పాము కాటు అంటే ఏమిటి?
ఇతర హాని కారక జీవుల (predators) నుండి పాము దానిని అది రక్షించుకోవడానికి చేసే ఒక ఆత్మరక్షణ చర్య కాటు దానిని పాము కాటు అని అంటారు. పాము కాటు విషపూరితమైన పాము వలన జరుగవచ్చు. ఈ సందర్భంలో, విషం నాడీ వ్యవస్థను, గుండె లేదా రక్తాన్ని ఉత్పత్తికి చేసే అవయవాలు ప్రభావితం చేయవచ్చు, చికిత్స సమయానికి అందించక పొతే అది ప్రాణాంతకం అవుతుంది. భారతదేశంలో పాము కాట్ల సంఖ్య సంవత్సరానికి 1,00,000 కేసులుగా మరియు 45-50 వేల మరణాలు సంభవించినట్లు గుర్తించబడింది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
వైద్యపరమైన సంకేతాలు మరియు లక్షణాలు:
- గాయం/పుండు మీద కోరల మచ్చలు
- గాయం నుండి రక్తం కారడం
- ఎడెమా (కాటు యొక్క ప్రదేశం మరియు కాలు/చెయ్యి వద్ద వాపు)
- ప్రభావిత భాగంలో రంగు మారిపోవడం
- మైకము
- అధిక చెమట
- వేగమైన హృదయ స్పందనల అనుభూతి తెలియడం
- గుండె స్పందన రేటు పెరగడం
కింది కారణాల వలన విషం రక్తప్రవాహంలోకి చేరదు:
- విషం లేకపోవడం వలన 'పొడి కాటు (dry bite)' అని పిలువబడే పరిస్థితి
- రక్షిత దుస్తులు లేదా బూట్ల కారణంగా కాటు లోతుగా పడకపోవడం
- తక్కువ తీవ్రమైన కేసులలో విషం పక్కకి కారిపోవడం
- విషం శరీరంలోకి వెళ్లలేని ఒక ఉపరితల దాడి (Superficial attack)
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
తాచు పాము, కట్ల పాము, రక్త పింజరి (పాము), మరియు రస్సెల్స్ వైపర్ (Russell’s viper) వంటి పాములు విషపూరితమైనవి వాటి కాటులు విషపూరిత కాటులు.
దీని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
అతి ప్రధానమైన చికిత్సా విధానంలో యాంటీ-వెనమ్ (anti-venom) ఉపయోగం ఉంటుంది. ప్రధాన సమస్య లేదా లోపం/కొరత అనేది నిర్దిష్టత లేకపోవడం. పాము విషపూరితమైనదా కాదా అని నిర్ధారించుకోవడం చాలా కష్టం అందువలన పాము కాటులను వైద్య అత్యవసర కేసులుగా పరిగణలోకి తీసుకోవడం మంచిది.
ప్రథమ చికిత్సగా ఈ క్రింది వాటిని చేయవచ్చు:
- పాము కాటుకి గురైన వ్యక్తిని నిదాన పరచాలి మరియు కంగారు పడకుండా చూడాలి, ఎందుకంటే అవి విషాన్ని వేగంగా శరీరం అంతా వ్యాప్తి చెందేలా చేస్తాయి
- పొడిగా, వదులుగా ఉన్న పట్టీతో లేదా వస్త్రంతో కాటును కప్పాలి
- వేగంగా యాంటీ-వినమ్ ను అందించగల ఆరోగ్య కేంద్రానికి వ్యక్తిని తీసుకువెళ్లాలి
- కాటుకు దగ్గరగా గుడ్డను/వస్త్రాన్ని గట్టిగా కట్టరాదు, ఇది ప్రసరణను తగ్గిస్తుంది
- గాయం కడగరాదు
- గాయం మీద ఐసును పెట్టరాదు
- గాయం నుండి విషాన్ని బయటకి పీల్చడానికి ప్రత్నించరాదు
ఈ కింది విధంగా చేస్తే పాము కాటులను నిరోధించవచ్చు:
- దట్టంగా ఉన్న గడ్డిలోకి వెళ్లేముందు లేదా సహస చర్యలు చేసే ముందు దళసరి/మందపాటి బూట్లను మరియు పొడవైన ప్యాంటు ధరించాలి
- రాత్రి సమయంలో టార్చి లైట్నులేదా లాంప్ ను తీసుకెళ్లాలి
- రాళ్ళను లేదా బండలను కదిల్చేటప్పుడు లేదా వంట కోసం కలపను సేకరించేటప్పుడు, పర్వత ప్రాంతాలలో తిరుగుతున్నప్పుడు లేదా చిన్న సరస్సులు మరియు నదులలో ఈత కొట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి
- కొట్టుగదులు (storerooms) లేదా నేలమాళిగ (basements)లలో పాములు లేదా ఎలుకల కోసం తగిన వికర్షనాలను (repellents) ఉపయోగించాలి
- పాముకి కదలిక లేనప్పుడు లేదా చనిపోయినట్లు కనిపించినప్పుడు ఆ పాముని పట్టుకోవడానికి ప్రయత్నించకూడదు
- వాటిని పెంపుడు జంతువులుగా ఉంచరాదు
- గుట్టలకి దగ్గరలో ఉండే వారు ఎల్లప్పుడూ పడుకునే ముందు వారి మంచాన్ని తనిఖీ చేసుకోవాలి మరియు నేలపై నిద్రించడాన్ని నివారించాలి
తగిన చర్యలు మరియు జాగ్రత్తలు అనుసరించినట్లయితే పాము కాటులను నివారించవచ్చు. ఇది మరణం మరియు పాము కాటు వలన కలిగే అనారోగ్యాన్ని తగ్గిస్తుంది మరియు నిరోధిస్తుంది.