పొలియో - Polio (Poliomyelitis) in Telugu

Dr. Ajay Mohan (AIIMS)MBBS

December 14, 2018

March 06, 2020

పొలియో
పొలియో

పొలియో అంటే ఏమిటి?

సాధారణంగా పోలియో అని పిలవబడే పోలియోమైలిటిస్ (Poliomyelitis), ఒక న్యూరోమస్కులర్ డిజెనరేటివ్ డిజార్డర్ (neuromuscular degenerative disorder). పిరినోవిరిడే (Picornaviridae) కుటుంబానికి చెందిన వైరస్ ఈ వ్యాధి కారక కర్త. ఈ వైరస్ వెన్నుపాము మరియు మెదడు యొక్క ముందరి హార్న్ మోటార్ న్యూరాన్ల (anterior horn motor neurons) మీద దాడి చేస్తుంది; మోటార్ న్యూరాన్లు తిరిగి నయం కావు తద్వారా దాని సంబంధిత స్కెలిటల్ (అస్థిపంజర) కండరాలు తప్పుగా ఏర్పడతాయి.

ఇది చాలా అధికంగా వ్యాప్తి చెందే/సంక్రమించే వైరస్; అయినప్పటికీ, చాలామంది వ్యక్తులలో ఏటువంటి లక్షణాలు కనిపించవు. చాలా తక్కువ సందర్భాల్లో, వైరస్ కేంద్ర నాడీ వ్యవస్థను (central nervous system) చేరుకుంటుంది. అప్పుడు రోగులు తలనొప్పి, మెడ పట్టేయడం, అసౌకర్యం మొదలైన లక్షణాలను కలిగి ఉండవచ్చు. వ్యాధి కొన్ని సార్లు పక్షవాతానికి కూడా దారితీస్తుంది.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

రోగికి తేలికపాటి అనారోగ్యం, గొంతులో ఇన్ఫెక్షన్ (throat infection), జ్వరము లేదా గ్యాస్ట్రోఎంట్రైటిస్ యొక్క చరిత్రను కలిగి ఉంటాడు.

  • తేలికపాటి అనారోగ్యం కండరాలు బిగుసుకుపోవడం మరియు తీవ్ర నొప్పిని కలిగించవచ్చు.
  • కాళ్ళు చేతులు బలహీనం అవుతాయి, ఒక అంగము (కాలు లేదా చెయ్యి) కంటే ఇతర అంగము (కాలు లేదా చెయ్యి) ఎక్కువగా ప్రభావితం అవుతుంది, మరియు చేతుల కంటే కాళ్లు ఎక్కువ ప్రభావితం అవుతాయి.
  • పూర్తిగా ప్రభావితం అయ్యే వరకు కండరాలు వదులు మారుతాయి మరియు రిఫ్లెక్స్ (flaccid) లు నెమ్మదైపోతాయి.
  • పక్షవాతం కొన్ని వారాలపాటు ఉంటుంది.

రోగులు అనేక సంవత్సరాల తరువాత పరిస్థితి నుండి నెమ్మదిగా కోలుకుంటారు.

కొన్ని సందర్భాల్లో కొందరు చిన్ననాటి పోలియో నుండి ఎటువంటి లక్షణాలు లేకుండా కోలుకున్నప్పటికీ, లక్షణాలు నయం అయిన దశాబ్దాల తర్వాత కనిపించవచ్చు. ఈ పరిస్థితి పోస్ట్ పోలియో సిండ్రోమ్ (post-polio syndrome) అని పిలుస్తారు మరియు ఇది పురోగతి చెందేది మరియు అంటువ్యాధి కానిది. దీనికి ఎటువంటి నివారణ లేదు.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

వ్యాధికారక జీవి పిరినోవిరిడే కుటుంబానికి చెందిన పోలియో వైరస్. ఇది ఒరో-ఫికల్ రూట్ (oro-faecal route) లేదా ఒరొఫారింజియల్ రూట్ (oropharyngeal route) ద్వారా వ్యాపిస్తుంది. తక్కువ రోగనిరోధక శక్తి కలిగిన రోగులలో మరియు పరిశుభ్రత సరిగ్గాలేని మరియు పారిశుద్ధ్యత లేని  పరిస్థితులలో ఉన్నవారిలో వ్యాధి సంభావ్యత ప్రమాదం పెరుగుతుంది. కలుషితమైన ఆహారం మరియు నీటిని తీసుకోవడం అనేది శరీరంలోని వ్యాధికారక జీవి ప్రవేశించడానికి ప్రధాన మార్గం.

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

వైద్య/ఆరోగ్య  సంకేతాలు మరియు లక్షణాల బట్టి పోలియో అనుమానించబడవచ్చు. రోగ నిర్ధారణను దృవీకరించే ఒక ప్రామాణిక ప్రక్రియ, పోలియోవైరస్ను గుర్తించే పాలిమరెస్ చైన్ రియాక్షన్ టెస్ట్ (polymerase chain reaction test). మలం, గొంతు స్వెబ్లు (swabs), రక్తం, మరియు సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ (CSF, cerebrospinal fluid) వంటివి నమూనా వనరులు (sample sources).

పరాలైటిక్ పోలియోమైలిటిస్ (పక్షవాతం కలిగించే పోలియో) నుండి రికవరీ సాధ్యం కాదు. ప్రభావితమైన అవయవం యొక్క రెహెబిలిటేషన్ (rehabilitation), ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ (rehabilitation), మరియు రిక్రెషినల్ థెరపీ (recreational therapy) వంటివి చికిత్స యొక్క లక్ష్యం. నొప్పి ఉపశమనం కోసం నొప్పి నివారుణులు ఇవ్వబడతాయి.

పోలియోను ఎదుర్కొనే అత్యంత ప్రభావవంతమైన విధానం రోగనిరోధకత (immunisation) ద్వారా వ్యాధిని నివారించడం. పోలియో నివారణకు పెద్ద మొత్తంలో ఇమ్యునైజేషన్ అవసరమవుతుంది.



వనరులు

  1. Mehndiratta MM, Mehndiratta P, Pande R. Poliomyelitis. historical facts, epidemiology, and current challenges in eradication. Neurohospitalist. 2014 Oct;4(4):223-9. PMID: 25360208
  2. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; What Is Polio?.
  3. National Health Portal [Internet] India; Poliomyelitis.
  4. John TJ,Vashishtha VM. Eradicating poliomyelitis: India's journey from hyperendemic to polio-free status. Indian J Med Res. 2013 May;137(5):881-94. PMID: 23760372
  5. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Polio.

పొలియో కొరకు మందులు

Medicines listed below are available for పొలియో. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.