మూత్రం ఆపుకొలేకపోవడం అంటే ఏమిటి?
మూత్రం యొక్క లీకేజీకి దారితీసే మూత్రం మీద లేదా మూత్రాశయము మీద నియంత్రణను కోల్పోవడాన్ని మూత్రం ఆపుకొలేకపోవడం అని పిలుస్తారు. ఇది ఎక్కువగా వృద్ధులలో, ముఖ్యంగా స్త్రీలలో సంభవిస్తుంది. పెరుగుతున్న వయస్సుతో పాటు, మూత్రం ఆపుకొనలేని సమస్య కూడా పెరుగుతుంది. మూత్రాశయం యొక్క స్ఫింటర్ (sphincter) కండరాలు మూత్ర ప్రవాహాన్ని నియంత్రించలేకపోయినప్పుడు ఇది జరుగుతుంది. ఒత్తిడి, కోరిక (urge),అధిక ప్రవాహం (overflow), మిశ్రమం (mixed), పనితీరు (function) మరియు మొత్తానికి ఆపుకొలేకపోవడం (total incontinence) వంటి వివిధ దీనిలో రకాల ఉన్నాయి.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
కొన్ని సాధారణ సంకేతాలు మరియు లక్షణాలు:
- తరచుగా మూత్ర విసర్జన
- మంచం మీద మూత్ర విసర్జన చెయ్యడం
- కటి (పెల్విక్) ప్రాంతంలో ఒత్తిడి భావన
- గట్టిగా నవ్వుతున్నప్పుడు లేదా దగ్గుతున్నపుడు మూత్రం కారిపోవడం (లీక్ అవ్వడం)
- మూత్రం బొట్లు బొట్లుగా పడడం
- మూత్ర విసర్జన తర్వాత కూడా మూత్రం యొక్క అసంపూర్ణ తొలగింపు (విసర్జన) భావన
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
మూత్రం ఆపుకొలేకపోవడం అనేది వివిధ కారణాల వలన సంభవిస్తుంది, అవి ఈ విధంగా ఉంటాయి:
- మూత్రాశయం గోడల యొక్క వాపు
- స్ట్రోక్
- ప్రోస్టేట్ యొక్క ఎంగేజ్మెంట్ (నిరంతరంగా ప్రేరేపింపబడడం)
- మూత్రపిండం (కిడ్నీ) లేదా మూత్రాశయంలో రాళ్ళు
- మలబద్ధకం
- మూత్రాశయం మీద ఒత్తిడి కలిగించే కణితి
- మద్యం
- యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు (UTI లు)
- మత్తుమందులు
- నిద్ర మాత్రలు
- కండరాల విశ్రామకాలు (Muscle relaxants)
- భారీ బరువులు ఎత్తడం
- మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి నరాల రుగ్మతలు
- శస్త్రచికిత్స సమయంలో లేదా బాహ్య గాయం వలన మూత్రాశయమును నియంత్రించే నరాలకు గాయం కావడం
- కుంగుబాటు లేదా ఆందోళన
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
ఒక వివరణాత్మక ఆరోగ్య చరిత్ర తీసుకున్న తర్వాత వైద్యులు సంభావ్య అసాధారణతల కోసం భౌతికంగా తనిఖీ చేస్తారు. కొన్ని తరచుగా నిర్వహించే పరీక్షలు:
- మూత్ర విశ్లేషణ (Urinalysis) - మైక్రోస్కోపిక్ పరీక్ష మరియు సూక్ష్మజీవుల సాగు
- పోస్ట్ వోయిడ్ రెసిడ్యూయల్ (PVR, Post void residual) పరీక్ష- ఇది మూత్రవిసర్జన తర్వాత మూత్రాశయంలో మిగిలి ఉన్న మూత్రాన్ని గుర్తించడానికి/చూడడానికి సహాయపడుతుంది.
- ఆటోఇమ్యూన్ యాంటిబాడీస్ తనిఖీ అలాగే మొదలైన వాటికోసం రక్త పరీక్షలు
- సిస్టోగ్రాం (Cystogram) - ఇది మూత్రాశయం యొక్క ఒక రకమైన ఎక్స్- రే విధానం.
- కటి భాగ అల్ట్రాసౌండ్ (Pelvic ultrasound)
- యూరోడైనమిక్ (Urodynamic) పరీక్ష - ఇది మూత్రాశయం మరియు మూత్ర విసర్జక కండరాలు ఒత్తిడిని/పీడనాన్ని ఎంతవరకు భరించగలవో అంచనా చేస్తుంది.
- సైస్టోస్కోపీ (Cystoscopy)
రోగనిర్ధారణ తరువాత, రోగికి వివిధ విధానాల ద్వారా చికిత్స చేస్తారు:
- మూత్రాన్ని సేకరించేందుకు మూత్రసంచులను (Urine drainage bags) ఉపయోగించవచ్చు.
- ప్యాడ్లు,ప్యాంటీ లైనర్లు, పెద్దల డైపర్లు వంటి మూత్రాన్ని పీల్చుకునే ఉత్పత్తులు కూడా ఉపయోగించవచ్చు.
- మూత్రం కారిపోవడం వల్ల సంభవించే చర్మ ఎరుపుదనం మరియు దద్దుర్లను తగ్గించడానికి యాంటీమైక్రోబయాల్ క్లీన్సర్లను ఉపయోగిస్తారు.
- ఇంటర్మీటెంట్ కాథెటరైజేషన్ (Intermittent catheterization) - మూత్రనాళంలో కాథెటర్ పెట్టి దాని ద్వారా మూత్రం సేకరించబడుతుంది. కాథెటర్ అనేది ముత్రాశయంలో పెట్టె ఒక అనుకూలమైన గొట్టం. వాటిని టెఫ్లాన్ లేదా సిలికాన్ పూతతో లేటెక్స్ (జిగురు వంటి పదార్థం) తో తయారు చేస్తారు. కాథెటర్ చొప్పించిన/పెట్టిన తర్వాత, కాథెటర్ బయటకు రాకుండా కాబట్టి ఒక బుడగ వంటి వస్తువును కూడా ఉంచుతారు.
- కండోమ్ (condom) లేదా టెక్సాస్ (Texas) అని పిలిచే కాథెటర్లను బాహ్య సేకరణ విధానాలుగా పురుషుల పురుషాంగం మీద చుటవచ్చు.
- మంచం పక్కన ఉండే కమోడ్లు లేదా కమోడ్ సీట్లు, బెడ్ పాన్లు వంటి టాయిలెట్ ప్రత్యామ్నాయాలు ఉపయోగించవచ్చు.
- కెగెల్ (Kegel) వ్యాయామాలు వంటి కటి కండరాల వ్యాయామాలు కూడా సహాయకారంగా ఉంటాయి.
- టైమ్డ్ వోయిడింగ్ (Timed voiding) - ఈ పద్ధతిలో మూత్రవిసర్జన కోసం ఒక క్రమమైన షెడ్యూల్ ఉంటుంది, ఇది మూత్రాశయమును నియంత్రించడంలో సహాయపడుతుంది.
- బయోఫీడ్బ్యాక్ (Biofeedback) - ఇది శరీర సంకేతాల (సిగ్నల్స్) గురించి వ్యక్తిని తెలుసుకునేలా సహాయపడుతుంది. ఇది మూత్రాశయం మరియు మూత్రం యొక్క కండరాల నియంత్రణను తిరిగి పొందడానికి సహాయపడుతుంది.
- కెఫీన్, మద్యం మరియు పొగాకు వినియోగం పూర్తిగా ఆపివేయాలి.