థ్రోంబోసైటోపీనియా మరియు ఇమ్యూన్ థ్రోంబోసైటోపినియా (ఐటిపి) అంటే ఏమిటి?
ప్లేట్లెట్లు అనేవి రక్తం యొక్క అంశాల/భాగాలలో ఒక రకమైనవి. థ్రోంబోసైటోపీనియా అంటే రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య సాధారణం కంటే తక్కువగా ఉండే ఒక పరిస్థితి. రక్తం గడ్డకట్టడానికి ప్లేట్లెట్లు కీలక పాత్ర పోషిస్తాయి మరియు గాయాలను లేదా పుండ్లను నయం చేసేందుకు మరియు రక్తస్రావాన్ని ఆపడానికి కూడా అవసరమవుతాయి. ఇమ్యున్ థ్రోంబోసైటోపినియా (ఐటిపి) అనేది రక్తం యొక్క ఆటోఇమ్మ్యూన్ రుగ్మతగా, దీనిలో శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థ దాని సొంత ప్లేట్లెట్లకు హాని కలిగిస్తుంది తద్వారా అది ప్లేట్లెట్ల లోపానికి దారితీస్తుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
తేలికపాటి థ్రోంబోసైటోపీనియా మరియు ఐటిపి తరచుగా ఏటువంటి లక్షణాలను కలిగించవు. అయితే తీవ్ర థ్రాంబోసైటోపీనియా శరీరంలోని ఏ భాగం నుండైనా రక్తస్రావం కలిగించే అత్యవసర వైద్య పరిస్థితికి దారి తీయవచ్చు.
ఐటిపిలో ఈ క్రింది లక్షణాలను గమనించవచ్చు:
- చర్మం కింద రక్తస్రావాన్ని సూచించే చర్మ ఉపరితలం (surface) మీద కనిపించే ఊదారంగు లేదా ఎర్ర రంగు మచ్చలు
- చర్మం కింద గడ్డలు
- ముక్కు నుండి రక్తము కారుట
- పంటి చిగుళ్ళ నుండి రక్తస్రావం
- మూత్రం మరియు మలంలో రక్తం
- గాయాలకు సుదీర్ఘకాలం పాటు రక్తస్రావం జరుగుతుంది
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
థ్రోంబోసైటోపీనియాకు కారణం ఇంకా తెలియలేదు. కొన్నిసార్లు, కింది కారకాలు లేదా వాటి యొక్క కలయిక థ్రోంబోసైటోపీనియాకు కారణం కావచ్చు:
- జన్యుపరమైనది, తల్లిదండ్రుల నుండి వారి బిడ్డకు సంక్రమించవచ్చు
- ఎముక మజ్జ (bone marrow) ఉత్పత్తి చేసే ప్లేట్లెట్ల యొక్క సంఖ్య తగినంతగా సరిపోకపోవడం
- ఎముక మజ్జను తగినంత సంఖ్యలో ప్లేట్లెట్లు ఉత్పత్తి చేస్తుంది, కానీ వాటిని శరీరం అధికంగా వినియోగించడం లేదా నాశనం చేయడం చేస్తుంది
- అధిక సంఖ్యలో ప్లేట్లెట్లు ప్లీహము (spleen) లో నిలిచిపోవడం
శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థ సాధారణంగా ప్లేట్లెట్ల పై దాడి చేసి మరియు నాశనం చేయడం మొదలు పెట్టినప్పుడు ఐటిపి సంభవిస్తుంది. ఇది బ్యాక్టీరియా మరియు వైరల్ సంక్రమణల/ఇన్ఫెక్షన్ల వంటి ఇతర కారణాలతో కూడా ముడిపడి ఉండవచ్చు.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
శారీరక పరీక్ష, ఆరోగ్య చరిత్ర మరియు రక్త పరీక్షలను ప్లేట్లెట్ల యొక్క లోపాన్ని గుర్తించడానికి ఉపయోగిస్తారు. వైద్యులకు ఐటిపి ఒక కారణం కావచ్చు అని సందేహం కలిగితే ఈ క్రింది పరీక్షలను ఆదేశించవచ్చు:
- రక్తస్రావ లక్షణాలు (Bleeding symptoms)
- ప్లేట్లెట్ సంఖ్యను తగ్గించే ఏదైనా వ్యాధి
- వ్యక్తిలో రక్తస్రావం లేదా ప్లేట్లెట్ల సంఖ్య తగ్గడానికి కారణం అయ్యే ప్రస్తుతం కొనసాగుతున్న ఏదైనా చికిత్స
తేలికపాటి థ్రోంబోసైటోపీనియా మరియు ఐటిపిలకు ఎటువంటి చికిత్స అవసరం ఉండదు. తీవ్రమైన థ్రోంబోసైటోపీనియాకు వివిధ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి వాటిలో కొన్ని ఈ క్రింది విధంగా ఉంటాయి:
- కార్టికోస్టెరాయిడ్స్ వంటి మందులు, ఇవి ప్లేట్లెట్ల నాశనం (destruction) యొక్క వేగాన్ని తగ్గిస్తాయి
- తీవ్రమైన సందర్భాల్లో రక్తం లేదా ప్లేట్లెట్ మార్పిడి (ట్రాన్స్ఫ్యూషన్)
- మందులకు ఎటువంటి ప్రతిస్పందన చూపని వ్యక్తులలో చివరి ఎంపికగా ప్లీహము (spleen) యొక్క తొలగింపు. ఇది సాధారణంగా ఐటిపి యొక్క చికిత్సకు ఉపయోగిస్తారు.