రాబీస్ - Rabies in Telugu

Dr. Ajay Mohan (AIIMS)MBBS

December 24, 2018

March 06, 2020

రాబీస్
రాబీస్

సారాంశం

ర్యాబీస్ అనేది ఒక వైరస్ వల్ల సంభవించే ఒక వ్యాధి, ఇది వ్యాధి సోకిన జంతువు యొక్క లాలాజలo ద్వారా వ్యాపిస్తుంది. ర్యాబీస్ వ్యాధిని వ్యాపింపజేయు అనేక వాహకాలు ఉన్నాయి, ఎక్కువగా కుక్కలు మరియు గబ్బిలాలు. వైరస్ ఒక కాటు ద్వారా లేదా వ్యాధి సోకిన జంతువు యొక్క లాలాజలం ఒక గాయం కలిగిన చోట తాకినా సంక్రమించవచ్చు. ఒకసారి సంక్రమించినప్పుడు, వైరస్ శరీరంలో ప్రవేశిస్తుంది మరియు నాడీ వ్యవస్థపై దాడి చేసి కోమాకు దారి తీస్తుంది మరియు సరియైన చికిత్స చేయకపోతే చివరకు మరణానికి దారి తీస్తుంది. ర్యాబీస్­లో రెండు రకాల ఉన్నాయి – అధిక కోపం మరియు పక్షవాతం. ర్యాబీస్ యొక్క ప్రధాన లక్షణాలు కాంతికి తట్టుకోలేక పోవడం, నొప్పి మరియు కండరాల స్పందనలు, చొంగ కార్చడం (అధిక-లాలాజలం) మరియు నీటిని చూసి భయపడటం. వ్యాధి యొక్క తదుపరి దశలలో, పక్షవాతం మరియు కోమా సాధారణంగా సంభవిస్తాయి. ర్యాబీస్­కు చికిత్స సోకిన ప్రాంతం అంతటా పూర్తిగా శుభ్రపరచడం మరియు కొన్ని వారాల వ్యవధిలో యాంటీ ర్యాబీస్ టీకాల కోర్సును తీసుకోవాలి. ర్యాబీస్­కు సరైన సమయంలో చికిత్స చేయకపోతే కొన్ని సమస్యలు కలుగుతాయి. కొంతమంది వ్యక్తులలో మూర్చలు, శ్వాసకోశ వైఫల్యం మరియు మెదడు వాపు వంటివి కలుగుతాయి. ర్యాబీస్­కు పూర్తిగా సరియైన సమయంలో చికిత్స చేసినట్లయితే మరియు ర్యాబీస్­ వ్యాధి కలిగి ఉన్న  మనుషులు సకాలంలో చికిత్స నిర్వహించబడితే ఆరోగ్యకరమైన మరియు సాధారణ జీవితాన్ని గడపవచ్చు.

రాబీస్ యొక్క లక్షణాలు - Symptoms of Rabies in Telugu

రాబీస్ అనేది ఒక వృద్ధి చెందే వ్యాధి, దీని అర్థం వ్యాధి ఎక్కువ అయ్యే కొలదీ, లక్షణాలు తీవ్రరూపం దాల్చుతాయి. ర్యాబీస్ యొక్క లక్షణాలు వ్యక్తి వైరస్ సోకిన సమయం యొక్క అవధిని బట్టి మారుతుంటాయి. ఇది ర్యాబీస్ లక్షణాలును ఎక్కువ చేయడానికి 30 నుంచి 60 రోజుల సమయo పడుతుంది. ర్యాబీస్ సంక్రమణ యొక్క వివిధ దశలలోని లక్షణాలు ఈ క్రింది విధంగా ఉంటాయి:

