జోలింగర్ ఎలిసన్ సిండ్రోమ్ (జడ్ఇయస్) అంటే ఏమిటి?
క్లోమము (ప్యాంక్రీయాస్) లేదా చిన్న ప్రేగులలో (స్మాల్ ఇంటస్టైన్) ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ కణితులు ఏర్పడడం వల్ల గాస్ట్రిన్ అనే హార్మోన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది అంటువంటి పరిస్థితిని జోలింగర్ ఎలిసన్ సిండ్రోమ్ (జడ్ఇయస్) అని అంటారు. ఈ కణితులు గ్యాస్ట్రిన్ హార్మోన్ను స్రవిస్తాయి, ఇది కడుపులో గ్యాస్ట్రిక్ యాసిడ్ను ఉత్పత్తి చేస్తుంది. గాస్ట్రిన్ యొక్క సాధారణ స్థాయి గ్యాస్ట్రిక్ ఆమ్లం ఉత్పత్తి చేయడానికి అవసరమవుతుంది అది ఆహారాన్ని జీర్ణం చేసేందుకు ఉపయోగపడుతుంది. జడ్ఇయస్ లో అధిక గ్యాస్ట్రిక్ యాసిడ్ ఉత్పత్తి కావడం వలన కడుపు మరియు జీర్ణవ్యవస్థలోని ఇతర భాగాలలో పెప్టిక్ పూతలు/పుండ్లు (అల్సర్లు) ఏర్పడతాయి.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
జడ్ఇయస్ యొక్క లక్షణాలు:
- అతిసారం (విరేచనాలు)
- వాంతులు
- పొత్తి కడుపు నొప్పి
- కడుపులో పూతలు/పుండ్లు
- ఉబ్బరం
- బరువు తగ్గుదల
- ఆకలి తగ్గుదల
- త్రేన్పులు
- చిన్న ప్రేగులలో పూతలు
మలంలో లేదా వాంతిలో రక్తం కనిపించిన వెంటనే ఒక వైద్యుణ్ణి సంప్రదించాలి.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
చాలామంది వ్యక్తులలో, జడ్ఇయస్ కారణం తెలియదు; అయితే, జడ్ఇయస్తో బాధపడుతున్న దాదాపు 25% మందిలో, ముల్టీపుల్ ఎండోక్రైన్ నియోప్లాసియా టైప్1 (MEN1 [multiple endocrine neoplasia type 1]) అని పిలువబడే జన్యుపరమైన రుగ్మత కారణం అని తెలుస్తుంది. MEN1 గ్యాస్ట్రినోమాలు (gastrinomas), గ్యాస్ట్రిన్ హార్మోన్ -ఉత్పత్తి చేసే కణితు (hormone gastrin-producing tumours) లను కలిగిస్తుంది, అది కడుపులో యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుంది.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
సాధారణంగా ఈ పరిస్థితి యొక్క నిర్ధారణ ఈ క్రింది పద్ధతి ద్వారా జరుగుతుంది:
- వివరణాత్మక ఆరోగ్య చరిత్ర యొక్క అధ్యయనం
- శారీరక పరిక్ష
- గాస్ట్రిన్ హార్మోన్ యొక్క స్థాయిని గుర్తించేందుకు రక్త పరీక్ష
- జీర్ణాశయం యొక్క ఎగువ భాగంలో వాపు మరియు పూతల/పుండ్లను తనిఖీ చేసేందుకు ఎగువ జీర్ణశయా ఎండోస్కోపీ, అనగా, ఆహార గొట్టం (food pipe), కడుపు మరియు చిన్న ప్రేగు యొక్క పరిశీలన
- జీర్ణ వాహిక యొక్క చిత్రాన్ని పొందడానికి కంప్యూటెడ్ టోమోగ్రఫీ (సిటి) స్కాన్ మరియు మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (ఎంఆర్ఐ) వంటి ఇమేజింగ్ పరీక్షలు
- కడుపు ఆమ్లం యొక్క స్థాయిలు పరీక్షించడం
జడ్ఇయస్ ను తగ్గించడానికి వైద్యులు ఈ క్రింది చికిత్సా పద్ధతులను సిఫారసు చేయవచ్చు:
- మందులు: కడుపులో యాసిడ్ ఉత్పత్తిని నిరోధించటానికి పంటొప్రజోల్ (pantoprazole), రబేప్రజోల్ (rabeprazole), ఎసోమేప్రజోల్ (esomeprazole) వంటి ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్లు సూచించబడతాయి. ఇది నొప్పి, పుండ్లు మరియు జడ్ఇయస్ యొక్క ఇతర లక్షణాలు నుండి ఉపశమనం అందిస్తుంది.
- కెమోథెరపీ: శస్త్రచికిత్సా పద్ధతుల ద్వారా నయం చెయ్యలేని కణితులకు డోక్సోర్యూబిసిన్ (doxorubicin) వంటి కెమోథెరపీ మందులు సూచించబడతాయి.
- శస్త్రచికిత్సా ప్రక్రియ: గ్యాస్ట్రినోమాలు యొక్క శస్త్రచికిత్సా తొలగింపు ఈ రుగ్మత చికిత్సకు సహాయపడుతుంది.
- ఆహార విధానం: ఈ కణితుల పునరావృత్తాన్ని నివారించడానికి వైద్యులు సూచించిన ఆహార విధానాన్ని అనుసరించాలి.