణ - Breast pain diagnosis in Telugu
  6. రొమ్ము నొప్పికి చికిత్స - Breast pain treatment in Telugu

రొమ్ము నొప్పి రెండు రకాలు – సైక్లిక్ మరియు నాన్-సైక్లిక్. మొదటిది మీ ఋతుచక్రానికి సంబంధం కలిగి ఉంటుంది, రెండవది ఏ ఇతర కారణం వలన అయినా కలిగే రొమ్ము నొప్పిని సూచిస్తుంది.

  • సైక్లిక్ రొమ్ము నొప్పి

మహిళలలకు కలిగే రొమ్ము నొప్పి యొక్క సాధారణ రకం సైక్లిక్ రొమ్ము నొప్పి. ఇలా జరుగుతుంది ఎందుకంటే ఋతుచక్రాల సమయంలో హార్మోన్లలో కలిగే మార్పులు. మీ ఋతుస్రావం ప్రారంభమయ్యే కొద్ది రోజుల ముందు ఈ నొప్పి మీకు కలుగవచ్చు.

  • నాన్-సైక్లిక్ రొమ్ము నొప్పి

నాన్-సైక్లిక్ నొప్పి అనేది మీ రుతుస్రావానికి సంబంధించినది కాదు. ఈ రకమైన నొప్పి రుతుస్రావ తేదీలకు సంబంధo లేకుండా ఎప్పుడైనా కలుగవచ్చు. ఇది సాధారణంగా మెనోపాజ్ పూర్తి అయిన వృద్ధ మహిళలతో కలుగుతుంది.

Women Health Supplements
₹719  ₹799  10% OFF
BUY NOW

మీ రొమ్ము నొప్పి యొక్క రకం ఆధారపడి రొమ్ము నొప్పి లక్షణాలు ఉంటాయి. వివిధ సంకేతాలు మరియు లక్షణాలు కలిగిన సైక్లిక్ మరియు నాన్-సైక్లిక్ రొమ్ము నొప్పులు ఉంటాయి.

సైక్లిక్ రొమ్ము నొప్పి

కింది లక్షణాలు సాధారణంగా సైక్లిక్ రొమ్ము నొప్పితో సంబంధం కలిగి ఉంటాయి:

  • రెండు రొమ్ములలోను నొప్పి కలుగుతుంది.
  • ఇది సాధారణంగా నిస్తేజంగా మరియు బాధాకరంగా ఉంటుంది.
  • ఛాతీలో గడ్డలుగా ఉన్నట్లు కూడా కొన్నిసార్లు అనిపిస్తుంది.
  • ఇది మీ ఋతుస్రావం ప్రారంభానికి కొన్ని రోజుల ముందు మొదలవుతుంది మరియు కనీసం ఒక వారం పాటు కొనసాగుతుంది.
  • మీ ఋతుస్రావం ముగిసిన తర్వాత ఇది ఆగిపోతుంది.
  • నొప్పి సాధారణంగా ఛాతీ యొక్క ఎగువ భాగంలో కలుగుతుంది కానీ అది తీవ్రతరం అయినప్పుడు ఇతర భాగాలకు కూడా వ్యాప్తి చెందుతుంది.
  • చక్రీయ నొప్పి అనేది సాధారణంగా యువ మహిళలలో కనిపిస్తుంది.

నాన్-సైక్లిక్ రొమ్ము నొప్పి

నాన్-సైక్లిక్ రొమ్ము నొప్పి అనేది క్రింది లక్షణాల ఆధారంగా ఊహించబడుతుంది:

