శ్వాసలో గుర్రుగుర్రుమనే శబ్దం అంటే ఏమిటి?
శ్వాసలో గుర్రుగుర్రుమనే శబ్దం అనేది శ్వాస వదిలేటప్పుడు ఊపిరితిత్తుల నుండి అధిక-స్థాయిలో (high-pitched) ఉత్పన్నమయ్యే ఒక ఈల శబ్దం/ధ్వని. ఇది తీవ్రమైన శ్వాసకోశ సంక్రమణలు లేదా ఇతర అంటువ్యాధులు కానీ (non-infectious) కారణాల వలన అయిదు ఏళ్లలోపు పిల్లలలో సంభవించే ఒక సాధారణ సమస్య. ఇది ఉబ్బసం యొక్క సంకేతం.
దాని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
గుర్రుగుర్రుమనే శబ్దం అనేదే ఒక లక్షణం. ఈ కింది ఆరోగ్యపరమైన సంకేతాలు మరియు లక్షణాలతో పాటుగా దీనిని గమనించవచ్చు:
- బ్రోంకోస్పేమ్ (Bronchospasm) - ఊపిరితిత్తులలోని శ్వాస మార్గాల సంకోచం
- శ్వాసలో సమస్య
- శ్వాస పీల్చుకునే సమయంలో ఈల ధ్వని
- ఛాతీ గట్టిదనం/బిగుతుదనం
- రాత్రి సమయంలో దగ్గు
- వేగవంతమైన హృదయ స్పందన రేటు
- వేగవంతమైన శ్వాస
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
శ్వాసలో గుర్రుగుర్రుమనే శబ్దం ఈ వాటి కారణంగా సంభవిస్తుంది:
- బ్రోన్కియోలైటిస్- ఊపిరితిత్తులలోని బ్రోన్కియోల్స్ అని పిలవబడే చిన్న శ్వాస మార్గాల వాపు
- నాన్-ఇన్ఫెక్టివ్ (సంక్రమణ కానీ) కారణాలు శ్వాసకోశ మార్గం యొక్క నిర్మాణాత్మక లేదా క్రియాత్మక (పనితీరులో) అసాధారణతలను కలిగి ఉంటాయి
- శ్వాసకోశ మార్గం యొక్క వైరల్ లేదా బాక్టీరియల్ సంక్రమణలు
- ఆస్తమా
- అలర్జీలు
- గ్యాస్ట్రో-ఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి (జి.ఇ.ఆర్.డి)
- ఏదైనా బయటి వస్తువును పీల్చడం
- ఇమ్యునో డెఫిషియన్సీ వ్యాధి
- కణితులు లేదా క్యాన్సర్లు
- వాతావరణ మార్పులు
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
శ్వాసలో గుర్రుగుర్రుమనే శబ్దం యొక్క రోగ నిర్ధారణలో ఇవి ఉంటాయి:
- శారీరక పరిక్ష
- బ్రోన్కోస్కోపీ (Bronchoscopy)
- గాలి ప్రసరణ నిరోధ పరీక్షలు (Airflow obstruction tests)
- పల్స్ ఆక్సిమెట్రీ రీడింగ్స్ (Pulse oximetry readings)
- ఛాతీ ఎక్స్-రే
- హై రిజల్యూషన్ కంప్యుట్ టోమోగ్రఫీ (సిటి స్కాన్) [High resolution computed tomography]
- మాగ్నెటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్ (ఎంఆర్ఐ)
- చెమట పరీక్ష (Sweat test)
- బ్యాక్టీరియా తనిఖీ కోసం కఫం అధ్యయనాలు (Bacteriological sputum studies)
- వైరస్ మరియు మైకోప్లాస్మా యాంటీబాడీ స్థాయిల పరీక్ష
- రోగనిరోధక వ్యవస్థ పనితీరు పరీక్ష
వీజింగ్ యొక్క చికిత్స అంతర్లీన కారణాల మీద ఆధారపడి ఉంటుంది. ప్రారంభంలో బీటా 2 ఎగోనిస్టుల (beta 2 agonists) ను ఏరోసోల్ (aerosol) రూపంలో ఇవ్వవచ్చు. తీవ్రమైన బ్రోన్కియోలిటిస్ తో బాధపడుతున్న శిశువులలో రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (respiratory distress syndrome) కూడా ఉండే, వెంటనే సహాయక ఆక్సిజన్ చికిత్స ప్రారంభించాలి. సెడెటివ్ (Sedatives) లు రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ను మరింత తీవ్రతరం చేస్తాయి అందువల్ల వాటిని వాడకూడదు. పునరావృత్తమయ్యే వీజింగ్ యొక్క చికిత్సా విధానం మొదటిసారి సంభవించిన వీజింగ్ యొక్క చికిత్సకు భిన్నముగా ఉంటుంది. పునరావృత్తమయ్యే వీజింగ్ కోసం ఉపయోగించే మొట్టమొదటి శ్రేణి ఎజెంట్లు (first-line agents) పేరేంట్రల్ (parenteral) లేదా ఓరల్ కోర్టికోస్టెరోయిడ్లను కలిగి ఉంటాయి. రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ (respiratory syncytial virus) సంక్రమణకు కారణం అని అనుమానం కలిగితే యాంటీవైరల్ చికిత్స సూచించబడుతుంది. విటమిన్ డి శ్వాసలో గుర్రుగుర్రుమనే శబ్దంతో ముడిపడి ఉంటుందని నిరూపితం అయ్యింది. దీని లోపం వీజింగ్ను అధికమయ్యేలా చేస్తుంది మరియు విటమిన్ డి సప్లీమెంట్లు అందించడం ప్రయోజనకరంగా ఉండవచ్చు.