మృదు కణజాల సార్కోమా అంటే ఏమిటి?
శరీరం యొక్క కనెక్టీవ్ కణజాలాన్ని ప్రభావితం చేసే అరుదైన క్యాన్సర్లకు ఉపయోగించే ఒక సమగ్ర పదం మృదు కణజాల సార్కోమా. మృదు కణజాల సార్కోమాల యొక్క స్థానాన్ని బట్టి మరియు ప్రభావితమైన మృదు కణజాల రకాన్ని బట్టి అనేక రకాల మృదు కణజాల సార్కోమాలు ఉన్నాయి.
రక్తనాళాలు, కండరాలు, కొవ్వులు, స్నాయువులు (tendons), లిగమెంట్లు, లోపలికి ఉన్న చర్మ కణజాలాలు మరియు నరములను శరీర కనెక్టీవ్ కణజాలాలను కలిగి ఉంటాయి.
ఈ సార్కోమాలు (క్యాన్సర్ కణితులు) చేతులు, కాళ్ళు, మొండెం మరియు తల మరియు మెడ భాగాలలో అభివృద్ధి చెందుతాయి.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
- లక్షణాలు నెమ్మదిగా సంభవిస్తాయి, అందువల్ల, ప్రారంభ దశలలో రోగికి లక్షణాలు ఎక్కువగా పైకి కనిపించవు.
- కణితి యొక్క పరిమాణం పెరుగడం వలన, అది అంతర్లీన భాగాలను నొక్కుతుంది అది నొప్పిని కలిగించవచ్చు.
- ఛాతీ ప్రాంతంలో, ఊపిరితిత్తుల దగ్గరలో, సార్కోమా ఉంటే, అప్పుడు రోగి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతాడు.
- కడుపులోని మృదు కణజాల సార్కోమాలు కడుపు నొప్పి లేదా తిమ్మిరి కలిగించవచ్చు.
- రక్తంతో కూడిన వాంతులు, ఆకలిలేమి, బలహీనత మరియు జ్వరం వంటివి మృదు కణజాల సార్కోమాల యొక్క ఇతర సాధారణ చిహ్నాలు.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
- సార్కోమాలకు ప్రత్యేకమైన కారణం లేదు.
- తరచుగా అవి జన్యుపరమైన కారణం కలిగి ఉండవచ్చు లేదా సార్కోమాల యొక్క కుటుంబ చరిత్రకు ముడిపడి ఉండవచ్చు.
- రేడియేషన్ థెరపీ యొక్క ప్రతికూల ప్రభావాల వలన ఇతర రకాల క్యాన్సర్లకు రేడియేషన్ థెరపీ తీసుకుంటున్న వ్యక్తిలో సార్కోమా కూడా అభివృద్ధి చెందవచ్చు.
- ఆర్సెనిక్ (arsenic) మరియు హెర్బిసైడ్లు (herbicides) వంటి రసాయనాలకు గురికావడం కూడా మృదు కణజాల సార్కోమాల ప్రమాదాన్ని పెంచుతుంది.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
- సార్కోమాలను గుర్తించడానికి ఉపయోగించే సాధారణ పరీక్షలు కంప్యూట్ టోమోగ్రఫీ (CT), ఎక్స్-రే, మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (MRI), మరియు అల్ట్రాసౌండ్.
- కణితి యొక్క కణజాల నమూనాను బయాప్సీ (జీవాణుపరీక్ష) ద్వారా పరిశీలిస్తారు, అది కణితి యొక్క కేన్సర్ స్వభావాన్ని నిర్ధారించడానికి సహాయపడుతుంది.
చికిత్స:
- మాలిగ్నెంట్ (కాన్సర్) కణితుల చికిత్సలో కణితిని శస్త్రచికిత్స చేసి తొలగించడం జరుగుతుంది. శస్త్రచికిత్సలో, చుట్టుపక్కల ఉండే కొంత ఆరోగ్యకరమైన కణజాలం కూడా తొలగించబడవచ్చు.
- కొన్నిసార్లు, సార్కోమా కాళ్ళు/చేతులలో ఉంటే, ఎంప్యూటేషన్ (విచ్ఛేదన) ప్రమాదాన్ని అధిగమించడానికి శస్త్రచికిత్సను నివారించవచ్చు.
- శస్త్రచికిత్స ద్వారా కణితిని తొలగించే ముందు కణితి యొక్క పరిమాణాన్ని తగ్గించడానికి కూడా రేడియేషన్ థెరపీని ఉపయోగిస్తారు.
- రేడియేషన్ వలన కీళ్ల సమస్యలు, వాపు, మొదలైన దుష్ప్రభావాలు వుంటాయి.
- ఇంట్రావీనస్ (నరాలలోకి ఎక్కించే) మందులు లేదా మాత్రలు రూపంలో కెమోథెరపీని కూడా సార్కోమా యొక్క చికిత్స కోసం ఉపయోగించవచ్చు.
- చివరి చికిత్స ప్రణాళిక సార్కోమా రకం, కణితి పరిమాణం మరియు రోగి యొక్క పూర్తి ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.