  • సాధారణంగా వృద్ధ మహిళల్లో, ప్రత్యేకంగా మెనోపాజ్ తర్వాత కనిపిస్తుంది.
  • ఈ రకమైన రొమ్ము నొప్పికి ఋతు చక్రాలతో సంబంధం లేదు మరియు ఇది మీ ఋతుస్రావ తేదీలకు సంబంధం లేకుండా కలుగవచ్చు.
  • సాధారణంగా, ఇది రొమ్ములలో ఒక దానిలో కలుగవచ్చు మరియు నిర్దిష్ట ప్రాంతాల్లో నొప్పి కలుగుతుంది.
  • వ్యాయామం తర్వాత లేదా ప్రభావిత ప్రాంతం మీద ఒత్తిడిని వర్తింపజేయడం ద్వారా నొప్పి పెరగవచ్చు.
  • ఇది నిరంతరo ఉండేది మరియు సమస్యాత్మకమైనది.
  • మీరు మీ చంకలలో గడ్డలూ లేదా నోడ్లను కలిగి ఉండవచ్చు, అలాగే మీ భుజం, మోచేయి, వీపు మొదలైన భాగాలలో నొప్పిని కలిగిఉండవచ్చు.

వివిధ కారణాలు రొమ్ము నొప్పికు దారి తీయవచ్చు. చాలా సాధారణంగా ఇది ఋతుచక్రం ప్రారంభానికి కొన్ని రోజుల ముందు లేదా హార్మోన్ల అసమతుల్యత కారణంగా కలుగుతుంది. అయితే, క్రింద వివరించిన విధంగా, ఇతర కారణాలు కూడా ఉండవచ్చు.

హార్మోన్ అసమతుల్యత

  • హార్మోన్ల హెచ్చుతగ్గులు సంభవిస్తున్నప్పుడు కలిగే మూడు ప్రధాన దశలను రజస్వల అంటారు (మొదటిసారి ఒక అమ్మాయి తన పీరియడ్ అయినప్పుడు), గర్భం మరియు రుతుస్రావం (ఋతు చక్రాల ఆపుదల). ఈ దశల్లో, మీరు మీ రొమ్ములో మార్పులను అనుభవించవచ్చు, ఇది మీ ఛాతీలో నొప్పి, భారము మరియు నిద్రపోవటానికి కారణం కావచ్చు.
  • సైక్లిక్ రొమ్ము నొప్పి యొక్క ప్రధాన కారణం మీ ఋతుస్రావం. అయితే, అనేక అధ్యయనాలు విరుద్ధమైన ఫలితాలను కలిగి ఉంటాయి, చక్రీయంగా వచ్చే రొమ్ము నొప్పి కలిగి ఉన్న మహిళలు వారి శరీరంలో గల ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్, మరియు ప్రొలాక్టిన్ హార్మోన్ యొక్క మార్పులు కలుగుటను గుర్తిస్తారు. అండోత్సర్గము (అండాశయాల నుండి ఒక గుడ్డు విడుదల) తర్వాత మొదలయ్యే చక్రం యొక్క పృష్ట సంబంధిత దశలో వారి శరీరంలో సంభవిస్తుంది.
  • రొమ్ము నొప్పి కారణాలపై వైద్య సాహిత్యం యొక్క క్రమబద్ధమైన సమీక్షలో రుతుస్రావం తర్వాత హార్మోన్ పునఃస్థాపన చికిత్సలో పాల్గొనే మహిళలకు రొమ్ము క్యాన్సర్లు కలిగే ప్రమాదం ఎక్కువగా ఉందని సూచించబండింది. అందువల్ల, వారు రొమ్ము నొప్పిలో గణనీయంమైన మార్పులను అనుభవించవచ్చు.

రొమ్ము తిత్తులు

ఛాతీలో అసాధారణ ద్రవంతో నిండిన తిత్తులు కూడా మీ రొమ్ములో నొప్పి, అసౌకర్యం మరియు భారాన్ని కలిగించవచ్చు. మీరు మీ ఛాతీలో తిత్తులు కలిగి ఉన్నట్లు అనుమానించినట్లయితే మీ వైద్యుడిని సంప్రదించి మీయంతటగా చికిత్స చేసుకోవచ్చు.

