స్కర్వీ అంటే ఏమిటి?
స్కర్వీ అనేది ఆస్కార్బిక్ ఆమ్లం యొక్క దీర్ఘకాలిక లోపం వల్ల కలిగే ఒక సమస్య, సాధారణంగా ఆస్కార్బిక్ యాసిడ్ను విటమిన్ సి అని పిలుస్తారు. విటమిన్ సి కొల్లాజెన్ ఏర్పడటానికి చాలా అవసరం, కొల్లాజెన్ శరీరంలో రక్త నాళాలు మరియు ఇతర కణజాలాల యొక్క పనితీరులో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ రోజుల్లో విటమిన్ సి లోపం అసాధారణమైనప్పటికీ, ఈ లోపం బలహీనత, రక్తహీనత, చిగుళ్ల వ్యాధులు మరియు చర్మ రక్తస్రావం వంటివి కలిగిస్తుంది. అలాగే విటమిన్ సి ఒక ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్ కూడా.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
వ్యక్తి నుండి మరొక వ్యక్తికి స్కర్వి యొక్క లక్షణాలు మారుతూ ఉండవచ్చు.
ప్రారంభదశ లక్షణాలు:
- సాధారణ బలహీనత మరియు అనారోగ్య భావన.
- అలసట.
- వికారం.
- అతిసారం.
- జ్వరం.
- మైయాల్జియా (కండరాల నొప్పి) మరియు కీళ్ళ నొప్పి.
- ఆకలి తగ్గుదల.
- చర్మం మీద ఉండే జుట్టు ఫోలికల్స్ లో నుండి రక్తస్రావం జరుగడం.
- కాళ్లు చేతుల నొప్పి.
తర్వాతి దశ లక్షణాలు:
- రక్తహీనత.
- పంటి చిగుళ్ల వ్యాధి.
- కళ్ళు ఉబ్బడం.
- చర్మం గోధుమ రంగులో పొడిగా మరియు పొరలుగా మారడం.
- గాయాలు యొక్క నెమ్మదిగా మానడం/ నయం అవ్వడం.
- చర్మం నుండి రక్తస్రావం (Skin haemorrhages).
- అధికమైన జుట్టు నష్టంతో పాటు జుట్టు పొడిబారడం మరియు దెబ్బతినడం.
- కీళ్ళు మరియు కండరాలలో అంతర్గత రక్తస్రావం కావడం వలన చేతులు మరియు కాళ్ళ వాపు.
- ఎముక పెరుగుదల తగ్గిపోవడం.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
స్కర్వీ సాధారణంగా పోషకాహార లోపం ఒక ప్రధాన సమస్యగా ఉండే అభివృద్ధి చెందని దేశాలలో కనిపిస్తుంది.
విటమిన్ సి తగినంత మోతాదులో లేని ఆహారం తీసుకోవడం వలన స్కర్వీ సంభవిస్తుంది.
ప్రమాద కారకాలు వీటిని కలిగి ఉంటాయి:
- అనొరెక్సియా నెర్వోసా, వృద్ధులు, పిల్లలు, మానసిక మరియు శారీరక వైకల్యం ఉన్న వారు, ఒకే నిర్దిష్ట ఆహారం తీసుకునే వారు లేదా పోషకాలు లేని ఆహారం తీసుకునే వారు లేదా ఫుడ్ అలెర్జీ ఉన్న వ్యక్తులు, తగినంత ఆహారం ఆహారం తీసుకోని వారు మరియు కంగారు కంగారుగా తినేవారు
- ఫోషకాలను శరీరం సరిగ్గా శోషించలేని రుగ్మతలు (malabsorption disorders), తీవ్రమైన డీప్పీప్సియా, డయాలసిస్ పై వారు, ఇన్ఫలమేటరీ బౌల్ వ్యాధి మరియు మదలైనటువంటి కొన్ని రకాల వైద్య సమస్యలు ఉన్న వ్యక్తులు.
- ధూమపానం మరియు మద్య దుర్వినియోగం.
- పోషకాహార లోపం.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
ఆరోగ్య చరిత్ర, శారీరక పరీక్ష మరియు లక్షణాలు ఆధారంగా స్కర్వీ నిర్ధారణ చేయబడుతుంది.
విటమిన్ సి- తక్కువగా ఉన్న ఆహారం తీసుకున్న చరిత్ర గురించి కూడా అంచనా వేయబడుతుంది.
పరీక్షలు వీటిని కలిగి ఉంటాయి:
- విటమిన్ సి మరియు ఐరన్ స్థాయిలను కొలిచేందుకు రక్త పరీక్ష.
- చేతులు మరియు కాళ్ళు యొక్క జాయింట్ల ఎక్స్-రే పరీక్ష.
ఒక వ్యక్తికి విటమిన్ C- అధికంగా ఉన్న ఆహారం ఇచ్చినప్పుడు లక్షణాలు తగ్గితే నిర్ధారణ ధృవీకరించబడుతుంది.
చికిత్సలో విటమిన్ సి ప్రత్యామ్నాయాలు (సప్లిమెంట్లు) అందించడం జరుగుతుంది. వైద్యులు విటమిన్ సి సప్లిమెంట్లను సూచిస్తారు. తినే ఆహారంలో విటమిన్ సి-అధికంగా ఉండే ఆహార పదార్థాలను చేర్చాలి. ఇది లక్షణాలను చాలా వరకు తగ్గిస్తుంది. బొప్పాయి, నిమ్మకాయలు మరియు నారింజలు విటమిన్ సిని అధికంగా కలిగి ఉంటాయి.
అంతర్లీన ఆరోగ్య సమస్యలు మరియు వ్యాధిని తీవ్రతరం కారకాలకు సరైన చికిత్స అందించాలి.