  • పెరుగుదల పరిస్థితులు
    వ్యాధి సంక్రమణ తరువాత ప్రారంభ రోజులలో, గాయం ఉన్న ప్రాంతంలో చుట్టూ కొంత సలుపు లేదా నొప్పి ఉండవచ్చు. దురద వంటి కొంత అసౌకర్యాన్ని వ్యాధి యొక్క మొదటి సంకేతంగా చెప్పవచ్చు, వీటి గురించి సాధారణంగా అంతగా పట్టించుకోరు. 
  • ప్రోడ్రోమల్
    సమయానికి వికారం, చలి, జలుబు, మరియు జ్వరం వంటి కొన్ని సంకేతాలు కలుగవచ్చు. ఈ దశలో ఇతర లక్షణాలతో పాటు కండరాల నొప్పి మరియు చిరాకు యొక్క భావాన్ని పొందడం సాధారణం. ఈ సంకేతాలను సాధారణ వైరల్ సంక్రమణలు లేదా ఫ్లూ యొక్క సాధారణ సందర్భాలుగా తరచూ పొరబాటు పడుతుంటారు. 
  • తీవ్రమైన నరాల స్థాయి
    కొంతకాలం తరువాత, ఈ లక్షణాలు చాలా తీవ్రంగా మారుతాయి, దీనివల్ల అధిక జ్వరం, స్థితిభ్రాంతి మరియు అధిక కోపం కూడా కలుగుతాయి. ఈ దశలోనే మూర్ఛలు రావడం కూడా సాధారణం. ఆకష్మికంగా వణకడం, పాక్షిక పక్షవాతం, కాంతి వలన భయము, వేగవంతమైన శ్వాస (అధిక జోరుగా చేయు శ్వాసక్రియ), మరియు చొంగాకార్చడం (అధికంగా ఉమ్మి ఊరడం) వంటివి కొన్ని ఇతర లక్షణాలుగా గమనించవచ్చు.
  • చివరి దశ
    ర్యాబీస్-సోకిన మనుషులు నీటికి దగ్గరైనప్పుడు ఆదుర్దా మరియు భయందోళనల వంటి అనుభూతులను కలిగి ఉంటారు. ఈ పరిస్థితిని సాధారణంగా హైడ్రోఫోబియా లేదా నీటి వలన భయం అని చెప్పబడుతుంది. ఈ దశలో, అన్ని కీలక అవయవాలు పనితీరు నెమ్మదిస్తున్నందున, వ్యాధి సోకిన వ్యక్తి సజీవంగా ఉండటానికి శ్వాస సంబంధిత సహాయం మరియు మందులు అవసరం అవుతాయి. చివరకు, వ్యక్తి కోమాలోకి వెళతాడు మరియు ఇబ్బందికరమైన శ్వాసతో కండరాల కదలిక నియంత్రించబడుతుంది. ఇది స్వల్ప-కాలిక దశ మరియు మరణం సాధారణంగా కొన్ని రోజులలో కలుగుతుంది.

రాబీస్ యొక్క చికిత్స - Treatment of Rabies in Telugu

వ్యక్తికి ఎప్పుడు కాటు వేయబడింది, ఏ జంతువు ద్వారా, మరియు కనిపించే లక్షణాలు మీద చికిత్సా విధానం ఆధారపడి ఉంటుంది. ర్యాబీస్ చికిత్సకు ప్రామాణిక విధానం ఇలా ఉంటుంది:

  • కనీసం 15 నిమిషాలు పాటు ఔషధీయ సబ్బును మరియు నీటిని ఉపయోగించి గాయపడిన ప్రాంతం అంతటా పూర్తిగా కడగడం మరియు శుభ్రపరచడం చేయాలి. చర్మంలో ఏవైనా గాట్లు ఉన్నట్లయితే, వాటిని సబ్బునీటిని కడగాలి. పూర్తిగా అవసరమైతే తప్ప, గాయాలు కుట్లు వేయకుండా అలానే వదిలి వేయడం ఉత్తమం.
  • తరువాత, టెటానస్ మరియు/ లేదా యాంటీబయాటిక్ షాట్ వేయబడుతుంది.
  • మొదట చేయవలసినవి అయిన తరువాత, వ్యక్తికి ర్యాబీస్ టీకా వేయబడుతుంది. వ్యక్తి ఒక పెంపుడు జంతువు ద్వారా కరవబడితే మరియు ఎలాంటి లక్షణాలను (లక్షణాలు లేకుండా) కనిపించకపోతే, అప్పుడు డాక్టర్ కొన్ని రోజుల పాటు వ్యక్తిని మరియు జంతువులను జాగ్రత్తగా పరిశీలనలో ఉంచవచ్చు. పెంపుడు జంతువు పరిశీలించబడకపోయినా, ర్యాబీస్ వ్యాధి యొక్క ప్రాబల్యం గురించి వ్యక్తి యొక్క పొరుగు వారితో తనిఖీ చేస్తారు. స్క్రీనింగ్ మీద ఉన్నపుడు, జంతువు తీవ్రమైన ధోరణులను చూప ఉంటుంది, దానిని చంపివేసి తరువాత ర్యాబీస్ కోసం పూర్తిగా పరీక్ష చేయబడుతుంది. జంతువుని గమనించిన సందర్భాలలో ఎలాంటి తీవ్రమైన ప్రవర్తన చూపించకపోయినపుడు, ఎలాంటి రోగనిరోధకత అవసరం లేదు.
  • జంతువుచే కరవబడిన వ్యక్తిలో రేబీస్ ను గనక అనుమానించినట్లయితే, డాక్టరు నేరుగా టీకా చికిత్సను ప్రారంభిస్తారు. 
  • జంతువుచే కరవబడిన వ్యక్తిలో రేబీస్ ను గనక అనుమానించినట్లయితే, డాక్టరు నేరుగా టీకా చికిత్సను ప్రారంభిస్తారు. రోబీస్ ప్రతిరోధకాలను ఇమ్యునోగ్లోబిన్ ఇంజెక్షన్ల ద్వారా ఇవ్వబడతాయి, ఇవి వ్యాధిని ఎదుర్కోవడానికి మరియు ర్యాబీస్ వైరస్­ని శరీరంలో ఉండడాన్ని నివారిస్తాయి. ఇలాంటి 5 సూది మందులు ఒక పక్షం రోజులలో ఇవ్వబడతాయి. కొంతమంది వైద్యులు ఈ రకమైన సూది మందులను ముందు జాగ్రత్త చర్యగా సూచిస్తారు, ప్రత్యేకించి జంతువు పరిశీలన కోసం అందుబాటులో ఉండకపోవచ్చు. వ్యక్తి ఒక అడవి జంతువు ద్వారా కరవబడిన సందర్భాలలో, ఇది ఎల్లప్పుడూ తక్షణ చికిత్స అవుతుంది.
  • లక్షణాలు కనిపించి మరియు రోగి టీకా దశ మించిన సందర్భాలలో, అనారోగ్య నివారణ కోసం ఔషధం ఇవ్వబడుతుంది. కండరాల విశ్రామకాలు మరియు మందులు కూడా బెంగను తొలగించటానికి పెయిన్ కిల్లర్లతో సహా ఇవ్వబడతాయి.
  • చికిత్స జరుగుతున్నంత కాలమంతటా వ్యక్తిని జాగ్రత్తగా గమనించడం మరియు వ్యాధి పురోగమనాన్ని సూచించేవిగా ఏవైనా గమనించదగిన అలవాట్లు ఉన్నాయేమో చూస్తూ ఉండడం ముఖ్యము. అటువంటి చిహ్నాలు ఏవైనా కనిపించినప్పుడు డాక్టర్లను అప్రమత్తం చేయడం చాలా ముఖ్యము.