బ్రెస్ట్ ఫీడింగ్

ఛాతీ నొప్పితో బాధపడుతున్న మహిళలపై నిర్వహించిన ఒక అధ్యయనంలో, రొమ్ము నొప్పికు అత్యంత సాధారణ కారణం పాలు నాళాలు బ్లాక్ అవటాన్ని సూచిస్తుంది. ఈ ప్రతిష్టంభన రొమ్ము నొప్పికి కారణమైందని పరిశోధకులు కనుగొన్నారు.

అందువల్ల, చికిత్స చేయకుండా వదిలేస్తే, అది ప్రభావితమైన రొమ్ములో వాపు మరియు వ్యాధి సంక్రమణను కలిగించవచ్చు.

ఛాతీ కండరాలలో నొప్పి

కొన్నిసార్లు, ఛాతీ గోడ కండరాలలో గాయం, వాపు లేదా సంక్రమణ ఉన్నప్పుడు కూడా రొమ్ము నొప్పి కలుగుతుంది. ఈ నొప్పి ఛాతీ కండరాల నుండి మీ రొమ్ముకి వ్యాపించవచ్చు. సంపూర్ణ చికిత్స పొందడానికి మీ వైద్యుడిని సందర్శించాలి.

ట్రామా

మీ రొమ్ముకు ఏదైనా ఆకస్మిక దెబ్బ లేదా గాయం వలన నిరంతర రొమ్ము నొప్పికి కారణమవుతుంది. ప్రభావిత ప్రాంతంలో తాకినపుడు లేదా ఒత్తిడి కలిగించినప్పుడు అది ఒక ట్రిగ్గర్ పాయింట్ వలె పనిచేస్తుంది.

ఫైబ్రోసిస్టిక్ వ్యాధి

చాలామంది మహిళలు ఫైబ్రోసిస్టిక్ వ్యాధిని కలిగి ఉంటారు, ఇందులో రొమ్ము కణజాలాలు చిన్న ద్రవంతో నిండిన తిత్తులను ఏర్పడేలా చేస్తాయి, ఇవి రొమ్ములలో గడ్డలు ఏర్పడుటకు మరియు నొప్పికి కారణమవుతాయి. ఈ పరిస్థితి క్యాన్సర్ కానిది మరియు చాలా సాధారణమైనది. వాస్తవానికి, అనేక మంది వైద్యులు "ఫైబ్రోసైస్టిక్ వ్యాధి" అనే పదాన్ని ఉపయోగించడం ఆపివేశారు మరియు దానికి బదులుగా "ఫైబ్రోసిస్టిక్ బ్రెస్ట్స్" అని పిలువడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.

రొమ్ము నొప్పికి ఇతర కారణాలు

  • ఛాతిలో ఒక ప్రక్క కలిగే నొప్పి
    మీ ఛాతీ యొక్క భుజాలపై కండరాల యొక్క వాపు, గాయం లేదా సంక్రమణం ఉన్నపుడు, రొమ్ము నొప్పి కూడా కలుగుతుంది. ఈ నొప్పి కూడా రొమ్ములకు అంతటా ప్రసరించవచ్చు.
     
  • ఖగోళవ్యాధి
    పెరిగిన ఒత్తిడి కారణంగా ఎముకల మృదులాస్థి యొక్క వాపుని ఖగోళవ్యాధి అంటారు. ఇది టియెట్స్ వ్యాధికి సంబంధించినది. ఈ నొప్పి ఛాతీలో పుడుతుంది, కానీ అది రొమ్ములలో నొప్పిని కలిగించవచ్చు. 
     
  • జీవనశైలి సంబంధిత కారకాలు
    రొమ్ము నొప్పిని ప్రభావితం చేసే కారకాలను పరిశోధించడానికి 2016 లో ఒక అధ్యయనం చేయబడింది. ఇది ఒత్తిడితో కూడిన జీవనశైలి, ఆందోళన, కాఫీ వినియోగం, మొదలైనవి రొమ్ము నొప్పికి సంబంధించినవి.
     
