సెలీనియం లోపం అంటే ఏమిటి?
సోమఖనిజలోపం (సెలీనియం లోపం) అనే రుగ్మత శరీరంలో క్షీణించిన సోమఖనిజం (సెలీనియం) యొక్క స్థాయిలను సూచిస్తుంది. సోమఖనిజం రోగనిరోధక వ్యవస్థ పనితీరులో ముఖ్యమైన పాత్ర పోషించే ఓ లేశమాత్ర ఖనిజం. సోమఖనిజలోపం (సెలీనియం యొక్క లోపం) చాలా అరుదుగా సంభవిస్తుండగా, నేలలో తక్కువ సోమఖనిజం (సెలీనియం) ఉన్న ప్రాంతాలలో ఈ సోమఖనిజ లోపం రుగ్మత చాలా సాధారణం. ఈ సోమఖనిజలోపం వల్ల ఏ అనారోగ్యం కలుగదు కానీ అది వ్యక్తిని ఇతర అనారోగ్యాలకు మరింతగా లోనయ్యేట్టుగా చేస్తుంది.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
సోమఖనిజలోపం (సెలీనియం లోపం) యొక్క అత్యంత సాధారణ లక్షణాలు కింద పేర్కొన్న కొన్ని వ్యాధులతో సంబంధం కలిగి ఉంటాయి:
- కెషన్ వ్యాధి (Keshan diesease): గుండె బలహీనత, గుండె వైఫల్యం, హృదయ సంబంధమైన షాక్ మరియు విస్తారిత హృదయం దౌర్బల్యాలు మయోకార్డియల్ నెక్రోసిస్ కారణంగా సంభవిస్తాయి.
- కాశీన్-బెక్ వ్యాధి (Kashin-Beck disease): ఈ కాశీన్-బెక్ వ్యాధిలో కీళ్ళ యొక్క కార్టిలజీనోస్ కణజాలం విచ్ఛిన్నం, క్షీణత మరియు కణ మరణానికి దారితీస్తుంది.
- మిక్సవుఇడెమాటోస్ ఎండెమిక్ క్రెటినిజం (Myxoedematous endemic cretinism): ఇది శరీరంలో సోమఖనిజలోపం మరియు అయోడిన్ లోపం కల్గిన తల్లులకు జన్మించిన శిశువుల్లో సంభవిస్తుంది. అలా జన్మించిన శిశువు మానసిక మాంద్యం (మెంటల్ రిటార్డేషన్) యొక్క లక్షణాలు కల్గిఉంటుంది.
ఇతర లక్షణాలు:
- హైపోథైరాయిడిజం
- అలసట పెరగడం
- గాయిటర్ (Goitre)
- మానసిక మాంద్యము
- గర్భస్రావాలు
- జుట్టు ఊడుట
- వంధ్యత్వం
- బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
- సోమఖనిజలోపం (సెలీనియం లోపం) యొక్క అత్యంత సాధారణ కారణం సోమఖనిజం (సెలీనియం) తక్కువగా ఉండే ఆహారపదార్థాలను సేవించడం, సోమఖనిజం తక్కువగా ఉండే నేలల్లో పండించే ఆహారధాన్యాల్లో తక్కువ సోమఖనిజం (సెలీనియం కంటెంట్) ఉంటుంది, వాటిని తినడంవల్ల సోమఖనిజలోపం సంభవిస్తుంది.
- సోమఖనిజలోపం (సెలీనియం యొక్క కొరత) క్రోన్స్ వ్యాధి లేదా ఉదరంలోని ఒకఅవయవం యొక్క కొంతభాగం లేదా మొత్తాన్ని శస్త్రచికిత్స ద్వారా తొలగించడం ఫలితంగా సెలీనియం యొక్క తక్కువ శోషణ సంభవించవచ్చు.
- వృద్ధుల్లో సోమఖనిజం (సెలీనియం) యొక్క బలహీనమైన శోషణ చాలా సాధారణం.
- స్టాటిన్స్ మరియు అమినోగ్లైకోసైడ్లు వంటి మందులు సోమఖనిజ లోపానికి (సెలీనియం లోపం) కారణమవుతాయి.
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
సోమఖనిజలోపం (సెలీనియం లోపం) యొక్క నిర్ధారణ సాధారణంగా ఒక వివరణాత్మక చరిత్ర మరియు శారీరక పరీక్ష తర్వాత జరుగుతుంది.
మీ డాక్టర్ కింది వైద్య తనిఖీలను చేయించామని సలహా ఇస్తారు:
- థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (ఈ హార్మోన్ యొక్క అధిక స్థాయి సెలీనియం లేదా అయోడిన్ లోపం యొక్క సూచికగా ఉంటుంది) కొలిచేందుకు రక్త పరీక్ష.
- సెలీనియం, గ్లూటాతియోన్ పెరాక్సిడేస్ మరియు సెలెనోప్రొటీన్ స్థాయిలు కొలిచేందుకు రక్త పరీక్ష.
సెలీనియంలోపం రుగ్మత యొక్క చికిత్స మీ ఆహారంలో సెలీనియం అధికంగా ఉండే ఆహార పదార్ధాలను చేర్చడంతో పాటుగా సెలీనియం సప్లిమెంట్లను తీసుకోవడం ఉంటుంది.
అనేక మల్టీవిటమిన్ మాత్రలు కూడా సోమఖనిజాన్ని (సెలీనియం) కలిగి ఉంటాయి.
సెలీనియం అధికంగా ఉండే ఆహార పదార్థాలు:
- చేపలు తదితర సీఫుడ్
- మాంసం
- గుడ్లు మరియు పాల ఉత్పత్తులు
- బ్రెడ్, తృణధాన్యాలు, వోట్మీల్ మరియు ఇతర ఆహార ధాన్యాలు.