స్వైన్ ఫ్లూ అంటే ఏమిటి?
స్వైన్ ఫ్లూ అనేది అతిసూక్ష్మ విష క్రీముల్లో ఒకరకం క్రిమి (వైరస్), ఇది సాధారణంగా పందులకు రోగకారకమౌతుంది, కానీ ఈ క్రిమి మానవుల్ని కూడా ప్రపంచవ్యాప్తంగా “స్వైన్ ఫ్లూ” వ్యాధిగా బాధిస్తోంది.
స్వైన్ ఫ్లూ క్రిమినే ‘H1N1 వైరస్’ అని కూడా పిలుస్తారు మరియు ఇది ‘ఇన్ఫ్లుఎంజా’ వైరస్ రకం.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
- ఫ్లూ వంటి లక్షణాలను స్వైన్ ఫ్లూ కల్గిఉంటుంది మరియు అత్యంత తీవ్రమైన అంటువ్యాధి.
- ఈ వైరస్ మనిషి శ్వాసకోశ వ్యవస్థను దెబ్బ తీస్తుంది. తీవ్రమైన జలుబుతో ముక్కు కారడం, దురదపెట్టే గొంతు మరియు తీవ్రమైన దగ్గుతో ఈవ్యాధి సోకిన వ్యక్తి బాధపడుతుంటారు.
- ఈ సంక్రమణ బలహీనత మరియు అలసటతో పాటు జ్వరాన్ని కలిగిస్తుంది. రోగి ఆకలిని కూడా కోల్పోవచ్చు.
- ఇతర లక్షణాలు కళ్ళలో చికాకు లేదా కళ్ళు నీళ్ళుగారుతూ ఉంటాయి.
- స్వైన్ ఫ్లూ వల్ల బాధపడుతున్న వ్యక్తి కడుపు నొప్పి, వికారం మరియు వాంతులు కూడా కలిగి ఉంటారు.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
- H1N1 వైరస్ సంక్రమణను స్వైన్ ఫ్లూ అని పిలుస్తారు ఎందుకంటే ఇది పందులను ప్రభావితం చేసే వైరస్తో సమానంగా ఉంటుంది. మానవులు, పక్షులు మరియు పందులకు సోకే ఈ సూక్ష్మవిషక్రిముల్ని ఒకేజాతి పోలికలు కలిగిఉన్నవిగా గుర్తించారు.
- వైరస్ను కలిగి ఉన్న గాలిలో శ్వాస పీల్చుకోవడం వలన జంతువులలో ఈ వైరస్ వ్యాపిస్తుంది.
- ఈ వైరస్ను కలిగి ఉన్న గాలిని మనిషి శ్వాస ద్వారా పీల్చుకున్నపుడు ఈ వైరస్తో సంపర్కమేర్పడుతుంది, కాబట్టి ఆవిధంగా ఇది మానవులను దెబ్బతీస్తుంది.
- అంటే, పౌల్ట్రీ కార్మికులకు స్వైన్ ఫ్లూ ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుంది.
- స్వైన్ ఫ్లూ యొక్క మహమ్మారి వ్యాప్తి గుర్తించినప్పుడు, మానవుల్లో ఈవైరస్కు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తి లేనందున వారు త్వరగా ఈ వైరస్వ్యాధిచే సంక్రమించబడతారు.
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
- మీరు ఫ్లూ-వంటి వ్యాధి లక్షణాలను కలిగిఉంటే మరియు స్వైన్ ఫ్లూ సోకిందనే అనుమానం ఉన్నట్లయితే, మీ వైద్యుడు రోగ నిర్ధారణ పరీక్షల సమయంలో స్వైన్ ఫ్లూ వైరస్ కోసం పరిశీలించి చూస్తారు.
- స్వైన్ ఫ్లూ వ్యాధికి ఒక విశ్లేషణ పద్ధతి ఉంది అది ఏదంటే నాసికా ఉత్సర్గ లేదా గొంతు ఉత్సర్గ యొక్క శ్వాబ్ నమూనాను తీసుకొని దానిని సూక్ష్మదర్శిని కింద పరిశీలించటం.
- కొన్ని ఇతర అణు పరీక్షలు మరియు వేగవంతమైన ఇన్ఫ్లుఎంజా డయాగ్నొస్టిక్ పరీక్షలు ఉన్నాయి, కానీ అవి మరీ అంత ప్రత్యేకమైనవి కావు.
చికిత్స
- ఈ వైరల్ వ్యాధితో బాధపడుతున్న వారికి యాంటీవైరల్ మందులు ఇవ్వబడతాయి.
- ఆసుపత్రిలో చికిత్స మరియు ఇతరుల నుండి ప్రత్యేకించి చికిత్స చేయడం (ఐసోలేషన్) చాలా సందర్భాల్లో సిఫారసు చేయబడ్డాయి, ఎందుకంటే ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తుంది.
- వైరస్ నిర్దిష్ట మందులకు నిరోధకతను చూపిస్తే, ఇతర రకాల యాంటీవైరల్ మందులు ఇవ్వాలి.
- ఈ వైరస్ వ్యాధిచికిత్సకు గాను టీకామందులు తయారు చేయబడ్డాయి మరియు అవి చాలా ప్రభావవంతంగా పని చేస్తాయి. ఈ వైరస్ కోళ్ల పరిశ్రమ (పౌల్ట్రీ) ద్వారా మనుషులకు దావానలం లాగా (like a wild fire) వ్యాపిస్తుండటంతో, వ్యాధి చెలరేగి విశ్వవ్యాప్తంగా వ్యాపించే సమయంలో టీకామందులు ఇవ్వడం చాలాముఖ్యం, మరీ ముఖ్యంగా పిల్లలకు వృద్ధులకు మరియు గర్భిణీ స్త్రీలకు టీకామందులివ్వడం ముఖ్యమైనది.