మూత్రమార్గంలో మంట రుగ్మత అంటే ఏమిటి?
మూత్రవిసర్జకనాళం (urethra) అనేది మన శరీరం నుండి మూత్రాన్ని బయటకు విడుదల చేయడానికి సహాయపడే ఒక గొట్టం. “మూత్రమార్గంలో మంట” లేదా యూరెత్రాల్ సిండ్రోమ్ అనేది సంక్రమణ లేకుండా మూత్రవిసర్జక నాళానికి సంభవించే వాపు మరియు మంట. యురెత్రాల్ సిండ్రోమ్ను “సింప్టొమాటిక్ అబాక్టెరియరియా”గా కూడా పిలుస్తారు. మూత్రమార్గంలో మంట ఎలాంటి సంక్రమణకు సంబంధించినది కాదు. అన్ని వయస్సుల సమూహాలువారు ఈ రోగలక్షణ స్థితితో కూడిన రుగ్మతకు గురవుతుంటారు, కాని ఇది ఎక్కువగా స్త్రీలలోనే సంభవిస్తుంది.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
సంకేతాలు మరియు లక్షణాలు మూత్రనాళపు వాపు (urethritis) ను చాలా పోలి ఉంటాయి. రెండు వ్యాధులూ మూత్రనాళం మంటకు కారణమవుతాయి. మూత్రనాళంవాపు లేక యూరేత్రిటీస్ బాక్టీరియల్ లేదా వైరల్ సంక్రమణ వలన సంభవిస్తుంది కానీ మూత్రమార్గంలో మంట రుగ్మతకు (urethral Syndrome) కారణం అంత స్పష్టంగా ఇంకా తెలియరాలేదు. దీని సాధారణ చిహ్నాలు మరియు లక్షణాలు కొన్ని:
- మూత్రవిసర్జన సమయంలో నొప్పి
- తరచుగా మూత్ర విసర్జన
- పొత్తి కడుపు నొప్పి
- మూత్రవిసర్జన సమయంలో బర్నింగ్
- మూత్రవిసర్జనకు అత్యవసరమైన (ఆత్రంతో కూడిన) పరిస్థితి
- గజ్జలలో వాపు
- సంభోగం సమయంలో నొప్పి
ముఖ్యంగా పురుషుల్లో సంభవించే కొన్ని సంకేతాలు:
- వృషణాల వాపు
- వీర్యం లో రక్తం పడటం
- పురుషాంగ ఉత్సర్గ
- స్ఖలనం సమయంలో నొప్పి
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
మూత్రమార్గంలో మంట రుగ్మత కారణానికి స్పష్టమైన సాక్ష్యం లేనందున దీని యొక్క కారణం సరిగ్గా తెలియదు. కానీ కొన్ని కారణాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
- మూత్రనాళానికి (యూరెత్రాల్) గాయం
- కీమోథెరపీ
- రేడియేషన్
- కాఫిన్
- పరిమళ ఉత్పత్తులైన సబ్బులు, సానిటరీ నేప్కిన్స్ మొదలైనవి
- స్పెర్మిసైడ్ జెల్లీలు
- లైంగిక చర్య
- బైక్ రైడింగ్
- డయాఫ్రాగమ్ మరియు టాంపోన్ వాడకం
- వైరల్ లేదా బాక్టీరియల్ సంక్రమణ
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
కటి లోపలి ప్రాంతంలో వ్యాధి సంకేతాలకోసం డాక్టర్ భౌతికంగా తనిఖీ చేస్తాడు. రోగి యొక్క వైద్య చరిత్ర సేకరించబడుతుంది. ఇందుకు చేసే కొన్ని పరీక్షలు:
- మూత్రం నమూనా పరీక్షలు మరియు మూత్రాశయ శ్వాబ్ పరీక్షలు
- పెల్విక్ ప్రాంతం యొక్క అల్ట్రాసౌండ్
- మూత్రమార్గం లోపల చొప్పించిన ఒక సన్నని ట్యూబ్తోపాటు కెమెరా ఉపయోగించి యూరిథ్రోస్కోపీ (Urethroscopy)
- లైంగికంగా సంక్రమించిన వ్యాధుల పరీక్షలు (ఎ.డి.డి. లు)
రోగనిర్ధారణ తరువాత, రోగిని వివిధ పద్ధతుల ద్వారా చికిత్స చేస్తారు:
- శస్త్ర చికిత్స (సర్జరీ) - మూత్రమార్గంలో ఏదైనా అడ్డంకి ఉంటే దాన్ని తొలగించడానికి శస్త్ర చికిత్స నిర్వహిస్తారు. ఇది అడ్డంకిని తొలగించడంలో సహాయపడుతుంది.
- కొన్ని జీవనశైలి మార్పులు పరిమళభరిత సబ్బులు, చాలా దూరాలకు బైక్ రైడ్స్ చేయడం వంటి వాటిని నిరోధించడం మొదలగునవి
- సరైన మందులు: స్టెరాయిడ్ కాని శోథ నిరోధక మందులు వంటివి సూచించబడతాయి.
- వ్యక్తిగత పరిశుభ్రత మరియు పారిశుద్ధ్య రక్షణ: వేగంగా అభివృద్ధి చెందడానికి మరియు పునరావృత నివారణకు వ్యక్తిగత పరిశుభ్రత మరియు పారిశుద్ధ్య రక్షణ చాలా ముఖ్యం.