గ్యాస్ ట్రబుల్ - Stomach Gas in Telugu

Dr. Rajalakshmi VK (AIIMS)MBBS

December 17, 2018

March 06, 2020

గ్యాస్ ట్రబుల్
గ్యాస్ ట్రబుల్

సారాంశం

ఆంత్రం లేక ప్రేగులకు సంబంధించిన వాయువును ప్లేటస్ (జీర్ణాశయములో ఉత్పత్తి అయ్యే వాయువు) అని కూడా పిలుస్తారు, ఇది ప్రేగులలో వాయువు చేరడం వలన ఏర్పడే ఒక పరిస్థితి. ఇది త్రేన్పులు(బర్ఫింగ్), ఉబ్బరము(నిండుగా ఉండుట), గాలిని బయటకు పంపడం (పిత్తును బయటకు పంపుట) మరియు కడుపు తిమ్మిరికి కూడా కారణమవుతుంది.  గ్యాస్ ను బయటకు పంపించుటకు ఉపయోగించు ఈ పదము ఫ్లాటులెన్స్(అపాన వాయువు లేక పిత్తు) గా పిలువబదుతుంది.  గ్యాస్ సాధారణముగా మనము త్రిన్నప్పుడు మరియు మాట్లాడినప్పుడు శరీరములోనికి ప్రవేశిస్తుంది.  పెద్ద ప్రేగులో ఉన్నటువంటి బ్యాక్టీరియా ఆహారమును విచ్చిన్నం చేస్తుంది, ఇది గ్యాస్ ఉత్పత్తికి కూడా దారితీస్తుంది.  గ్యాస్ సాధారణముగా పురీషనాళము(మలాశయం) లేక నోరు ద్వారా సాధారణముగా బయటకు వస్తుంది.  కారణాలు అనునవి సాధారణ అజీర్ణము నుండి మరింత క్లిష్టమైన పరిస్థితులు అనగా అల్సరేటివ్ కొలిటిస్ (వ్రణోత్పత్తి పెద్ద ప్రేగు శోథ) పరిధి వరకు దారితీస్తుంది.   రోగనిర్ధారణ అనునది సాధారణముగా క్లినికల్ గుర్తులు మరియు లక్షణాల పైన ఆధారపడి ఉంటుంది.  చాలా తీవ్రమైన సందర్భాలలో, మీ డాక్టర్ ఉదర ఎక్స్-రే, అల్ట్రా సౌండ్, ఎండో స్కోపీ లేక రక్త పరీక్షలకు వెళ్ళి ఏర్పడిన పరిస్థితులను నిర్ధారించుకొనుమని మిమ్మల్ని అడగవచ్చు.  పేగు గ్యాస్ చికిత్స అనునది అరుదుగా అవసరమవుతుంది, ఇది తీవ్రమైన అసౌకర్యం లేక సామాజిక ఇబ్బందులకు కారణమయితినే తప్ప ఈ చికిత్స అవసరముండదు.  ఏర్పడిన ప్రాథమిక కారణమునకు చికిత్సను తీసుకోవడము కూడా ఉపశమనమును అందిస్తుంది.  ప్రేగు గ్యాస్ ఉత్పత్తితో సంబంధమును కలిగిన కొన్ని రకములైన ఆహార పధార్థములను దూరముగా ఉంచుట కూడా చాలా సహాయము చేస్తుంది. ప్రేగు గ్యాస్ యొక్క సమస్యలు చాలా అరుదుగా వినబడుతుంటాయి మరియు సత్వర చికిత్స మరియు ఆహార మార్పుతో కూడా ఫలితముగా గొప్పగా ఉంటుంది. 

