పెరుగుతున్న శిశువు దాని పోషణ మొత్తాన్ని తల్లి నుండి పొందుతుంది. శిశువు యొక్క సరైన పెరుగుదల మరియు అభివృద్ధి కోసం, మీ గర్భధారణలో పూర్తిగా సమతుల్య ఆహారాన్ని అనుసరించడం చాలా ముఖ్యం. ఆకుపచ్చని కూరగాయలు మరియు పండ్లతో సహా మీకు సరైన మొత్తంలో పోషకాలు లభించేలా నిర్ధారించుకోవచ్చు. అయినప్పటికీ, అతిగా తినకూడదు, శరీరం కోరినంత మాత్రమే తినాలి. భారీ భోజనం తినడానికి బదులుగా, రోజంతా 4-5 సార్లు కొద్దిపాటి వ్యవధుల్లో కొద్ది కొద్దిగా భోజనం తినొచ్చు.
మీ ఆహార అవసరాల గురించి మీరు చాలా ఆందోళన చెందుతుంటే, మీరు పోషకాహార నిపుణుడిని సంప్రదించవచ్చు. అయినప్పటికీ, మీ గర్భధారణ మూడవ నెలలో మీరు ఆరోగ్యంగా మరియు బలంగా ఉండటానికి మీకు సహాయపడే కొన్ని ఆహారాలు ఈ కింద వివరిస్తున్నాం.
పీచుపదార్థాలు (ఫైబర్)
పీచు (ఫైబర్) అధికంగా ఉండే ఆహారం తినడంవల్ల మీ ప్రేగు కదలికలు క్రమంగా ఉండేట్లు మరియు మీరు మలబద్దకంతో బాధపడకుండా చూసుకోవచ్చు. అదనపు కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడానికి పీచుపదార్థాలు (ఫైబర్స్) కూడా సహాయపడతాయి. ఫైబర్ యొక్క ఉత్తమ వనరులలో తృణధాన్యాలు, రొట్టె, పండ్లు మరియు కూరగాయలు ఉన్నాయి. పండ్లు కూరగాయలపై హానికరమైన సూక్ష్మజీవులు మరియు సూక్ష్మక్రిములు తొలగిపోయేలా తినే ముందు మీరు వాటిని బాగా కడగాలి మరియు శుభ్రపరచాలి.
నీరు
శరీరం యొక్క చాలా విధులను నిర్వహించడానికి నీరు సహాయపడుతుంది కాబట్టి మీరు నీటిని ఎప్పటికీ తాగకుండా ఉండలేరు. గర్భిణీ స్త్రీలకు వారి శక్తి మరియు ద్రవ అవసరాలను నిర్వహించడానికి ఎక్కువ నీరు అవసరం. గర్భిణీయేతర మహిళలతో పోలిస్తే గర్భిణీ స్త్రీలకు మొత్తం నీటిసేవనం కంటే రోజుకు 300 మి.లీ పెంచాలని యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ సిఫార్సు చేసింది. అదనంగా, పీచుపదార్థాల (ఫైబర్) జీర్ణక్రియకు నీరు సహాయపడుతుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తిన్నపుడు తక్కువ నీరు త్రాగటంవల్ల మంచి కంటే హాని ఎక్కువగా కల్గుతుంది. కాబట్టి, నీటిని తాగకుండా ఉండకండి.
ఫోలిక్ యాసిడ్ అనుబంధక ఆహారం
పిండం యొక్క సరైన మెదడు అభివృద్ధికి, మీరు మొదటి త్రైమాసికం పూర్తయ్యే వరకు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లను తీసుకోవడం చాలా అవసరం. సాధారణంగా, గర్భిణీ స్త్రీలకు 400 మి.గ్రా ఫోలిక్ ఆమ్లం మాత్ర సూచించబడుతుంది, అయితే మీరు స్వీయ-ఔషధ నిర్వహణకు బదులుగా మీ వైద్యుడిని సంప్రదించాలని గట్టిగా సిఫార్సు చేయబడింది. మీరు బ్రెడ్, బచ్చలికూర, సిట్రస్ పండ్లు మరియు బ్రౌన్ రైస్ వంటి ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండే ఆహారాలను కూడా మీ నిత్యాహారంలో జోడించవచ్చు.
