స్పాస్మోడిక్ డైస్ఫోనియా - Spasmodic Dysphonia in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

January 10, 2019

March 06, 2020

స్పాస్మోడిక్ డైస్ఫోనియా
స్పాస్మోడిక్ డైస్ఫోనియా

స్పాస్మోడిక్ డైస్ఫోనియా (నరాల పెడసరం స్వరవికృతి) అంటే ఏమిటి?

స్వరపేటిక కండరాల పెడసరం (laryngeal dystonia) లేక లారెంగల్ డిస్టోనియా అని కూడా పిలవబడే “నరాల పెడసరం స్వరవికృతి” నాడీసంబంధమైన రుగ్మత. ఇది స్వరపేటిక (వాయిస్ బాక్స్) యొక్క కండరాల అసంబద్ధమైన కదలికకు కారణమవుతుంది. దీనివల్ల గొంతు నుండి వచ్చే స్వరం (వాయిస్) మారుతుంది మరియు ఆ మారిన స్వరం గొంతు అదిమిపెట్టి మాట్లాడితే వచ్చే ధ్వని నాణ్యతను పోలి ఉంటుంది. ఈ రుగ్మతతో  మూడు రకాలు ఉన్నాయి:

  • అడ్డక్టర్ స్పాస్మోడిక్ డిస్పోనియా (Adductor spasmodic dysphonia), ఇందులో స్వర తంత్రులు మూసుకుపోయి గట్టిపడిపోతాయి,  తద్వారా బలహీనమైన ధ్వని కలగడం లేదా స్వరధ్వనిలో మార్పు వస్తుంది
  • అబ్డక్టర్ స్పాస్మోడిక్ డిస్పోనియా (Abductor spasmodic dysphonia), (స్లాంక్ డ్యాస్ఫోనియా), ఈ రెండోరకంలో స్వర తంత్రులు తెరిచి ఉండటం మూలాన బలహీనమైన మరియు నిశ్శబ్దమైన స్వరం సంభవిస్తుంద.
  • మిక్స్డ్ స్పాస్మోడిక్ డైస్ఫోనియా (Mixed spasmodic dysphonia), స్వర తంత్రులు అసంబద్ధంగా తెరుచుకోవడం మరియు మూసుకోవడం సంభవిస్తుంటుంది.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

స్పాస్మోడిక్ డిస్పోనియా ఎవరికైనా సంభవించగల అరుదైన రుగ్మత. పురుషుల కంటే మహిళలకే  ఎక్కువగా వస్తుంటుంది ఈ రోగం. సాధారణంగా, ఈ రుగ్మత తేలికపాటి లక్షణాలతో క్రమంగా వృద్ధి చెందుతుంది.

  • కండరాల పట్టివేత కారణంగా అబ్దుక్టర్ స్పాస్మోడిక్ డిస్ఫోనియా సంభవిస్తుంది, పూర్తి ప్రయత్నంతో ప్రయాసపడి మాట్లాడినట్లుంటుంది, గొంతు అదిమిపెడితే వచ్చేధ్వనిలాగుంటుంది.
  • మరొక వైపు, అబ్డక్టర్ స్పాస్మోడిక్ డిస్పోనియా (abductor spasmodic dysphonia) కారణంగా ధ్వని బలహీనమైనదిగా మరియు పలుకు శ్వాసలో (breathy voice) వచ్చినట్లుంది.ధ్వనులు. నవ్వుతున్నపుడు, కేకలు వేసేటపుడు లేదా గట్టిగా అరిచేటపుడు మాత్రం కండరాల పట్టివేత ఉండదు. .