గ్యాస్ ట్రబుల్ అంటే ఏమిటి? - What is Stomach Gas in Telugu

ఫ్లేటస్ అనునది, మానవుల యొక్క జీర్ణనాళము లేదా అహారనాళములో ఉన్న అహారము బ్యాక్టీరియా ద్వారా విచ్చిన్నం కావడం లేక అనుకోకుండా గాలిని లోనికి తీసుకోవడము ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది.  ఇది ఫ్లాటులెన్స్(పిత్తులు)  లేక త్రేన్పులు ఏర్పడుటకు కారణమవుతుంది.  గట్ (ఆంత్రము లేదా ప్రేగు) <200 మిలీ.కంటే తక్కువగా గ్యాస్ ను కలిగిఉంటుంది, అయితే 600-700 మిలీ. గ్యాస్ అనునది ప్రతీరోజూ మన శరీరము నుండి ఫ్లాటస్ (పిత్తులు) రూపములో బయటకు వెళ్ళిపోతుంది.    ఫ్లాటులెన్స్ అనునది ఒక సాధారణ శారీరక కార్యకలాపము (శరీర క్రియ).   ఫ్లాటస్ యొక్క స్థాయి మరియు పరిమాణము అనునది ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి మారుతూ ఉంటుంది.  ఇది అసౌకర్యమును మరియు ఇబ్బందిని కలుగజేస్తుంది.  ఫ్లాటస్ (పిత్తు) అనునది హైడ్రోజన్, మీథేన్ మరియు కార్బన్ డై ఆక్సైడ్ వాయువులను కలిగి ఉంటుంది.  దీని వాసన, హైడ్రోజన్ సల్ఫైడ్ యొక్క వాసనను పోలి ఉంటుంది.

Digestive Tablets
₹312  ₹349  10% OFF
BUY NOW

గ్యాస్ ట్రబుల్ యొక్క లక్షణాలు - Symptoms of Stomach Gas in Telugu

అదనపు ప్రేగు గ్యాస్ యొక్క లక్షణాలు క్రింది విధముగా ఉంటాయి:

  • త్రేనుపు (ఉద్గారం)
    ఇది ప్రాధమికముగా జీర్ణకోశ ప్రాంతము యొక్క పై భాగములలోనికి (కడుపు మరియు చిన్న ప్రేగు) గాలిని అధికముగా తీసుకోవడము (మ్రింగడం లేక మాట్లాడుచున్న సమయములో) ఫలితము ద్వారా ఏర్పడుతుంది.
  • ఫ్లాటులెన్స్ (పిత్తడం)
    ప్రధానముగా పెద్ద ప్రేగులో, గ్యాస్ లేక ఫ్లాటస్ చేరడము (పేరుకుపోవం) ద్వారా ఏర్పడుతుంది.  పులియబెట్టిన ఆహారము లేక మొక్కల ఫైబర్ లేక  సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు (పిండిపదార్థాలు) బ్యాక్టీరియా చేత విచ్చిన్నం చేయబడడము అనునది ప్రధాన కారణము.  కొన్నిసార్లు ఆహారం అసంపూర్ణముగా జీర్ణముకావడము వలన కూడా గ్యాస్ ఉత్పత్తి చేయబడుతుంది.
  • ఉబ్బరము
    ప్రేగు గ్యాస్ అధికముగా చేరకపోయినను, పూర్తిగా నిండినది అను అనుభూతి లేక భావనను కలిగి ఉండుట.  ప్రజలు తరచుగా ఉదరము ఉబ్బడము అను భావనను కలిగిఉంటారు మరియు ఏర్పడిన గ్యాస్ ను త్రేనుపు లేక ఫ్లాటులెన్స్ (పిత్తి) ద్వారా బయటకు పంపించలేరు.  (ఎక్కువగా చదవండి - ఉబ్బరము కొరకు గృహ నివారణ చర్యలు)

ఒక రోజులో 25 సార్లు కంటే ఎక్కువ స్థాయిలో త్రేన్పులు లేక ఫ్లాటులెన్స్ ఏర్పడుతాయి.  రాత్రివేళ నిద్రపోతున్న సమయములో ఈ స్థాయి పెరుగుతుంది.   

గ్యాస్ ట్రబుల్ యొక్క చికిత్స - Treatment of Stomach Gas in Telugu

ప్రేగు గ్యాస్ ఉత్పత్తిని తగ్గించుటకు నిర్ధిష్టమైన చికిత్స ప్రణాళిక  ఏమీ లేదు;  ఇది సాధారణముగా ఒక రోగ లక్షణం మరియు  ఆహార మార్పులను అత్యంత ముఖ్యమైన కారణముగా ఇది కలిగి ఉంటుంది.

