రెయిస్ సిండ్రోమ్ అంటే ఏమిటి?
రెయిస్ సిండ్రోమ్ (RS) ప్రధానంగా పిల్లలలో కనిపిస్తుంది మరియు కాలేయానికి దెబ్బ తగలడం మరియు మెదడుకు వాపు కల్గడం లక్షణాల్ని కల్గి ఉంటుంది, ఇతర అవయవాలు కూడా దెబ్బతినొచ్చు. ఇది పెద్దలలో అరుదుగా కనిపిస్తుంది.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
రెయిస్ సిండ్రోమ్ యొక్క చిహ్నాలు మరియు లక్షణాలు వైరల్ సంక్రమణ (జలుబు, ఫ్లూ లేదా చికెన్పోక్స్) సోకిన కొన్ని రోజుల్లోనే అభివృద్ధి చెందుతాయి, కింద పేర్కొన్నటువంటి ప్రారంభ లక్షణాలు కానవస్తాయి:
- అలసట.
- పునరావృత వాంతులు.
- తగ్గించబడిన ఉత్సాహం లేదా ఆసక్తి లేకపోవడం.
- త్వరితగతిన జరిగే శ్వాసక్రియ .
- మూర్ఛలు.
వ్యాధి తీవ్రతరం కావడంతో వ్యాధి లక్షణాలు మరింత తీవ్రంగా మారతాయి, తీవ్ర వ్యాధి లక్షణాలు కిందివిధంగా ఉంటాయి:
- దూకుడు ప్రవర్తన.
- పెరిగిన చిరాకు.
- తీవ్రమైన ఆందోళన.
- భ్రాంతితో పాటు గందరగోళం.
- స్పృహ కోల్పోవడం మరియు కొన్నిసార్లు కోమా.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
రెయిస్ సిండ్రోమ్లో మైటోకాన్డ్రియాలోని చిన్న నిర్మాణాలకు నష్టం (శరీరం యొక్క ప్రతి కణంలో ఉన్న శక్తి ఉత్పాదక యూనిట్లనే మైటోకాండ్రియా గా చెబుతారు) కనిపిస్తుంది. రెయిస్ సిండ్రోమ్ కాలేయాన్ని దెబ్బ తీస్తుంది, దానివల్ల కాలేయం సరఫరా చేసే శక్తి సరఫరాలో తగ్గింపు ఏర్పడుతుంది మరియు శరీరంలో విషపూరిత పదార్థాల నిర్మాణాన్ని పెంచుతుంది. ఇది మొత్తం శరీరానికి నష్టం కలిగిస్తుంది, తద్వారా మెదడులో వాపు సంభవిస్తుంది. రెయిస్ సిండ్రోమ్ యొక్క ప్రధాన కారణం తెలియకపోయినా ఈ వ్యాధి-సంబంధిత పరిస్థితులు ఇలా ఉన్నాయి:
- వైరల్ సంక్రమణ (సాధారణ జలుబు, ఫ్లూ లేదా చిక్పాక్స్).
- ఆస్పిరిన్ వంటి ఔషధాలవల్ల సంభవిస్తుంది.
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
వైద్యుడు లక్షణాల పూర్తి చరిత్రను తీసుకుంటాడు మరియు శారీరక పరీక్షను నిర్వహిస్తాడు. సూచించబడే మరిన్ని పరీక్షలు ఇలా ఉంటాయి:
- కొన్ని రక్త పరీక్షలు, కింద సూచించినటువంటివి:
- అస్పర్టేట్ అమినోట్రాన్స్ఫేరేస్ (ఎ.ఎస్.టి) మరియు అలానిన్ అమినోట్రాన్స్ఫేరేస్ (ALT) పరీక్షలు.
- సీరం ఎలెక్ట్రోలైట్స్.
- రక్తంలో చక్కెర స్థాయి.
- సెరెబ్రోస్పానియల్ ద్రవం (CSF) మూల్యాంకనం.
- మెదడు మరియు కాలేయం యొక్క కంప్యూటెడ్ టోమోగ్రఫీ (CT) స్కాన్.
- కాలేయం యొక్క అల్ట్రాసోనోగ్రఫీ.
- కాలేయపు జీవాణుపరీక్ష.
- నడుము పంక్చర్.
రెయిస్ సిండ్రోమ్ నిర్వహణ:
ఒక పిల్లవాడు రెయి’స్ సిండ్రోమ్తో బాధపడుతున్నపుడు, వెంటనే ఆసుపత్రిలో చేర్చడం మరియు ఇంటెన్సివ్ కేర్ యూనిట్కు ప్రవేశం చేయించడం అవసరం. శరీరం యొక్క కీలక విధుల్ని నిర్వహించడంతోపాటు వ్యాధి లక్షణాలను తగ్గించడం మరియు వాపువల్ల మెదడుకు సంభవించే హానిని నివారించడం చికిత్స యొక్క ప్రధాన లక్ష్యం. శ్వాసక్రియ, రక్తప్రసరణ, రక్తపోటు, నాడి కొట్టుకోవడాన్ని (పల్స్), శ్వాసకోశ రేటు, మరియు శరీర ఉష్ణోగ్రత వంటి ముఖ్యమైన విధుల పర్యవేక్షణ కూడా ముఖ్యమైనది. కొన్నిసార్లు, వెంటిలేటర్ అవసరం కావచ్చు. చికిత్స కోసం అవసరమైన మందులు:
- ఎలెక్ట్రోలైట్లు మరియు ద్రవాలు - లవణాలు, ఖనిజాలు మరియు పోషకాల స్థాయి దిద్దుబాటు కోసం.
- మూత్రవిసర్జకాలు (diuretics)- శరీరం నుండి అదనపు నీటిని తగ్గించడానికి ఈ మందులు సహాయపడుతాయి, తద్వారా మెదడులో వాపును తగ్గిస్తాయి.
- అమోనియా డిటాక్సిఫైయర్స్-శరీరంలో అమోనియా స్థాయిని తగ్గించడంలో సహాయపదాటాయి మందులు.
- మూర్ఛను నియంత్రించడానికి యాంటీకోన్వల్సెంట్ మందులు.