జీవనశైలి యాజమాన్యము

ఒకవేళ సకాలములో గనక రేబీస్ ను నిర్ధారణ చేసినట్లయితే, దానిని సమర్థవంతంగా నిర్వహణ చేసి చికిత్స చేయవచ్చు, తద్వారా ప్రభావిత వ్యక్తి సంపూర్ణంగా సాధారణ మరియు ఆరోగ్యవంతమైన జీవనం గడపగలుగుతారు. రేబీస్ చికిత్సలకు కొన్ని దుష్ప్రభావాలు ఉండవచ్చు, అవి కొంతకాలం పాటు నిలిచి ఉండవచ్చు. ఇటువంటి దుష్ప్రభావాలలో నొప్పి, కడుపుల్ వికారము, కడుపు త్రిప్పట మరియు మగత ఉండవచ్చు. ఈ దుష్ప్రభావాలు కాలం గడిచే కొద్దీ నయమవుతాయి.  అయినప్పటికీ, ప్రభావిత వ్యక్తికి మళ్ళీ రేబీస్ సోకకుండా చూసుకోవడానికై తగు జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ర్యాబీస్ వైరస్­కు గురైనట్లయితే కొన్ని అడ్వెంచర్ లేదా వన్యప్రాణులకు సమీపంలో ఉండే జీవనశైలి ఎంపికల నుండి వచ్చినట్లయితే, భవిష్యత్లో మరింత జాగ్రత్త తీసుకోవాలి. ఒక సంఘటన సమీప ప్రాంతంలో జరిగితే, అప్పుడు అన్ని వీధి జంతువులను పరిశీలించబడాలి మరియు స్థానిక పౌర విభాగాన్ని అప్రమత్తం చేయాలి.

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Energy & Power Capsule by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for problems like physical and sexual weakness and fatigue, with good results.
Power Capsule For Men
₹495  ₹799  38% OFF
BUY NOW


వనరులు

  1. Rozario Menezes. Rabies in India. CMAJ. 2008 Feb 26; 178(5): 564–566. PMID: 18299543
  2. Sudarshan MK. Assessing burden of rabies in India. WHO sponsored national multi-centric rabies survey (May 2004). Assoc Prev Control Rabies India J 2004; 6: 44-5
  3. BMJ 2014;349:g5083 [Internet]; Concerns about prevention and control of animal bites in India
  4. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Rabies
  5. World Health Organization [Internet]. Geneva (SUI): World Health Organization; Rabies
  6. World Health Organization [Internet]. Geneva (SUI): World Health Organization; Rabies
  7. Rupprecht CE. Rhabdoviruses: Rabies virus. In: Baron S, editor. Medical Microbiology. 4th edition. Galveston (TX): University of Texas Medical Branch at Galveston; 1996. Chapter 61
  8. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Compendium of Animal Rabies Prevention and Control, 2003*

రాబీస్ కొరకు మందులు

Medicines listed below are available for రాబీస్. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.