సోరియాటిక్ కీళ్లనొప్పి అంటే ఏమిటి?

సోరియాసిస్ (పొడవ్యాధి) అనేది ఓ దీర్ఘకాలిక చర్మ రుగ్మత, చర్మం ఎరుపుదేలడం మరియు పొలుసులుగా (పొరలు) మారడం దీని లక్షణాలు. ఇలాంటి పొడవ్యాధి లేదా సోరియాసిస్ వ్యాధి కల్గిన వ్యక్తులకు సంభవించేదే “సొరియాటిక్ కీళ్లనొప్పి.” ఇందులో కీళ్లు వాపుదేలడం మరియు తరచుగా చాలా బాధాకరమైన కీళ్లనొప్పి ఉంటుంది. సాధారణంగా, సోరియాటిక్ కీళ్లనొప్పి బాధితులు కీళ్లనొప్పి లక్షణాలు వచ్చేటందుకు కొన్ని సంవత్సరాలు ముందుగా పొడరోగం (సోరియాసిస్) చర్మరోగాన్ని కలిగి ఉంటారు.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

ఇదో రకమైన కీళ్లనొప్పి  అయినందువల్ల దీని సంకేతాలు మరియు వ్యాధి లక్షణాలు వివిధ సందర్భాల్లో తేడా ఉండవచ్చు. ఈ రుగ్మతతో ఉన్న వ్యక్తులలో చాలా సాధారణ చిహ్నాలు మరియు లక్షణాలు కొన్ని:

  • వాపుదేలిన లేదా పేదసారంతో కూడిన కీళ్ళు.
  • కండరాల నొప్పి.
  • చర్మంపై పొలుసులు కల్గిన మచ్చలు.
  • వేళ్లు, కాలివేళ్లు, మణికట్లు, చీలమండలు మరియు మోచేతుల వంటి చిన్న కీళ్లలో కూడా నొప్పి ఉంటుంది.

కొన్ని సందర్భాల్లో కంటి సమస్యలు కూడా సంభవిస్తాయి, అత్యంత సాధారణమైన కండ్లకలక (కంజున్క్టివిటిస్) మరియు కృష్ణపటలశోథ (యువెటిస్).

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

సాధారణంగా సోరియాసిస్ నిర్ధారణ అయిన వ్యక్తులకు అది నిర్ధారణ అయిన కొంత సమయం తర్వాత సోరియాటిక్ కీళ్లనొప్పి అభివృద్ధి చెందుతుంది. సోరియాసిస్ చర్మవ్యాధిలో లాగానే  సోరియాటిక్ కీళ్ళవ్యాధిలో కూడా రోగనిరోధక వ్యవస్థ ఆరోగ్యకరమైన కణజాలంపై దాడి చేసినప్పుడు ఈ వ్యాధి సంభవిస్తుంది. అందువలన, దీన్ని “స్వయం ప్రతిరక్షక స్థితి” అని పిలుస్తారు. ఈ దాడులను ఏది ప్రేరేపిస్తుందో స్పష్టంగా లేదు, కానీ ఒత్తిడి, వైరస్ లేదా గాయం వంటి జన్యు కారకాలు మరియు పర్యావరణ కారకాల కలయిక పాత్రను పోషిస్తాయని నిపుణులు భావిస్తారు.

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

కీళ్లనొప్పులు (కీళ్లసమస్యలు) లేదా కీళ్ల పెడసరం లక్షణాల ఆధారంగా, వైద్యుడు వైద్య పరీక్షలను సూచిస్తారు మరియు మరొక అంచనా కోసం ఒక రుమటాలజిస్ట్ (కీళ్ళవ్యాధి నిపుణుడిని) ను సంప్రదించమని వ్యక్తికి సూచించవచ్చు. కీళ్లనొప్పి రకాన్నిగుర్తించేందుకు సాధారణ పరీక్షలైన ఎక్స్-రేలు మరియు రక్త పరీక్షల్ని ఎర్ర రక్త కణ అవక్షేప రేటు మరియు C- రియాక్టివ్ ప్రోటీన్ యొక్క పెరిగిన స్థాయిని చూడ్డానికి చేస్తారు.

ఒక నిర్దిష్ట ఔషధం సొరియాటిక్ కీళ్లవ్యాదున్న ప్రతిఒక్కరికీ పని చేయకపోవచ్చు, అందువల్ల సరైన మరియు సమర్థవంతమైన ఔషధం కనిపించేవరకూ అనేక మందుల్ని ప్రయత్నించాలి. మనిషి కదలికల్న సులభతరం చేసేందుకు మరియు కీళ్లనొప్పుల సమస్యలకు సహాయం కోసం శోథ నిరోధక మందులు మరియు యాంటీ-రుమాటిక్ మందుల్ని భౌతిక చికిత్సతోపాటు సూచించబడవచ్చు. కార్టికోస్టెరాయిడ్స్, బయోలాజిక్స్ లేదా రోగనిరోధకశక్తి అణచివేత మందులు (immunosuppressants) కూడా సూచించబడవచ్చు.

కీళ్లనొప్పి (ఆర్థరైటిస్), చాలా సందర్భాలలో, నిరంతరంగా ఉంటుంది మరియు పూర్తిగా నయం కావడమనేది ఓ సవాలుగా ఉంటుంది, కానీ సరైన ఔషధాలు మరియు చికిత్సతో కీళ్లనొప్పి తిరిగి రాకుండా నివారించవచ్చు.

Dr. Vikas Patel

Orthopedics
6 Years of Experience

Dr. Navroze Kapil

Orthopedics
7 Years of Experience

Dr. Abhishek Chaturvedi

Orthopedics
5 Years of Experience

Dr. G Sowrabh Kulkarni

Orthopedics
1 Years of Experience

Medicines listed below are available for సోరియాటిక్ ఆర్థ్రరైటిస్. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.

OTC Medicine NamePack SizePrice (Rs.)
Aprezo Tablet10 Tablet in 1 Strip280.7
Apxenta 30 Mg Tablet10 Tablet in 1 Strip151.2
Aplex 30 Mg Tablet10 Tablet in 1 Strip138.6
Aplex Kit13 Tablet in 1 Strip136.5
ENTINIB 400MG TABLET 10S1491.0
Pdlast Tablet10 Tablet in 1 Strip175.0
Read more...
Read on app