  • అనుకూలం కాని BRA
    మహిళలలో చాలా మంది తమకు అనుకూలం కాని BRA ను ధరిస్తారు, ఇది ఛాతీలో కలిగే నొప్పికి సంబంధం కలిగి ఉంటుంది. అందువల్ల మీరు సరైన కొలతలతో ఒక సౌకర్యవంతమైన BRA ను ధరించాలి. సరైన కొలత పొందడానికి, కొలతల టేప్ ఉపయోగించాలి: కొలత చేయడానికి స్నేహితులు లేదా ఒక నిపుణుని నుండి కూడా మీరు సహాయం పొందవచ్చు.
     
    • బ్యాండ్ పరిమాణం: మీ చాతి క్రింద వైపు నుండి కొలత చేయుట ద్వారా బ్యాండ్ పరిమాణం పొందవచ్చు
    • చాతి యొక్క పైభాగం: బస్ట్/ కప్ పరిమాణం (A, B, C లేదా D): దాని పూర్తి భాగం యొక్క పరిమాణాన్ని కొలవాలి, సాధారణంగా ఇది నిపుల్ స్థాయిలో ఉంటుంది.
       
  • ధూమపానం మరియు మద్యపానం సేవించడం
    పొగాకు, మద్యపానం, మందులు మొదలైన పదార్థాల దుర్వినియోగం కూడా రొమ్ము నొప్పికి కారణమవుతుంది. అవి మీ శరీరంలోని సెక్స్ హార్మోన్ స్థాయిలలో అసమానతలను కలిగిస్తాయి మరియు రొమ్ము క్యాన్సరుతో సహా రొమ్ము సమస్యలను పెంచే ప్రమాదాన్ని మీకు కలిగిస్తాయి. 
     
  • క్యాన్సర్
    అరుదుగా, రొమ్ము నొప్పి అనేది రొమ్ము క్యాన్సరుతో సంబంధం కలిగి ఉంటుంది. UK యొక్క NHS ప్రకారం, రొమ్ము నొప్పి సాధారణంగా రొమ్ము క్యాన్సర్ యొక్క లక్షణం కాదు. అంతేకాకుండా, పైన పేర్కొన్న ఇతర కారణాలు ఛాతీలో కలిగే నొప్పికి నిజమైన కారణం కావచ్చు. అయితే, మీరు నొప్పితో పాటు మీ రొమ్ములో ఒక గడ్డ ఉన్నట్లు గమనించినట్లయితే, దాన్ని తక్షణమే వైద్యునిచే తనిఖీ చేయించాలి. 
     
  • ఇతర వైద్య పరిస్థితులు
    నొప్పి మీ ఛాతీకి ప్రసరించే కొన్ని ఇతర పరిస్థితులలో ఏంజినా (గుండె సంబంధిత ఛాతీ నొప్పి), పక్కటెముక బీటిక కావడం, కరోనరీ ధమని వ్యాధి, రక్తహీనత, కడుపులో పుండ్లు వంటివి ఉంటాయి.

వైద్యుని ఎప్పుడు సంప్రదించాలి?

మీ రొమ్ము నొప్పి క్రింద పేర్కొన్న ఇతర లక్షణాలతో సంబంధం కలిగి ఉంటే, మీరు వెంటనే మీ వైద్యుని సంప్రదించడం ముఖ్యం:

  • స్వీయ పరీక్ష సమయంలో మీ ఛాతీలో లేదా చంకలో ఒక గడ్డ ఉన్నట్లు అనుమానం కలుగుట.
  • మీ చనుమొనల నుండి (నీళ్ళు, తెల్లటి-పసుపు లేదా రక్తస్రావం) కారడం.
  • మీ రొమ్ములో సొట్టలు పడుట (ఒక కన్నంగా కనిపించుట).
  • మీ రొమ్ము యొక్క రంగులో మార్పు.
  • మీ చనుమొనల స్థానంలో ఒక విచలనం.
  • మీ రొమ్ము యొక్క చర్మంపై ఒక అల్సర్.
  • ఒకటి లేదా రెండు రొమ్ముల ఆకస్మిక పెరుగుదల.
myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Prajnas Fertility Booster by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors for lakhs of male and female infertility problems with good results.
Fertility Booster
₹892  ₹999  10% OFF
BUY NOW

