సర్కోయిడోసిస్ అంటే ఏమిటి?
సర్కోయిడోసిస్ అనేది శరీరంలోని కణజాలాల్లో ఎరుపుదేలిన మరియు వాపుకల్గిన గుల్మాలు (సూక్ష్మ కణికలు లేక గ్రానోలోమాస్) సంభవించడం, ఈ గుల్మరాలు ఎక్కువగా ఊపిరితిత్తులు మరియు శోషరస కణుపుల్లో సంభవిస్తాయి. ఏ వయస్సులో ఉన్నవారికైనా సార్కోయిడోసిస్ రావచ్చు; ఏదేమైనప్పటికీ, 20-40 సంవత్సరాల అంతరంలో ఉండే వారికి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో, ఇది ఊపిరితిత్తుల తంతీకరణ (పల్మనరీ ఫైబ్రోసిస్) వ్యాధికి కారణం కావచ్చు.
అసాధారణ పెరుగుదల (గ్రానోలోమాస్) ఉన్నప్పటికీ, సార్కోయిడోసిస్ క్యాన్సర్ కాదు మరియు రోగులు 1-3 సంవత్సరాలలోపు ఈ పరిస్థితి నుండి ఉపశమనం పొందుతాయి. వ్యాధి సంకేతాలను తగ్గించడానికి లేదా రోగనిరోధక వ్యవస్థను అణచివేయడానికి మందులు సహాయపడతాయి.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ఈ రుగ్మత యొక్క ప్రాథమిక సంకేతం శ్వాస ఆడకపోవడం, అటుపై ఆకస్మికంగా దద్దుర్లు రావడం జరుగుతుంది. ముఖంపై మరియు చేతుల్లో ఎర్రని దద్దుర్లు లేక ఎర్రని గడ్డలు, కళ్ళు యొక్క వాపు, బరువు తగ్గడం, రాత్రి చెమటలు పట్టడం మరియు అలసటలు సార్కోయిడోసిస్ యొక్క ఇతర లక్షణాలు.
ఈ పరిస్థితి యొక్క ఇతర లక్షణాలు:
- ఛాతి నొప్పి
- శ్వాస ఆడకపోవుట
- అలసట
- ముఖ వాపు
- కీళ్లవాపు (ఆర్థరైటిస్)
- కాళ్లలో బాధాకరమైన గడ్డల
- చంకలు, మెడ మరియు గజ్జల్లో సున్నితత్వం మరియు వాపు గ్రంథులు
- అరీత్మీయ (Arrhythmia) వ్యాధి (గుండె అసాధారణంగా కొట్టుకోవడం)
- మూత్రపిండాల్లో రాళ్లు
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
ఈ వ్యాధి క్రిముల విరుధ్ధంగా మరియు అంటువ్యాధుల విరుద్ధంగా పోరాడే శరీర రోగనిరోధక వ్యవస్థ ఫలితం. దీని ఫలితంగా, కణజాలం యొక్క వాపు మరియు ఎరుపుదేలడాన్ని గమనించవచ్చు. సార్కోయిడోసిస్లో, ఆరోగ్యకరమైన కణజాలం మరియు అవయవాలు కూడా దెబ్బతినడంవల్ల రుగ్మత తీవ్రతరమవుతుంది మరియు గ్రాన్యులామాస్ ఉద్భవిస్తాయి, తద్వారా ఇది స్వయం ప్రతిరక్షక వ్యాధి యొక్క విలక్షణమైన లక్షణాలను చూపిస్తుంది.
పర్యావరణ మరియు జన్యు కారకాలు రుగ్మత యొక్క ప్రధాన కారకాలు అని నమ్ముతారు. అందువలన, ఈ రుగ్మత స్వభావరీత్యా అంటురోగం కాదు.
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
ఈ రుగ్మత యొక్క రోగ నిర్ధారణ వైద్య చరిత్ర, భౌతిక పరీక్ష మరియు ఛాతీ X- రే ఆధారపడి ఉంటుంది. ఈ దశ క్షయవ్యాధి, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, రుమాటిక్ జ్వరం మరియు శోషరస క్యాన్సర్ లాంటి పరిస్థితులను తోసిపుచ్చడానికి ఉపయోగపడుతుంది.
ఊపిరితిత్తుల సార్కోయిడోసిస్ (పల్మనరీ సార్కోయిడోసిస్) ను గుర్తించేందుకు, ఊపిరితిత్తుల CT స్కాన్ సూచించబడుతుంది.
ప్రిడ్నిసోన్ వంటి కార్టికోస్టెరాయిడ్స్ వాపు యొక్క నిర్వహణలో మరియు గ్రాన్యులోమాస్ చికిత్సలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇంకొక ప్రత్యామ్నాయం ఏమంటే దెబ్బతిన్న శరీర అవయవాలచేత పనిచేసేటట్లు చేయటం మరియు రుగ్మత యొక్క లక్షణాలకు చికిత్స చేయడం. అయితే, రుగ్మత తనంతట తానే నయం అయిపోనూవచ్చు. అందువల్ల, వైద్యుడు చికిత్స మొదలుపెట్టే ఖచ్చితమైన సమయాన్ని సిఫారసు చేయకపోవచ్చు.
పైన పేర్కొన్నవి అన్ని ఉన్నప్పటికీ, వ్యక్తిలో సార్కోయిడోసిస్ ఉనికి డాక్టర్తో అనారోగ్యాన్ని క్రమం తప్పకుంగా తనిఖీ చేయించుకోవడం తప్పనిసరి, దీని వల్ల ఆరోగ్యాన్ని పర్యవేక్షించుకోవటం మరియు చికిత్సను సరిచేసుకోవడం వీలవుతుంది. అదేవిధంగా, కార్టికోస్టెరాయిడ్స్ మానసిక కల్లోలం, ద్రవం నిలుపుదల, ఇతర దుష్ప్రభావాతోపాటుగా అధిక రక్త చక్కెరలను కలిగిస్తాయి. వాటి దీర్ఘకాలిక సేవనం కూడా ఎముక బలం నష్టానికి కారణం కావచ్చు మరియు పుండ్లు రావడానికి కారణం కావచ్చు. అందువల్ల ఔషధాల యొక్క సరైన లాభాలను పొందటానికి సిఫార్సు చేసిన మోతాదును తీసుకోవాలి.