విటమిన్ కె లోపం అంటే ఏమిటి?
విటమిన్ కె కొవ్వులో కరిగే విటమిన్, అంటే మానవ శరీరంలో దాని శోషణకు కొవ్వు అవసరం. విటమిన్ కె రెండు రూపాల్లో ఉంటుంది, ఒకటి విటమిన్ కె1 (ఫైలోక్వినోన్) మొక్కల నుండి లభిస్తుంది మరొక రకం విటమిన్ కె2 (మెనాక్వినోన్) సహజంగానే ప్రేగులలో సంశ్లేషణ చెందుతుంది. ఫైలోక్వినోన్లు విటమిన్ కె యొక్క ప్రధాన ఆహార వనరులు మరియు సాధారణంగా పాలకూర, బ్రోకలీ మరియు క్యాబేజీ వంటి ఆకుకూరల్లో ఈ ఫైలోక్వినోన్లు లభిస్తాయి. కొన్ని జంతు-సంబంధమైన ఆహారాలు మరియు పులియబెట్టిన ఆహారాల్లో మెనాక్వినోన్లు ఉంటాయి. ఇవి ముఖ్యంగా పులియబెట్టే చర్య (కిణ్వ ప్రక్రియకు)కు కారణమయ్యే బ్యాక్టీరియా ద్వారా ఉత్పత్తి చేయబడుతున్నాయి మరియు చాలా మంది వ్యక్తుల్లో తగినంత పరిమాణంలో పేగుల్లోనే ఉత్పత్తి చేయబడతాయి.
శరీర భాగంలో విటమిన్ కె కీలకమైన ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తుంది, ఇది రక్తస్రావాన్ని నియంత్రించడానికి బాధ్యత వహిస్తుంది. విటమిన్ K లోపం అనేది రక్తం గడ్డకట్టకపోవడమనే ప్రమాదాన్ని మనిషికి సంభవింపజేస్తుంది. విటమిన్ K లోపంవల్ల శరీరంలో రక్తస్రావం యొక్క అపాయాన్ని అరికట్టే కీలకమైన ప్రోటీన్లను మన శరీరం ఉత్పత్తి చేయలేకపోతుంది, తద్వారా రక్తస్రావంఆగదు.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ఈ కింద దీనియొక్క కొన్ని సంకేతాలు మరియు లక్షణాలను పేర్కొంటున్నాం :
- అధిక రక్తస్రావం
- సులువుగానే కమిలిన గాయాలు ఏర్పడడమం
- గోళ్ల కింది నుండి రక్తస్రావం
- జీర్ణమార్గం (ఎలిమెంటరీ ట్రాక్)లో ఏ భాగం నుండైనా రక్తస్రావం
- పాలిపోవడం మరియు బలహీనత
- నల్లరంగు చారాలతో కూడిన మలం లేదా మలంలో రక్తం పడటం
- మూత్రంలో రక్తం పడటం
- ఎముక బలహీనపడటం
- దద్దుర్లు
- వేగవంతమైన హృదయ స్పందన
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
విటమిన్ కె లోపం ఏ వయసులోనైనా సంభవిస్తుంటుంది, అయితే విటమిన్ కె లోపం ప్రమాదానికి శిశువులు ఎక్కువగా గురయ్యే ప్రమాదం ఉంది. విటమిన్ కె లోపం యొక్క ఇతర కారణాలు ఇలా ఉంటాయి
- పోషకాహారలోపం
- కాలేయ వ్యాధి
- తగినంత ఆహారం తీసుకోక పోవడం
- కొవ్వు అపశోషణం (మాలాబ్జర్పషన్)
- అంటురోగాలకిచ్చే మందులు మరియు రక్తం గడ్డకట్టనీయని మందులు (anticoagulants)
దీనిని ఎలా నిర్ధారణ చేయవచ్చు మరియు దీనికి చికిత్స ఏమిటి?
విటమిన్ కె లోపం ఉండే అవకాశాన్ని గుర్తించడానికి రోగి యొక్క చరిత్రను వైద్యుడు గుర్తుంచుకుంటాడు. రక్తస్రావం సమయాన్ని గుర్తించడానికి ఒక రక్తం గడ్డకట్టడం పరీక్ష (coagulation test) నిర్వహిస్తారు. విటమిన్ K లోపం యొక్క ప్రభావాలను అంచనా వేయడానికి చేసే ఇతర పరీక్షలు ఏవంటే ప్రోథ్రాంబిన్ సమయం, రక్తస్రావం సమయం, రక్తం గడ్డకట్టే సమయం మరియు సక్రియం చేయబడిన పాక్షిక ప్రోథ్రాంబిన్ సమయం పరీక్షలు
చికిత్స పద్ధతులు ఇలా ఉంటాయి
- విటమిన్ కె యొక్క అనుబంధక మందులు నోటి ద్వారా తీసుకోవచ్చు లేదా సూది మందులుగానూ లభిస్తాయి
- ఆకు కూరలు, ఆవాలు, క్యాబేజీ మరియు బ్రోకలీ వంటి విటమిన్ K- అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం.