సారాంశం
గొంతు క్యాన్సర్ ను బాధపడుతున్న ప్రదేశాన్ని బట్టి వివిధ పేర్లతో చెప్పవచ్చు. దీని ప్రాథమిక లక్షణాలు తినునప్పుడు లేదా మ్రింగునప్పుడు, గొంతులో నొప్పి, మాటలాడుటలో ఇబ్బందులు మరియు నిరంతర దగ్గు మొదలగునవి. వయస్సు, స్త్రీ లేక పురుషుడు మరియు జన్యు దుర్బలత్వముల వంటి అనేక ప్రమాద కారకములు ఒక వ్యక్తిని కాన్సర్ కి గురిచేయుటకు కారణమగును. పొగాకు మరియు మద్యమును అతిగా సేవించుట అనునవి కూడా గొంతు కాన్సరుతో సంబంధమును కలిగి ఉండును. నివారణే కీలకము; ఎటువంటి రకమైన గొంతు కాన్సరునైనను నివారించుటకు ప్రధాన మార్గము ప్రమాద కారకములైన మద్యము మరియు పొగాకులను నివారించుట. గొంతు కాన్సరు శారీరక పరీక్ష, రక్త పరీక్షలు, ఇమేజింగ్ పరీక్షలు మరియు బయాప్సీలచే నిర్ధారణ చేయబడును. కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, టార్గెటెడ్ థెరపీ మరియు శస్త్రచికిత్స మొదలైనవి గొంతు కాన్సరు చికిత్స ఎంపికలు. పలురకములైన శస్త్ర సంబంధిత పద్ధతుల ద్వారా క్యాన్సరు చికిత్స అనునది అనేక దుష్ప్రభావములతో సంబంధమును కలిగి ఉండును. ఈ దుష్ప్రభావములు వైద్యులు, సలహాదారులు మరియు కుటుంబ సభ్యుల సహాయముతో నిర్వహించబడగలవు. ప్రారంభములోనే క్యాన్సరును గుర్తించినట్లయితే మనుగడకు ఎక్కువ అవకాశము ఉండును.