ఇప్పుడు మీ శిశువు కడుపులో వేగంగా పెరుగుతోంది మరియు దాని పోషక అవసరాలను తీర్చడానికి మీరు ఎక్కువ తినవలసి ఉంటుంది. వాస్తవానికి, మీరు ఇప్పటికే ఎక్కువ ఆకలిని అనుభవిస్తుంటారు మరియు తరచుగా ఏదోకటి తినాలనే కోరికను కలిగి ఉంటారు.
సాధారణంగా, అధిక లావు లేని స్త్రీ రెండవ త్రైమాసికంలో తన రోజువారీ ఆహారంలో 400 కేలరీలను అదనంగా జోడించాల్సి ఉంటుంది. అయితే, మీరు అతిగా తినడం ప్రారంభించి అదనపు బరువు పెరగమని అర్ధం కాదు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.
ఒకేసారి పెద్దమొత్తంలో కాకుండా తరచుగా చిన్న చిన్న మొత్తాలుగా తినండి. ఇది మిమ్మల్ని సంతృప్తికరంగా (కడుపు నిండినట్లు) ఉంచడమే కాకుండా, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా మీ శరీరానికి స్థిరమైన శక్తి లభించేలా చేస్తుంది. మీ మరియు మీ శిశువు ఆరోగ్యానికి ఎటువంటి ఆటంకం కలిగించని మీరు సురక్షితంగా మీ డైట్ లో చేర్చగల ఆహార పదార్దాల జాబితా ఇక్కడ ఇవ్వబడింది.
ఆకుకూరలు మరియు తొక్కలతో సహా పండ్లు: ఇవి మీ ఖనిజ మరియు విటమిన్ అవసరాలను తీర్చడమే కాక మీ ఆహారంలో ఫైబర్ల యొక్క అద్భుతమైన మూలాలుగా పనిచేస్తాయి. పండ్లు మరియు కూరగాయలు పుష్కలంగా తినడం వల్ల మలబద్దకాన్ని తగ్గిస్తాయి, తద్వారా మొలల ప్రమాదం కూడా తగ్గుతుంది.
పాల ఉత్పత్తులు: ఫ్యాటీ ఆసిడ్ల సహజ వనరుగా మాత్రమే కాకుండా, మీ శరీరానికి రోజువారీ అవసరమైన కాల్షియం మోతాదును అందిచడంలో ఇవి సహాయపడతాయి. మీరు రోజుకు 1 నుండి 3 సార్లు పాల ఉత్పత్తులను ఎంచుకోవచ్చు. అయితే, ఇది మీ శారీరక అవసరాలు మరియు స్థితి మరియు మీ శిశువు అవసరాలను బట్టి మారవచ్చు. కాబట్టి, పాల ఉత్పత్తుల సరైన పరిమాణాన్ని తెలుసుకోవడానికి మీరు పోషకాహార నిపుణుడిని సంప్రదించాలని ఎల్లప్పుడూ సిఫార్సు చేయబడుతుంది.
అయితే, బ్రీ (brie) మరియు కామెమ్బెర్ట్ (camembert) వంటి సాఫ్ట్ చీజ్ లను నివారించడం మంచిది.
ద్రవాలను తీసుకోవడం: మీరు ఆరోగ్యకరమైన ఆహార విధానాన్ని పాటిస్తున్నపుడు దానిలో ద్రవాలను (ఫ్లూయిడ్స్) తీసుకోకపోవడం అనేది ఉండదు. గర్భిణీ స్త్రీకి ప్రతిరోజూ 2-3 లీటర్ల నీరు అవసరం. కాబట్టి, మీరు తగినంత నీటిని తీసుకోవడం అవసరం. మీరు పండ్ల రసాలను కూడా ఎంచుకోవచ్చు, అయితే, ప్రాసెస్ చేసిన రసాలలో ప్రిజర్వేటివ్‌లు మరియు అదనపు ఫ్లేవర్లు ఉంటాయి అవి మీ లేదా మీ పిల్లల ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు కాబట్టి పండ్ల రసాలను ఇంట్లో తయారు చేసుకుని త్రాగడం మంచిది. అలాగే, వాటిలో అదనపు చక్కెరలు ఉంటాయి. అవి మీకు పోషకాలను అందించకుండా కేలరీల సంఖ్యను అధికంగా పెంచుతాయి.
కాఫీ మరియు టీలను కూడా మానుకోవాలి ఎందుకంటే శిశువు అభివృద్ధికి కెఫిన్ మంచిది కాదు. మద్యం వలన కూడా అదే జరుగుతుంది.
మాంసం, చేపలు మరియు గుడ్లు: వండిన మాంసం, చేపలు మరియు గుడ్లను ఎంచుకోవడం మంచిది మరియు పచ్చి లేదా సరిగ్గా వండని మాంసాలను ఎంచుకోకూడదు, ఎందుకంటే చాలావరకు ఈ ఉత్పత్తులు లిస్టిరియోసిస్ మరియు సాల్మొనెలోసిస్ యొక్క అవకాశాలను పెంచుతాయి. మాంసాలను పూర్తిగా వండటం వల్ల వీటిలోని వ్యాధికారక క్రిములు చచ్చిపోతాయి. అలాగే, అధిక కొవ్వు ఉండే మాంసాల కంటే లీన్ మాంసాలు (లీన్ మీట్) మంచి ఎంపిక మరియు ట్యూనా, ట్రౌట్, సార్డైన్ మరియు సాల్మన్ వంటి ఆయిలీ చేపలను తగ్గించడం మంచిది.
పైన పేర్కొన్న ఆహారాలు మాత్రమే కాకుండా, తృణధాన్యాలు మరియు అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ను మీ ఆహారంలో చేర్చడం మంచిది.