పిఎంయస్ అంటే ఏమిటి?
పిఎంయస్, లేదా ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ (premenstrual syndrome), అనేది ఋతుస్రావము ముందు మహిళలు అనుభవించే వివిధ శారీరక మరియు భావోద్వేగ లక్షణాలు సూచిస్తుంది. ఋతుస్రావాలు జరిగే మహిళలలో పిఎంయస్ చాలా సాధారణ పరిస్థితి. ఇది తేలికపాటి నుండి తీవ్రముగా ఉండవచ్చు. ఈ పరిస్థితి ప్రాణాంతకం కాకపోయినా, లక్షణాలు వ్యక్తి యొక్క జీవిత నాణ్యతను ప్రభావితం చేయగలవు.
పిఎంయస్ (PMS)కు సంబంధించిన ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
పిఎంయస్ కారణంగా మహిళలు అనేక లక్షణాలను ఎదుర్కొంటారు. అయినప్పటికీ, ప్రతి స్త్రీ లక్షణాలన్నింటినీ అనుభవించదు. వాటిలో ఇవి ఉంటాయి:
శారీరక లక్షణాలు:
- ఉబ్బరం
- గుండెల్లో మంట
- విరేచనాలు లేదా అతిసారం
- వివిధ రకాల తిండి కోసం కోరికలు
- మలబద్ధకం
- రొమ్ములలో నొప్పి
- తలనొప్పి
- తొడలలో నొప్పి
- నడుము నొప్పి
- తిమ్మిర్లు
భావోద్వేగ లక్షణాలు:
- చిరాకు
- విసుగు
- గందరగోళం
- దృష్టి కేంద్రీకరించడంలో సమస్యలు
- ఆందోళన
- కుంగుబాటు
- మానసిక స్థితిలో మార్పులు
- నిద్రలేమి
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
ఋతుస్రావ సమయంలో హార్మోన్ల స్థాయిలలో మార్పులు ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ యొక్క ముఖ్య కారణంగా పరిగణింపబడుతుంది. అయితే, ఖచ్చితమైన కారణం ఇంకా తెలియలేదు.
ఈ లక్షణాలకు కారణమయ్యే ఇతర కారకాలు కూడా ఉన్నాయి. అవి ఈ విధంగా ఉంటాయి:
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
పిఎంయస్ ను నిర్ధారించడానికి ఎటువంటి నిర్దిష్ట డయాగ్నొస్టిక్ (నిర్దారణ) పరీక్ష లేదు. అయితే, వైద్యులు మహిళలు అనుభవించే లక్షణాల గురించి పూర్తిగా విచారిస్తారు/తెలుసుకుంటారు. సాధారణంగా, వైద్యులు లక్షణాల రీతిని గుర్తించవచ్చు మరియు చాలామంది స్త్రీలలో వారి ఋతుచక్రంలోని నిర్దిష్ట రోజులలో ఈ లక్షణాలను మరింతగా ముదురుతాయి.
పిఎంయస్కు ఎటువంటి నివారణ ఉండదు/లేదు, చాలామంది మహిళలు దీనిని తీవ్రమైన సమస్యగా భావించరు. ఖచ్చితంగా పిఎంయస్ యొక్క లక్షణాలను ఆహార మరియు జీవనశైలి మార్పులు మరియు మందులతో విజయవంతంగా నిర్వహించవచ్చు.
- నొప్పి ఉపశమనం కోసం, వైద్యులు యోగా, వ్యాయామం చేయడం లేదా వేడి నీటి సీసా ఉపయోగించడం వంటివి చేయమని సిఫార్సు చేస్తారు. తీవ్ర నొప్పికి, నొప్పి నివరుణులు సూచించబడతాయి.
- వాపు తగ్గించడానికి, డైయూరేటిక్స్ (diuretics) ను సూచించవచ్చు.
- తీవ్ర ఒత్తిడిని తగ్గించడానికి ఒత్తిడిని తగ్గించే (Anti-stress) మందులు మరియు యాంటీ డిప్రెసెంట్ల (anti-depressant) ను సిఫారసు చేయవచ్చు.
అయితే, ఆహారంలో మార్పులు మరియు ఇంటి చిట్కాల ఉపయోగం వంటివి ఈ లక్షణాలను నిర్వహించడంలో సమర్థవంతమైన ఫలితాలను అందిస్తాయి.