రొమ్ము నొప్పి నివారణ దాని రకాన్ని బట్టి ఉంటుంది. మేము పైన చెప్పినట్లుగా, ఋతు చక్రాల సమయంలో హార్మోన్ల మార్పులు చోటుచేసుకుంటాయి అందువలన ఛాతి నొప్పి ఉన్నట్లు అనిపిస్తుంది మరియు అందువల్ల దీనిని నివారించడానికి మీరు ఏమియూ చేయలేరు. అయితే, మీ జీవనశైలిని మార్చడం మరియు నిరంతర తనిఖీలు మీ రొమ్ము నొప్పి కలిగించే అవకాశాలు తగ్గించవచ్చు. దీనిని నివారించడానికి మీరు చేయవలసిన కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి:

  • ఆరోగ్యకరమైన బరువును కాపాడుకోవాలి మరియు పోషక ఆహారాన్ని తీసుకోవాలి. నిరంతర వ్యాయామం మరియు ఆరోగ్యకరమైన ఆహారం మీ శరీరంలో హార్మోన్ల హెచ్చుతగ్గుల, వ్యాధి సంక్రమణలు, వాపులు మరియు టాక్సిన్ చేరడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
  • మీ రొమ్ము కణజాలంలో ఎలా అనిపిస్తుందో తెలుసుకోవడానికి ప్రతీ నెలలో మీ రొమ్ముల యొక్క స్వీయ-పరిశీలన చేయాలి. క్రమంగా దీన్ని చేయడం ద్వారా, మీరు మీ ఛాతీలో కలిగే మార్పులను గుర్తించగలుగుతారు.
  • మీరు 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి ఉన్నట్లయితే ప్రతీ మూడు సంవత్సరాలలో ఒకసారి, మీరు 30 ఏళ్ళకు పైబడి ఉన్నట్లయితే ప్రతీ సంవత్సరంలో ఒక సారి తనిఖీ చేయించుకోవాలి.

మీ నొప్పి ఎలా, ఎప్పుడు, ఎక్కడ, మరియు ఎంతకాలం నుండి కలుగుతుందనే వివరాలను పొందడానికి కొన్ని ప్రశ్నలను మీ వైద్యుడు అడుగవచ్చు. మీరు చనుబాలివ్వడం లేదా గర్భనిరోధక మాత్రలు వాడటం మొదలైనవి చేస్తుంటే మీకు జరిగిన గర్భాలు, గర్భస్రావాలు (ఏవైనా ఉంటే) గురించి అడుగవచ్చు. ఆ తరువాత, మీ వైద్యుడు ఏదైనా నొప్పి, వాపు, చాతిలో గడ్డలు, పుండ్లు మొదలైన వాటికి సంబంధించి మీ ఛాతిని పరిశీలించవచ్చు

కొన్నిసార్లు, క్లినికల్ అంచనాతో సరియైన నిర్ణయం చేయబడకపొతే మీరు ఈ క్రింద నీయబడిన కొన్ని పరీక్షలను చేయించుకోవాలి:

  • అల్ట్రాసౌండ్
    35 ఏళ్ళ కన్నా తక్కువ వయస్సు గల స్త్రీలలో ఇది ప్రాధాన్యతగా చేయవలసిన ఒక డయాగ్నొస్టిక్ పరీక్ష. ఈ పరీక్ష మీ రొమ్ము కణజాలం గుండా అల్ట్రాసౌండ్ తరంగాలను పంపుటకు ఉపయోగపడుతుంది. ఇది జరిగినప్పుడు, మీ ఛాతీ యొక్క అంతర్గత చిత్రం మీ వైద్యుని యొక్క కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఈ పరీక్ష ద్వారా చిన్న తిత్తులు (ఏదైనా ఉంటే) మరియు మీ రొమ్ము కణజాలంలో మార్పులను గుర్తించవచ్చు.
     
