గర్భధారణ సమయంలో అల్ట్రాసౌండ్ నిర్వహించడమనేది తల్లిదండ్రులకు నిజంగా ఒక ఉద్వేగభరితమైన సమయం, ఎందుకంటే ఇది వారి బిడ్డను చేతులతో పట్టుకోక ముందే చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది! కడుపులో ఉన్నశిశివును చూసే అవకాశం కలిగించే అల్ట్రాసౌండ్ పద్ధతులు ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి. గర్భధారణ సమయంలో చేసే అల్ట్రాసౌండ్, దీనినే సోనోగ్రామ్ అని కూడా పిలుస్తారు, ఇది చాలా మంది కాబోయే తల్లులకు సూచించే ఇచ్చే ఒక ప్రినేటల్ పరీక్ష (prenatal test). గర్భధారణ యొక్క వివిధ సమయాల్లో శిశువు, మాయ (ప్లాసెంటా) మరియు అండాశయాల (ఓవరీ) చిత్రాలను చూపించడానికి అల్ట్రాసౌండ్ అధిక-ఫ్రీక్వెన్సీ గల ధ్వని తరంగాలను ఉపయోగిస్తుంది. ఈ విధానం ప్రతిధ్వనిలను (ఎకోలను) రికార్డ్ చేస్తుంది మరియు వాటిని చిత్రాలు లేదా వీడియోలుగా మారుస్తుంది. ఆ విధంగా, వైద్యులు శిశువు ఆరోగ్యం మరియు అభివృద్ధిని తనిఖీ చేయవచ్చు.
అల్ట్రాసౌండ్ ఎప్పుడు నిర్వచించారనే దాని బట్టి శిశువు యొక్క చేతులు, కాళ్ళు మరియు ఇతర శరీర భాగాలను చూడవచ్చు. అల్ట్రాసౌండ్ పిండం అబ్బాయా లేదా అమ్మాయా అనే విషయాన్నీ కూడా తెలియజేస్తుంది. అయితే, భారతదేశంలో మరియు కొన్ని ఇతర దేశాలలో, పిండం యొక్క లింగ నిర్దారణ అనైతికమైనది మరియు నిషేధించబడింది.
శిశువు యొక్క హృదయ స్పందనను గ్రహించవచ్చు, శిశువు కడుపు లోపల ఈత కొట్టడాన్ని (తిరగడాన్ని) కూడా చూడవచ్చు. కాబట్టి, ఈ సాంకేతికత బిడ్డను కనేవారి ఆనందానికి మరో మూలంగా మారింది.