ప్రాథమిక అండాశయలోపం అంటే ఏమిటి?
ప్రాథమిక అండాశయలోపం రుగ్మత కారణంగా మహిళల్లో నలభై ఏళ్ళలోపలే ముట్లుడిగి పోతాయి (అంటే రుతుక్రమం ఆగిపోతుంది), దానితోపాటు హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. లేకపోతే, నిర్దిష్ట వయసుకు ముందుగానే ముట్లుడిగిపోవడమన్నది చాలా అరుదుగా జరుగుతుంది.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
“ప్రాధమిక అండాశయలోపం” రుగ్మతతో బాధపడుతున్న మహిళల యొక్క ముఖ్యమైన మరియు నిశ్చయాత్మక సంకేతం ఏదంటే గర్భందాల్చలేకపోవడం. ఈ రుగ్మత యొక్క ఇతర స్పష్టమైన సంకేతాలు మరియు లక్షణాలు:
- క్రమరహిత ఋతుచక్రాలు లేదా అసలు ఋతుచక్రాలు రాకుండానే ఉండే పరిస్థితి
- రాత్రి చెమటలు.
- తగ్గిన లైంగిక సామర్థ్యం
- శరీరమంతా వేడిగా (మంటగా) ఉండడం, దీన్నే వేడి ఆవిర్లు (hot flashes)గా సూచిస్తారు .
- చెప్పలేని చికాకు మరియు ఏకాగ్రత లేకపోవడం.
- యోనిప్రాంతం కృశించడం (యోని కణజాలం యొక్క నష్టం లేదా నాశనం). అండాశయ గోడలు పలుచబడ్డ కారణంగాను లైంగిక క్రియ సమయంలో నొప్పి మరియు గర్భం కడుపులో ఏర్పడ్డ కారణంగా యోని కృశించడం జరుగుతుంది.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
ప్రాధమిక గర్భాశయ లోపాల కారణాలు సహజంగా లేదా హార్మోన్ల అసమతుల్యత లేదా జన్యుపరమైన రుగ్మత వల్ల కావచ్చు. ఈ రుగ్మతకు కారణమయ్యే ప్రధాన కారణాలు:
- టర్నర్స్ సిండ్రోమ్ - X క్రోమోజోముల యొక్క పూర్తి తొలగింపు లేదా X క్రోమోజోములు అసలు లేకపోయిన పరిస్థితి.
- X క్రోమోజోమ్ అసాధారణలు - అండాశయ విధుల వైఫల్యం X క్రోమోజోమ్ల అసాధారణతలు లేదా తొలగింపులతో సంబంధం కలిగి ఉంటుంది.
- జన్యుపరమైన రుగ్మతలు, అలైంగిక క్రోమోజోమ్ సంబంధిత రుగ్మతలతో బాటు వచ్చే జన్యుపర రుగ్మతలు. ఉదాహరనుకు గాలక్టోసామియా (శరీరంలో గాలక్టోజ్ లు జమవడం. ఇది మెటాబోలిస్ లేని ఒక ఎంజైమ్ లేకపోవడం వల్ల ఏర్పడుతుంది) మరియు గోనాడోట్రోపిన్ రిసెప్టర్ పనిచేయకపోవడంవల్ల (లైంగిక హార్మోన్ల గ్రాహకాలు పనిచేయకపోవడం) వంటి ఇతర కారణాలతో కూడిన జన్యుపరమైన రుగ్మతలు.
- పర్యావరణ టాక్సిన్లు లేదా ధూమపానం కూడా సంతానోత్పత్తిపై ప్రతికూల ప్రభావాల్ని కలుగజేస్తుంది.
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
ఒక సాధారణ వైద్యుడు (general physician) లేదా గైనకాలజిస్ట్ ‘విఫలమైన గర్భధారణ’ (failed conception) ఆధారంగా పలు విశ్లేషణ పరీక్షలను సూచించవచ్చు. అండాశయ వైఫల్యం ఉందన్న అనుమానం కల్గితే అనేక పరీక్షలు సూచించబడతాయి:
- ఫొల్లికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ టెస్ట్ (FSH) - అకాల అండాశయపు లోపం యొక్క పరిస్థితులలో, FSH యొక్క స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయి.
- ఎస్ట్రాడాయోల్ టెస్ట్ - రక్తప్రవాహంలో కనుగొనబడే ఎస్ట్రాడియోల్ యొక్క స్థాయిలు అకాల అండాశయ లోపాల పరిస్థితుల్లో చాలా తక్కువగా ఉంటాయి.
- కార్యోటైప్ - క్రోమోజోముల అధ్యయనం.
- FMR1 జన్యు పరీక్ష.
చికిత్స యొక్క ప్రధాన ప్రాముఖ్యత ఈస్ట్రోజెన్ యొక్క ఉత్పత్తి లేదా శరీరంలోకి ఈస్ట్రోజెన్ కణాల్ని ప్రవేశపెట్టడంపై ఉంటుంది, దీనివల్ల చివరికి వేడి సెగలు (hot flashes) మరియు ముట్లు రాకపోవడం వంటి వ్యాధి లక్షణాలను ఉపశమనం పొందుతాయి. ప్రొజెస్టెరాన్తో పాటు ప్రవేశపెట్టబడే ఈస్ట్రోజెన్ ఈ వ్యాధికారణంగా దెబ్బ తిన్న గర్భాశయం యొక్క గోడల్ని (లైనింగ్ను) రక్షించడంలో సహాయపడుతుంది, ఈ వైద్య స్థితిలో గర్భాశయం యొక్క గోడలు దెబ్బతిని సన్నగా మారి ఉంటాయి.