  • మమ్మోగ్రఫి
    మామ్మోగ్రఫీ అనేది కూడా ఒక డయాగ్నొస్టిక్ పరీక్షగా చెప్పవచ్చు, ఇది సాధారణంగా 35 ఏళ్లలోపు వయస్సులో ఉన్న మహిళల్లో ప్రాధాన్యతగా చేయబడుతుంది. ఈ పరీక్షలో, తక్కువ మోతాదులో X- కిరణాలను మీ రొమ్ము కణజాలం గుండా ప్రసారం చేయబడతాయి మరియు మీ వైద్యుడు చిత్రంలో కనిపించే ఏ అసాధారణత అయినా గుర్తించగలరు. రొమ్ము క్యాన్సర్ మరియు తిత్తుల సమస్య వంటి ఒక కుటుంబ చరిత్ర కలిగిన మహిళలు రొమ్ము క్యాన్సర్ నివారించడానికి వారి వైద్యుడు చేసిన సిఫార్సు ప్రకారం సంవత్సరానికి ఒకసారి పరీక్ష చేయించుకోవాలి.
     
  • MRI
    MRI లేదా మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ అనేది చాలా మంచి డయాగ్నొస్టిక్ పరీక్ష, ఇది రొమ్ము కణజాల మార్పులను గుర్తించడం మాత్రమే కాకుండా దగ్గరి శరీర భాగాలలో వాటి వ్యాప్తిని తెలియచేస్తుంది.
     
  • చెస్ట్ ఎక్స్-రే
    రొమ్ము నొప్పి కలిగించే మీ ఛాతీ చుట్టూ ఉన్న ఇతర నిర్మాణాలకు సంబంధించిన అసాధారణాలను గుర్తించడంలో చెస్ట్ X- రే సహాయపడుతుంది.
Ashokarishta
₹359  ₹400  10% OFF
BUY NOW

మీ రొమ్ము నొప్పి యొక్క చికిత్స దాని సంబంధిత కారణం మీద ఆధారపడి ఉంటుంది.

  • కౌన్సెలింగ్
    తేలికపాటి రొమ్ము నొప్పికు సాధారణంగా ఎలాంటి చికిత్స అవసరం లేదు. మీ రొమ్ము నొప్పి గురించి మీ డాక్టరు హామీ మరియు సలహాలు నిజంగా మీకు సహాయపడతాయి. మీ వైద్యుడు సాధారణంగా సంభవించే రొమ్ము నొప్పి యొక్క వివరాలు మీకు అందిస్తారు, దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి మీరు ఏదైనా ఆవేశపూరిత లేదా మానసిక సమస్య యొక్క చికిత్స కోసం సంప్రదించవచ్చు.
     
