క్యూ జ్వరం (Q ఫీవర్) అంటే ఏమిటి?
క్యూ జ్వరం, లేదా క్వేరి జ్వరం, అనేది కాక్సిల్ల బర్నేట్టి (Coxiella burnetii) అనే బాక్టీరియా వలన సంభవించే ఒక ఆరోగ్య పరిస్థితి. ఈ బాక్టీరియాను సాధారణంగా ఆవులు, మేకలు మరియు గొర్రెలు వంటి పాడి జంతువులలో గుర్తించవచ్చు. ఈ బ్యాక్టీరియా ద్వారా సాధారణంగా ప్రభావితమైయ్యే వారు (మానవులలో) పశువైద్యులు లేదా పశువులకు చికిత్స చేసేవారు, రైతులు మరియు పరిశోధనశాలలో ఈ బాక్టీరియాల చుట్టూ పని చేసేవారు. ఈ సమస్యతో భాదపడుతున్నపుడు లక్షణాలు అసలు కనిపించకపోవడం లేదా తేలికపాటి లక్షణాలను మాత్రమే కలిగి ఉండటం సర్వసాధారణం. కొన్ని తీవ్రమైన లక్షణాలు కూడా అభివృద్ధి చెందుతాయి, అయితే ఈ పరిస్థితి మందుల ద్వారా నయం కాబడుతుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
Q ఫీవర్ యొక్క లక్షణాలు వెంటనే కనిపించవు. బాక్టీరియా కొన్ని వారాల పాటు శరీరంలో ఉన్న తర్వాత మాత్రమే ఏవైనా సంకేతాలు పైకి కనిపిస్తాయి. సాధారణ లక్షణాలు:
- జ్వరం
- చెమటలు లేదా చలి
- దగ్గు మరియు ఛాతీ పట్టేసినట్లు ఉండడం
- తలనొప్పి
- అతిసారం, మలం లేత రంగు లేదా మట్టి రంగులో ఉంటుంది
- కడుపులో వికారం మరియు నొప్పి
- కామెర్లు
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
Q జ్వరాన్ని కలిగించే బాక్టీరియా సాధారణంగా పశువులు, మేకలు మరియు గొర్రెలలో కనబడుతుంది. సాధారణంగా జంతువుల మూత్రం, మలం మరియు పాలలో బ్యాక్టీరియా ఉంటాయి మరియు దుమ్ము ద్వారా వ్యాప్తి చెందుతుంది, జంతువులతో ఎక్కువగా సంబంధం కలిగి ఉన్నవారు కలుషిత దుమ్మును పీల్చుకోవడం వలన వారికి సంభవిస్తుంది. Q ఫీవర్ ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి వ్యాపించడం సాధ్యం కాదు.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
లక్షణాలు ఎక్కువగా చాలా సాధారణంగా ఉండడం వలన, Q జ్వరాన్ని ఖచ్చితంగా నిర్ధారించడం కష్టం. అయితే, Q జ్వరం యొక్క లక్షణాలు మరియు జంతువులు చుట్టూ పనిచేసే రోగి యొక్క చరిత్ర ఆధారంగా వైద్యులు దీనిని అంచనా వేస్తారు. Q జ్వరాన్ని నిర్ధారించడానికి యాంటీబాడీ పరీక్ష ఉత్తమ మార్గం, కానీ వ్యాధి సోకిన 10 రోజుల లోపు దానిని నిర్వహించినట్లయితే ఫలితం ప్రతికూలంగా (నెగటివ్) వస్తుంది.
Q జ్వరం తేలికపాటిగా ఉంటే, సాధారణంగా ఏ మందులు లేకుండా కొన్ని రోజుల్లో దానికదే తగ్గిపోతుంది. తీవ్రముగా ఉంటే, 2 నుంచి 3 వారాల పాటు యాంటీబయాటిక్స్ సూచించబడవచ్చు. పరిస్థితి దీర్ఘకాలికంగా ఉన్న సందర్భాలలో 18 నెలల పాటు యాంటీబయాటిక్స్ను ఇవ్వవచ్చు.