కాల్షియం
పిండం యొక్క ఎముకలు మరియు మృదులాస్థిల పెరుగుదలకు కాల్షియం అవసరం. ఒక అధ్యయనం ప్రకారం, గర్భిణీ స్త్రీలు రోజుకు 1000 మి.గ్రా కాల్షియం తీసుకుంటారు. అయితే, కాల్షియం అనుబంధకాలు సాధారణంగా అవసరం లేదు. మీరు కాల్షియం లోపంతో బాధపడుతుంటే, మీ కాల్షియం అవసరాల గురించి తెలుసుకోవడానికి వైద్యుడిని సంప్రదించడం మంచిది. రోజువారీ కాల్షియం అవసరాలను తీర్చడానికి మీరు మీ ఆహారంలో పాశ్చరైజ్డ్ పాలు మరియు పెరుగును కూడా చేర్చవచ్చు.
ఐరన్
పిండం పెరుగుదలకు ముఖ్యమైన మరొక ఖనిజం, ఇనుము. ఇనుము లేకపోవడం గర్భిణీ స్త్రీలలో రక్తహీనతకు కారణమవుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి, అయితే ఇది పుట్టుకతోనే పుట్టడం మరియు నవజాత శిశువు యొక్క తక్కువ బరువుకు దారితీస్తుంది. మొదటి త్రైమాసికంలో ఇనుము డిమాండ్ చాలా తక్కువగా ఉన్నప్పటికీ, పిండం పెరుగుదలతో ఇది తీవ్రంగా పెరుగుతుంది. WHO మార్గదర్శకాల ప్రకారం, గర్భిణీ స్త్రీకి రోజుకు 30 నుండి 60 mg ఎలిమెంటల్ ఇనుము అవసరం. ఇనుము యొక్క సులభంగా లభించే ఆహార వనరులలో పప్పుధాన్యాలు, ఆకుపచ్చ కూరగాయలు, బలవర్థకమైన ధాన్యాలు మరియు టోఫు ఉన్నాయి.
నివారించాల్సిన ఆహారాలు
మీ స్వంత మరియు మీ కడుపులోని శిశువు యొక్క అవసరాలను తీర్చడానికి మీకు చాలా పోషకాహారం అవసరం ఉన్నప్పటికీ, పిండంపై హానికరమైన ప్రభావాన్ని చూపే కొన్ని ఆహారాలు ఉన్నాయి. తినే ముందు మీరు జాగ్రత్తగా ఉండవలసిన ఆహారాల జాబితా ఇక్కడ ఉంది.
- గుడ్డు మరియు కోడిమాంసం ఉత్పత్తులను (పౌల్ట్రీ ప్రొడక్ట్స్) తినే ముందు సరిగ్గా ఉడికించాలి ఎందుకంటే అవి సంక్రమణ మరియు ఫుడ్ పాయిజనింగ్ కు మూలం కావచ్చు. ఎరుపు మాంసం (red meat) మరియు అరుదైన మాంసాలను తినకుండా ఉండడం మంచిది.
- విటమిన్ ఎ అధికంగా ఉండే ఏదైనా ఆహారం, ఇందులో కాలేయ మాంసాలు మరియు సాసేజ్‌లు ఉంటాయి.
- క్రిమిదూరీకరణం చేసిన (పాశ్చరైజ్డ్) పాలను సేవించే ముందు ఎల్లప్పుడూ బాగా మరిగించండి.
- కొన్ని రకాల చేపలను తినడం కూడా నివారించాలి, ఎందుకంటే, ఇవి మీ శిశువు మెదడుపై ప్రతికూల ప్రభావాలను కలిగి ఉండే అవకాశం ఉంది.
- బ్రీ మరియు కామెమ్బెర్ట్ (camembert) వంటి మృదువైన జున్ను తినకపోవటం మంచిది, ఎందుకంటే అవి గర్భస్రావం మరియు మృత శిశువుతో కూడిన ప్రసవాలకు దారితీసే లిస్టెరియా సంక్రమణను కలిగి ఉంటాయి.
- అధిక చక్కెరతో కూడిన ఆహారాలు మరియు అధిక కొవ్వు ఆహారాలు ఖాళీ కేలరీలు కల్గి ఉంటాయి మరియు పోషక పదార్థాలను అందించవు గనుక అధిక కొవ్వు మరియు అదనపు తీపి ఆహారాలను కూడా గర్భవతులు మానుకోవాలి.
- మీ కెఫిన్ సేవనాన్ని కూడా తగ్గించడం మంచిది, ఎందుకంటే ఇది శిశువులలో తక్కువ బరువుకు దారితీస్తుంది. త్యజించాల్సిన కెఫిన్ పదార్థాల్లోమీ రోజువారీ కాఫీ మరియు టీ ఉన్నాయి.
(మరింత చదవండి: గర్భధారణ ఆహారం చార్ట్)