మూత్రనాళపు వాపు అంటే ఏమిటి?
మూత్రనాళం వాపుదేలిన పరిస్థితినే “మూత్రనాళపు వాపు” అంటారు. ఈ రుగ్మత సూక్ష్మజీవుల (బ్యాక్టీరియల్) సంక్రమణ కారణంగా సంభవిస్తుంది. ‘మూత్రనాళ వాపు’, ‘మూత్రనాళ సంక్రమణం’ (యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్-యుటిఐ), ఈ రెండూ ఒకటి కాదు. మూత్రనాళ సంక్రమణం అంటే మూత్రాశయం నుండి మూత్ర నాళము యొక్క కొనవరకూ ఏ భాగానికైనా సంక్రమణం సోకవచ్చు. ఈ రెండు వ్యాధుల లక్షణాలు ఒకే విధంగా ఉంటాయి కానీ వీటికి చేసే చికిత్స పద్ధతులు వేరుగా ఉంటాయి. మూత్రనాళం వాపు (Urethritis) అన్ని వయసుల వారికి రావచ్చు, కానీ ఈ వ్యాధికి పురుషుల కంటే మహిళలే ఎక్కువగా గురయ్యే ప్రమాదం ఉంది.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
సాధారణ చిహ్నాలు మరియు లక్షణాలు కొన్ని:
- మూత్రవిసర్జన సమయంలో మంట (బర్నింగ్)
- మూత్రవిసర్జన సమయంలో నొప్పి
- తరచుగా మూత్రవిసర్జన
- పొత్తికడుపు మరియు కటిప్రాంతంలో నొప్పి
- జ్వరం
- వాపు
- సంభోగం సమయంలో నొప్పి
- మహిళల్లో యోని ఉత్సర్గ
- పురుషుల్లో పురుషాంగం ఉత్సర్గ
- పురుషులలో వీర్యంతోపాటు రక్తం పడటం లేక మూత్రంతో పాటుగా రక్తం పడటం
- పురుషుల్లో పురుషాంగం యొక్క దురద
- పురుషుల్లో బాధాకరమైన స్ఖలనం
మహిళలలో, వ్యాధి సంకేతాలు మరియు లక్షణాలు చాలా స్పష్టంగా గోచరించక పోవచ్చు.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
మూత్రనాళం వాపు (Urethritis) కింద పేర్కొన్నటువంటి వివిధ కారణాల వల్ల కలుగుతుంది:
- గాయం.
- స్పెరిమిసైడ్లు లేదా గర్భనిరోధక జెల్లీలు మరియు ఫోమ్ల్లు(foams).
- మూత్రాశయం మరియు మూత్రపిండాల అంటురోగాలకు కారణమయ్యే బాక్టీరియా.
- అడెనో వైరస్.
- ట్రిఖోమోనాస్ వెజినాలిస్ .
- ఎస్చెరిషియా కోలి వంటి యురోప్యాతోజెన్స్.
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
వైద్యుడు వాపు లేదా ఉత్సర్గ వంటి సాధారణమైన అసాధారణతల తనిఖీకి భౌతికపరీక్ష చేస్తారు. వివరణాత్మక చరిత్ర తీసుకోవడంతోపాటు, కొన్ని పరీక్షలు నిర్వహించబడ్డాయి:
- మూత్రనాళ పరిశీలన.
- సూక్ష్మదర్శిని క్రింద స్వాబ్లను చొప్పించడం మరియు సేకరించిన నమూనాను గమనించడం.
- సిస్టోస్కోపీ - (మూత్రాశయాంతర్దర్ళిని) - అసాధారణతలను తనిఖీ చేసేందుకు మూత్రాశయంలోకి ఒక కెమెరాతో కూడిన ఒక ట్యూబ్ ను జొప్పించి ప్రవేశపెడతారు.
- మూత్ర పరీక్షలు
- పూర్తి రక్తగణన పరీక్ష
- లైంగిక సంక్రమణ వ్యాధుల కోసం ప్రత్యేకమైన పరీక్షలు
- మహిళల్లో పెల్విక్ అల్ట్రాసౌండ్
రోగనిర్ధారణ తరువాత, రోగికి కిందివాటి లాంటి వివిధ పద్ధతుల ద్వారా చికిత్స చేస్తారు:
- బ్యాక్టీరియా సంక్రమణకు సరైన యాంటీబయాటిక్స్ను వైద్యుడు నిర్ణయిస్తారు.
- స్టెరాయిడ్ లు కానటువంటి యాంటీ- ఇన్ఫ్లమేటరీ మందులు (NSAID లు) నొప్పిని నియంత్రించడానికి ఉపయోగిస్తారు.
- వాపు-మంటను త్వరితంగా తగ్గించేందుకు క్రాన్బెర్రీ రసం సేవించవచ్చు. ఈ రసంలో వాపును త్వరగా తగ్గించే అధిక విటమిన్ ‘సి’ పదార్థాలున్నాయి.