పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటే ఏమిటి?
పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (పి.టి.ఎస్.డి) అనేది కొంత మంది వక్తులు వారి జీవితంలో కొన్ని తీవ్రంగా కలతపెట్టే సంఘటనలను అనుభవించడం/చూడడం వలన సాధారణంగా సంభవించే ఒక మానసిక స్థితి. ఇది కొంతమంది వ్యక్తుల మనస్సు మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది మరియు వారి రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం కూడా కలుగవచ్చు. రోగి, కుంగుబాటు లేదా పేనిక్ అట్టాక్ వంటి ఇతర మానసిక రుగ్మతలతో పాటుగా కూడా ఈ పరిస్థితిని అనుభవించవచ్చు. మరింతగా బాధపడవలసిన విషయం ఏమిటంటే, పి.టి.ఎస్.డి ఆత్మహత్య ధోరణిని కూడా ప్రేరేపించవచ్చు.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ది మానసిక మరియు శారీరక ప్రభావాలు కలిగిన ఒక మానసిక రుగ్మత. దాదాపుగా ఎల్లప్పుడూ దీనితో ముడి పడి ఉండే కొన్ని సంకేతాలు ఈ క్రింది విధంగా ఉంటాయి:
- ఒత్తిడితో కూడిన సంఘటనను అనుభవిన లేదా చూసిన చరిత్ర.
- తీవ్ర ఒత్తిడి కలిగించిన సంఘటనలను మళ్ళి అనుభవించడం, పీడకలలు లేదా ముందు జరిగిన సంఘటన పదే పదే గుర్తు రావడం
- ఇబ్బంది పెట్టిన సంఘటనను గుర్తు చేసే పరిస్థితులు, ప్రదేశాలు మరియు ప్రజలను నివారించడానికి ప్రయత్నించడం అవి రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నప్పటికీ వాటిని నివారించడం.
- చిరాకు, ఏకాగ్రత సమస్యలు, మరియు నిద్ర ఆటంకాలు వంటి హైపర్ ఆరోసాల్ (Hyperarousal) లక్షణాలు.
లైంగిక హింసకు గురికావడం, ఒక ప్రకృతి విపత్తును ఎదుర్కొవడం, ఏదైనా ఆయుధంతో బెదిరింపుకు గురికావడం, ప్రాణహాని కలిగేటువంటి ప్రమాదానికి గురికావడం, వేరొక వ్యక్తిని చంపడం / తీవ్రంగా గాయపరచడాన్ని చూడడం వంటి వివిధ సంఘటనల వలన ఇది సంభవించవచ్చు.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
తీవ్రవాద చర్యలు, హింసాత్మక నేరాలు, సైనిక పోరాటాలు, ప్రకృతి వైపరీత్యాలు, తీవ్రమైన ప్రమాదాలు లేదా హింసాత్మక వ్యక్తిగత దాడుల, ఆకస్మిక భయంకర సంఘటనలు వంటివి చాలా అరుదుగా సంభవిస్తాయి. మనలో చాలామంది అలాంటి ఒత్తిడితో కూడిన సంఘటనల వలన తీవ్రంగా కలత చెందుతాము, కానీ కొన్ని రోజులు లేదా వారాల తర్వాత భాధ నుండి బయటపడి, సాధారణ జీవితాలను తిరిగి ప్రారంభించడానికి ప్రయత్నిస్తాము.
మన శరీరం ఒక బాధాకరమైన సంఘటన యొక్క ఒత్తిడికి భిన్నంగా స్పందిస్తుంది. సాధారణంగా, ప్రజలు ఒత్తిడిని ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తారు. అయితే, కొందరు వ్యక్తులు అటువంటి 'ప్రయత్నాలను' చేయలేరు మరియు భాధ లేదా భయాన్ని అణిచివేసేందుకు ప్రయత్నిస్తారు. అది పి.టి.ఎస్.డికి దారి తీయవచ్చు.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
స్వీయ-నివేదిత లక్షణాలు లేదా నిర్దిష్ట అభ్యాస-సహాయక (practitioner-assisted) ప్రశ్నలు మరియు ప్రమాణాల అంచనా ద్వారా నిర్ధారణ చేయవచ్చు. రోగి యొక్క సున్నితత్వాన్ని బట్టి వీటిని చాలా వివేకముతో తెలివిగా తెలుసుకోవాలి. చికిత్సలో కౌన్సెలింగ్ (counselling), కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (cognitive behavioural therapy), గ్రూప్ థెరపీ (group therapy), రిలాక్సేషన్ టెక్నిక్స్ (relaxation techniques) మరియు స్నేహితులు మరియు కుటుంబం నుండి పూర్తి సహకారం వంటివి ఉంటాయి. పరిస్థితి తీవ్రతను బట్టి సాధారణంగా యాంటీడిప్రజంట్స్ (antidepressants) వంటి మందులను సూచించవచ్చు.