ప్రేగు గ్యాస్ ద్వారా ఏర్పడిన అసౌకర్యము నుండి ఉపశమనమును  సమకూర్చుటకు ఓవర్-ది-కౌంటర్ మందులు అందుబాటులో ఉంటాయి.  ఫ్లాటులెన్స్ ను తగ్గించుటకు చార్ కోల్ (బొగ్గు) కలిగిన మందులు సహాయము చేస్తాయి.  ఫ్లాటస్ నుంది బయటకు వచ్చిన సల్ఫైడ్ వాసనను తగ్గించుటకు బిస్మత్ సాలిసైలేట్ సహాయము చేస్తుంది.  సంక్లిష్ట పిండిపదార్థాలు జీర్ణమగుటకు ఆల్ఫా-డి-గాలాక్టోసైడేస్ సహాయము చేస్తుంది.  IBS (ఐబిఎస్)తో బాధపడుతున్న ప్రజలు, యాంటీస్ఫాస్మాడిక్స్ తో ప్రయోజనమును పొందుకుంటారు, ఇది అదనపు ప్రేగు గ్యాస్ కారణముగా కలిగే  క్రాంప్-రకపు (స్నాయువుల ఈడ్పు నొప్పి వంటి) నొప్పిని తగ్గేలా చేస్తుంది.  పెరిగిన బ్యాక్టీరియాను నిర్ధారించు సందర్భములను యాంటిబయాటిక్స్ లను నిర్వహించేలా చేయవచ్చు.

జీవనశైలి నిర్వహణ

ప్రేగు గ్యాస్ యొక్క అధికోత్పత్తిని తగ్గించడానికి సాధారణ చర్యలు తీసుకొనబడతాయి.  ఆహార సవరణలు అనగా గ్యాస్ ఉత్పత్తిని పెంచుటకు కారణమయ్యే ఆహార పదార్థాలను దూరముగా ఉంచడము అనునది జీవనశైలి మార్పు యొక్క ప్రధాన ఆధారము.  ఇది క్రూసిఫెరా జాతికి చెందిన కూరగాయలు, ఫైబ్రస్ (పీచు పదార్థము కలిగిన) పండ్లు అనగా ఆపిల్స్, చక్కెర మరియు చక్కెర ప్రత్యామ్నాయాలు, పొగత్రాగడం, మరియు మద్యపానీయాలను తొలగించడమును కలిగి ఉంటుంది.  ఒత్తిడి అనునది కూడా జీర్ణక్రియ-సంబంధిత సమస్యలకు కారణమవుతుంది, ఇది ప్రేగు గ్యాస్ యొక్క ఉత్పత్తి పెరుగుదలకు దారితీస్తుంది.  అందువలన, ఒత్తిడి నిర్వహణ అనునది తప్పనిసరిగా చేయాలి.  క్రమమైన వ్యాయామాలు శరీరమును, ప్రత్యేకముగా ఉదర కండరాలు, టోన్డ్ (బిగువు) మరియు జీర్ణకోశ ప్రాంతము చురుకుగా ఉండునట్లు చేస్తాయి.



వనరులు

  1. International Foundation for Gastrointestinal Disorders. [Internet]. IFFGD,U.S. Controlling Intestinal Gas.
  2. National Institute of Diabetes and Digestive and Kidney Diseases [internet]: US Department of Health and Human Services; Symptoms & Causes of Gas in the Digestive Tract.
  3. MSDmannual professional version [internet].Gas-Related Complaints. Merck Sharp & Dohme Corp. Merck & Co., Inc., Kenilworth, NJ, USA
  4. National Institute of Diabetes and Digestive and Kidney Diseases [internet]: US Department of Health and Human Services; Gas in the Digestive Tract
  5. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Gas

గ్యాస్ ట్రబుల్ వైద్యులు

Dr. kratika Dr. kratika General Physician
3 Years of Experience
Dr.Vasanth Dr.Vasanth General Physician
2 Years of Experience
Dr. Khushboo Mishra. Dr. Khushboo Mishra. General Physician
7 Years of Experience
Dr. Gowtham Dr. Gowtham General Physician
1 Years of Experience
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

గ్యాస్ ట్రబుల్ కొరకు మందులు

Medicines listed below are available for గ్యాస్ ట్రబుల్. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.