యాస్ అంటే ఏమిటి?
యాస్ అనేది ఒక అంటువ్యాధి ఇది ట్రెపోనెమా పెర్టెన్యూ (Treponema pertenue) అనే బాక్టీరియా వల్ల సంభవిస్తుంది. ఇది చర్మం, ఎముకలు, మరియు కీళ్ళును ప్రభావితం చేసే వ్యాధి మరియు దీనిలో శరీరంలో మొదటిసారి సంక్రమణ కలిగిన కొన్ని సంవత్సరాల తర్వాత కూడా లక్షణాలు కనిపిస్తాయి. పొడి వాతావరణం కంటే ఉష్ణమండల వాతావరణంలో యాస్ యొక్క ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. బాక్టీరియా శరీరంలోకి చర్మం ద్వారా ప్రవేశిస్తుంది. యాస్ కలిగించే బ్యాక్టీరియా సిఫిలిస్ కు కారణమయ్యే బ్యాక్టీరియాను పోలి ఉంటుంది; అయితే, యాస్ లైంగికంగా సంక్రమించబడదు, వ్యాధి సోకిన వ్యక్తులకు దగ్గరగా (తాకుతూ) ఉండడం వాలా వ్యాపిస్తుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
బాక్టీరియం ప్రవేశించే చర్మ ప్రదేశం/స్థానం మీద చిన్న పుండు కనిపిస్తుంది. ఇది సాధారణంగా నొప్పిలేకుండా ఉంటుంది మరియు ప్రభావిత వ్యక్తి దురదను అనుభవించవచ్చు. మొదటి పుండుతో పాటు లేదా అది తగ్గిపోయిన తర్వాత కానీ అనేక పుళ్ళు అభివృద్ధి చెందుతాయి. యాస్ ప్రారంభ దశలో ఉండే ఇతర సాధారణ సంకేతాలు మరియు లక్షణాలు:
- ఎముకలో నొప్పి
- ఎముకలు మరియు చేతి వేళ్ల వాపు
- చర్మం మీద మచ్చలు ఏర్పడడం
- పుండ్లు మరియు నొప్పితో కూడిన పగుళ్లతో గాయాలు ఏర్పడం
ప్రారంభ దశలో సరిగ్గా చికిత్స చేయకపోతే, తరువాత దశలో పుళ్ళు ఎముక యొక్క నిర్మాణం మరియు పనితీరుని తీవ్రంగా ప్రభావితం చేయవచ్చు.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
ట్రోపోనెమా పెర్టెన్యూ అని పిలువబడే మెలికల-ఆకారపు బ్యాక్టీరియా వల్ల యాస్ సంభవిస్తుంది, ఇది వ్యాధి సోకిన వ్యక్తి నుండి ఆరోగ్యకరమైన వ్యక్తికి నేరుగా చర్మాన్ని తాకడం (స్పర్శ) ద్వారా (direct skin contact) సంక్రమిస్తుంది. అరుదుగా, బ్యాక్టీరియా సోకిన పురుగు యొక్క కాటు ద్వారా కూడా ఈ పరిస్థితి సంభవించవచ్చు.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
రోగనిర్ధారణలో సాధారణంగా శారీరక పరీక్ష ఉంటుంది, తరువాత రోగ నిర్ధారణను ధృవీకరించడానికి వైద్యులు వివిధ పరీక్షలను సూచిస్తారు. ప్రభావిత చర్మపు మరియు గాయాల కణజాలాన్ని మైక్రోస్కోప్ ద్వారా పరిశీలిచడం అనేది దశ 1 (stage 1) ధృవీకరణకు సహాయపడుతుంది. విడిఆర్ఎల్ (VDRL) పరీక్ష మరియు ట్రోమోనెమాల్ యాంటీబాడీ పరీక్షలు దశ 3 (stage 3) నిర్ధారణలో ఉపయోగపడతాయి.
వైద్యులు సాధారణంగా ఈ క్రింది మందులను సిఫార్సు చేస్తారు:
- ఓరల్ అజిత్రోమిసిన్ (Oral azithromycin) 30 mg / kg అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైసేషన్ యొక్క "యాస్ నిర్మూలన వ్యూహం" (Yaws Eradication Strategy) ద్వారా ఆమోదించబడిన చికిత్స.
- అజిత్రోమిసిన్కు స్పందించని వ్యక్తులకు ఇంట్రాముస్కులర్ బెంజథైన్ పెన్సిల్లిన్ (Intramuscular benzathine penicillin) ఇవ్వబడుతుంది
యాంటీబయాటిక్ థెరపీ తర్వాత వ్యాధి పూర్తిగా నయం అయ్యిందా అని తనిఖీ చెయ్యడానికి వైద్యులు ఒక నాలుగు వారాల తర్వాత రోగిని మళ్ళి పర్యవేక్షిస్తారు. యాస్ మళ్ళి పురావృత్తం అవ్వడం చాలా అరుదు.