  • ఈవెనింగ్ ప్రిమ్ రోజ్ ఆయిల్ మరియు విటమిన్ ఇ
    "చక్రీయ మస్టాల్జియా యొక్క నిర్వహణ కోసం విటమిన్ E మరియు  ఈవెనింగ్ ప్రిమ్ రోజ్ ఆయిల్" గురించి 2010 లో ఒక అధ్యయనం నిర్వహించబడింది. ఇది విటమిన్ E యొక్క 800 mg (1200 IU), 3000 mg ఈవెనింగ్ ప్రిమ్ రోజ్ ఆయిల్ లేదా రెండింటి కలయికతో తీసుకోవడం వలన మీ చక్రీయ రొమ్ము నొప్పిను తగ్గించవచ్చు. కనీసం ఆరు నెలల పాటు వాటిని తీసుకోవడం వలన రొమ్ము నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. అయినప్పటికీ, ఈ పదార్ధాల యొక్క ప్రభావమునకు ఆధారాలను ఇప్పటికీ తగినంతగా పరిగణించబడలేదు. అందువల్ల ఈ పదార్ధాలను తీసుకునే ముందు మీరు డాక్టరుతో మాట్లాడాలి. మీ డాక్టర్ మీ శరీర రకం, వయస్సు, మరియు వైద్య పరిస్థితి ఆధారంగా సరైన మోతాదును తెలియజేస్తారు. 
  • మందులు
    మీ రొమ్ము నొప్పి తీవ్రoగా ఉంటే మీ డాక్టర్ కొన్ని మందులను సూచించవచ్చు. వీటిలో డనజోల్, టమోక్సిఫెన్, టొరెమీఫెన్, నోటి ద్వారా తీసుకొనే డైక్లోఫెనాక్ సోడియం, ఐబుప్రోఫెన్ మొదలైన NSAID లు (స్టెరాయిడ్ ఇన్ఫ్లామేటరీ డ్రగ్స్). ఈ మందులు మీ రొమ్ము నొప్పిని తగ్గించగలవు కానీ అవి కూడా దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి. అందువల్ల, మీ వైద్యుడిని సంప్రదించకుండా ఎలాంటి మాత్రలు తీసుకోరాదు. 
  • స్థానిక స్టెరాయిడ్ లేదా మత్తుమందు ఇంజక్షన్
    ఒక వేళ ఛాతి మృదులాస్థుల యొక్క వాపు, ఛాతీ పార్శ్వ నొప్పి, గాయం, మొదలైనవి కలిగిన సందర్భాల్లో మీ వైద్యుడు మీకు నొప్పి కలిగిన భాగంలో స్టెరాయిడ్ లేదా మత్తుపదార్థం (నొప్పిని తెలియకుండా చేయు ఔషధం) యొక్క ఒక ఇంజెక్షన్ ఇవ్వవచ్చు. ఈ ఇంజెక్షన్లు వెంటనే నొప్పిని తగ్గిస్తాయి.
     
  • సరిగా అనుకూలమైన బ్రా వేసుకోవడం
    భవిష్యత్తులో రొమ్ము నొప్పి నిరోధించడానికి సరిగా అనుకూలమైన బ్రాసరీని ధరించాలి. పైన వివరించిన విధంగా, మీ కోసం సరైన పరిమాణాన్ని మీరు నిర్ణయించుకోవాలి.
     
  • సర్జరీ
    శస్త్రచికిత్స అరుదుగా సూచించబడుతుంది, ఎందుకంటే సంక్లిష్టత ఎక్కువగా ఉంటుంది.

వనరులు

  1. Powell RW. Breast Pain. In: Walker HK, Hall WD, Hurst JW, editors. Clinical Methods: The History, Physical, and Laboratory Examinations. 3rd edition. Boston: Butterworths; 1990. Chapter 169.
  2. Ochonma A Egwuonwu, Stanley NC Anyanwu, Gabriel U Chianakwana, Eric C Ihekwoaba. Breast Pain: Clinical Pattern and Aetiology in a Breast Clinic in Eastern Nigeria. Niger J Surg. 2016 Jan-Jun; 22(1): 9–11. PMID: 27013851
  3. Santen RJ. Benign Breast Disease in Women. [Updated 2018 May 25]. In: Feingold KR, Anawalt B, Boyce A, et al., editors. Endotext [Internet]. South Dartmouth (MA): MDText.com, Inc.; 2000-.
  4. National Cancer Institute [Internet]. Bethesda (MD): U.S. Department of Health and Human Services; Breast Changes and Conditions
  5. Goyal A. Breast pain. BMJ Clin Evid. 2011 Jan 17;2011. pii: 0812. PMID: 21477394
  6. Shakuntla Gautam, Anurag Srivastava, Kamal Kataria, Anita Dhar, Piyush Ranjan, Janmejay Kumar. New Breast Pain Chart for Objective Record of Mastalgia. Indian J Surg. 2016 Jun; 78(3): 245–248. PMID: 27358525
  7. Leung SS. Breast pain in lactating mothers.. Hong Kong Med J. 2016 Aug;22(4):341-6. PMID: 27313273
  8. Pruthi S et al. Vitamin E and evening primrose oil for management of cyclical mastalgia: a randomized pilot study. Altern Med Rev. 2010 Apr;15(1):59-67. PMID: 20359269
Read on app