పెమ్ఫిగస్ అంటే ఏమిటి?
పెమ్ఫిగస్ అనేది ఆటోఇమ్యూన్ రుగ్మత, ఇందులో వ్యక్తి యొక్క స్వీయ రోగనిరోధక వ్యవస్థ ఆరోగ్యకరమైన చర్మ కణాల మీద దాడి చేస్తుంది. ఇది చర్మంపై బొబ్బలు కలిగించే అరుదైన వ్యాధులలో ఒకటి. ఇది ప్రమాదకరమైనది. ఇది సాంక్రమిక వ్యాధి కాదు అందుకే, ఒక వ్యక్తి నుండి మరోక వ్యక్తికి ఈ వ్యాధి వ్యాపించదు. ఇది ఏ వయస్సు వారినైనా ప్రభావితం చేయగలదు, అయినప్పటికీ చాలా కేసులు 50 ఏళ్ల వయసు పైబడిన వారిలోనే కనిపిస్తాయి.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
చర్మంపై పెద్ద బొబ్బలు కనిపిస్తాయి. నోరు, ముక్కు మరియు గొంతు వంటి శ్లేష్మ పొరల (mucous lining) లో కూడా బొబ్బలు కనిపించవచ్చు. అవి సులభంగా రేగిపోతాయి మరియు బాధాకరమైన పుళ్ళుగా ఏర్పడతాయి, ముఖ్యంగా అవి నోటిలో ఉన్నట్లయితే, ఏదైనా తినడం లేదా త్రాగదానికి చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. బొబ్బలు స్వరపేటిక వరకు వ్యాపిస్తే, గొంతు బొంగురుగా మరియు బాధాకరంగా మారుతుంది. బొబ్బలు కంటికి కంజుంటివాలో కూడా వృద్ధి చెందుతాయి. చర్మంపై రేగిన/తెరవబడి ఉన్న పుళ్ళు (open sores) చాలా రోజుల వరకు బాధాకరంగా ఉంటాయి మరియు అవి మానే ముందు చర్మంపై గట్టిగా ఉండే పై పొరను ఏర్పరుస్తాయి. చర్మం శాశ్వతంగా రంగు మారిపోతుంది మరియు గాయపు మచ్చలు తరచుగా కనిపించవు.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
పెమ్ఫిగస్ ఒక ఆటోఇమ్మ్యూన్ సమస్య, అయినప్పటికీ, దాని యొక్క ఖచ్చితమైన కారణం ఇంకా తెలియలేదు. ఈ సమస్యలో శరీరం యొక్క సొంత కణాలు బయటి కణాలుగా గుర్తించబడతాయి అందువల్ల రోగనిరోధక వ్యవస్థ వాటి పై దాడి చేస్తుంది. కొన్ని జన్యువులు ఈ పరిస్థితికి యొక్క ప్రమాదంతో ముడిపడి ఉన్నాయి, అయినప్పటికీ, కుటుంబ వారసత్వం (familial inheritance) ఎక్కువగా కనిపించదు.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
చర్మవ్యాధి నిపుణులు చర్మపు బొబ్బలను అసాధారణమైనవిగా కనుగొంటే, వారు చర్మం మరియు నోరు, ముక్కు యొక్క శ్లేష్మ పొరను పరిశీలించి, మరింత విశ్లేషణ కోసం ఒక చిన్న నమూనాను తీయవచ్చు. జీవాణుపరీక్ష (biopsy) తో పాటు, యాంటీబోడీల స్థాయిల తనిఖీ కోసం చేసే రక్త పరీక్ష కూడా నిర్ధారణను దృవీకరించడానికి సహాయపడుతుంది. పెమ్ఫిగస్ చాలా కాలం పాటు ఉండే ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఈ వ్యాధికి ఎటువంటి నివారణ లేదు. లక్షణాల నియంత్రణ మాత్రమే సాధ్యమయ్యే చికిత్స.
చికిత్సలో అధిక మోతాదులలో స్టెరాయిడ్లను ఇవ్వడం జరుగుతుంది. ఇది కొత్త బొబ్బలు ఏర్పడడాన్ని నియంత్రిస్తుంది మరియు నొప్పిని నియంత్రణలో ఉంచుతుంది. స్టెరాయిడ్ మందులను ఒకసారికొకసారి మోతాదును తగ్గిస్తూ ఇవ్వాలి మరియు కొన్ని వారాల పాటు చికిత్స కొనసాగించడం జరుగుతుంది. తరువాత, వ్యాధిని తగ్గించడానికి ఇమ్యూన్ సప్రెషన్ (రోగనిరోధక శక్తిని తగ్గించేవి)మందులను . ఇన్ఫెక్షన్ను నివారించడానికి బొబ్బల యొక్క స్వీయ సంరక్షణ చాలా ముఖ్యం. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు బ్యాండేజ్లను క్రమంగా మార్చుతూ ఉండడం కూడా అవసరం.