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

ఈ రుగ్మత యొక్క ఖచ్చితమైన కారణం అస్పష్టంగా ఉంది, కానీ ఇది ఒక నిర్దిష్ట ప్రాంతంలో మెదడు యొక్క నిర్దిష్ట ప్రాంతంలో రసాయనిక మార్పులకు కారణమవుతుందని నమ్ముతారు- బాసల్ గాంగ్లియా. బాసల్ గాంగ్లియాలో మెదడు లోపల లోతైన నరాల కణాల సమూహాలు ఉంటాయి. అవి శరీరం అంతటా కండరాలు కదలికల్నిసమన్వయం చేస్తాయి. ఒత్తిడివల్ల, స్వరపేటికకు (వాయిస్ బాక్స్) గాయం అవటంవల్ల లేదా అనారోగ్యంవల్ల కూడా  స్పాస్మోడిక్ డైస్ఫోనియా ప్రేరేపించబడవచ్చు. జన్యు కారకాలు కూడా స్పాస్మోడిక్ డైస్ఫోనియాతో బాధపడే ప్రమాదాన్ని పెంచుతాయి.

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

స్పాస్మోడిక్ డైస్ఫోనియా యొక్క లక్షణాలు ఇతర స్వరతంత్రుల రుగ్మతల మాదిరిగానే ఉంటాయి కాబట్టి, దీని నిర్ధారణ కష్టం. అందువల్ల, ఒక ప్రసంగ రోగవిజ్ఞాన నిపుణుడు (speech therapist), ENT స్పెషలిస్ట్ మరియు ఒక అనుభవజ్ఞుడైన న్యూరోలజిస్ట్ స్పాస్మోడిక్ డైస్ఫోనియా నిర్వహణలోను మరియు ఖచ్చితమైన రోగనిర్ధారణకు అవసరం అవుతారు.

ఈఎన్టి (ENT) స్పెషలిస్ట్ ఒక వివరణాత్మక లారీంజియల్ పరీక్షను నిర్వహిస్తారు. ప్రసంగ రోగవిజ్ఞాన నిపుణుడు (speech pathologist) స్వరం యొక్క నాణ్యతను అంచనా వేస్తాడు మరియు పరిస్థితిని మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయం చేయడానికి సమాచారం, ప్రోత్సాహం మరియు ఆలోచనలను అందిస్తారు. ఒత్తిడి లక్షణాలను తీవ్రతరం చేయడం వలన, ఒత్తిడి నిర్వహణ లేదా ఉపశమన చికిత్స వ్యాధిలక్షణాలను భరించేందుకు సహాయపడవచ్చు.

నరాల నిపుణుడు ఇతర కదలికల రుగ్మతల కోసం రోగిని మదింపు చేస్తాడు మరియు తగిన మందుల్ని కావలసినపుడు ప్రయత్నించవచ్చు. స్వర తంత్రుల కండరాల్లోకి బోటులోనుం (botulinum) స్థానిక ఇంజెక్షన్ ను ఇవ్వటంవల్ల వ్యాధి లక్షణాల నుండి తాత్కాలిక ఉపశమనం అందిస్తుంది. స్పీచ్ థెరపీ కూడా చికిత్స ప్రణాళికలో భాగంగా ఉంటుంది. సంప్రదాయ పద్ధతులు అసమర్థమైనప్పుడు, శస్త్రచికిత్స సూచించవచ్చు.



వనరులు

  1. National Center for Advancing and Translational Sciences. Spasmodic dysphonia. Genetic and Rare Diseases Information Center
  2. National Institute on Deafness and Other Communication Disorders. [Internet]: Bethesda (MD): U.S. Department of Health and Human Services; Spasmodic Dysphonia
  3. National Spasmodic Dysphonia Association. [Internet]: Illinois; Diagnosis
  4. Brain Foundation [Internet]: Australia. SPASMODIC DYSPHONIA.
  5. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Spasmodic dysphonia
  6. Mor N, Simonyan K, Blitzer A. Central voice production and pathophysiology of spasmodic dysphonia. Laryngoscope. 2018 Jan;128(1):177-183. PMID: 28543038
  7. Christy L. Ludlow. Treatment for spasmodic dysphonia: limitations of current approaches . Curr Opin Otolaryngol Head Neck Surg. 2009 Jun; 17(3): 160–165. PMID: 19337127

స్పాస్మోడిక్ డైస్ఫోనియా కొరకు మందులు

Medicines listed below are available for స్పాస్మోడిక్ డైస్ఫోనియా. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.