గర్భధారణ సమయంలో నొప్పి అంటే ఏమిటి?
గర్భధారణ సమయంలో పెరుగుతున్న బిడ్డకు తగినంత స్థలమును ఏర్పరచేందుకు హార్మోన్ మార్పులతో సహా శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. శరీరం యొక్క నిర్మాణం/ఆకృతిలో కూడా అనేక మార్పులు ఏర్పడతాయి, ఇవి శరీరంలోని వివిధ భాగాలలో నొప్పికి దారితీస్తాయి.
దాని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
గర్భధారణ సమయంలో నొప్పికి సంబంధించిన ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు:
- మలబద్ధకం
- ముక్కు నుండి రక్తం కారడం
- అలసట
- మూత్రవిసర్జనలో సమస్యలు
- భావోద్వేగాలు మరియు భావనలలో మార్పులు
- ఆందోళన
- కాళ్ళలో వాపు
- ఉబ్బరం
- వికారం
- వాంతులు
- చిగుళ్ళ రక్తస్రావం
- భయం
- చెమటలు
- బరువు పెరుగుట
- జ్వరం
- రొమ్ము నొప్పి
- యోని నుండి స్రావాలు
- మతిమరపు
- చలి
- గుండెల్లో మంట
- శ్వాస సమస్యలు - డిసాప్నియా
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
గర్భధారణ సమయంలో నొప్పి యొక్క ప్రధాన కారణాలు:
- ప్రీఎక్లంప్సియా (అధిక రక్తపోటు) తలనొప్పి లేదా పార్శ్వపు తలనొప్పికి కారణమవుతుంది
- గర్భాశయం చుట్టూ ఉన్న కండరాలు మరియు లిగమెంట్లలో కదలిక మొదలవుతాయి, ఇవి పొత్తి కడుపుకి ఒక వైపున లేదా రెండు వైపులా నొప్పిని కలిగిస్తాయి
- గర్భాశయము బరువు పెరగడం వలన అది నొప్పి, జలదరింపు లేదా కాళ్ళలో తిమ్మిరి సంచలనాన్ని కలిగిస్తుంది
- గర్భాశయం బరువు పెరగడం వలన నిలుచునే భంగిమలో మరియు వెన్ను మీద బెణుకు (strain), కలుగుతుంది ఇది వెన్నునొప్పికి దారితీస్తుంది
- ప్లాసెంటల్ అబ్రప్షన్ (Placental abruption), గర్భాశయం నుండి ప్లాసెంటా (మాయ) వీడిపోయే ఒక పరిస్థితి, ఇది ఒక స్థిరమైన/నిరంతరమైన నొప్పిని కలిగిస్తుంది
- పాదములు మరియు కాళ్లలో తిమ్మిరి కలిగే అవకాశం గర్భిణీ స్త్రీలలో ఎక్కువగా ఉంటుంది ఇది కండరాలలో ఆకస్మిక మరియు పదునైన నొప్పిని కలిగిస్తుంది
- మూత్ర మార్గము అంటువ్యాధులు/ఇన్ఫెక్షన్లు నడుము నొప్పి మరియు పొత్తి కడుపు నొప్పిని కలిగిస్తాయి
- కొందరు మహిళలలో, కటి భాగంలో కీళ్ళు (జాయింట్లు) వదులుగా మారిపోతాయి మరియు అది తుంటి మరియు కాళ్ళ నొప్పి కారణమవుతుంది
- ఎక్టోపిక్ గర్భం, అంటే పిండము గర్భాశయం వెలుపల అమర్చబడే ఒక పరిస్థితి, దీనిలో రక్తస్రావంతో కూడిన తీవ్రమైన నొప్పి ఉంటుంది.
- స్పాంటేనియస్ (వాటికవే జరిగిపోయే) గర్భస్రావాలు తీవ్రమైన వెన్నునొప్పికి కారణమవుతాయి
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
గర్భధారణ సమయంలో నొప్పి యొక్క కారణాన్ని నిర్దారించడానికి, వైద్యులు రోగి ఆరోగ్య చరిత్రను గురించి తెలుసుకోవడం ద్వారా ఏదైనా అంతర్లీన పరిస్థితి నొప్పికి కారణమా అన్న విషయాన్నీ అంచనా వేస్తారు. వైద్యులు శారీరక పరీక్షను కూడా నిర్వహిస్తారు మరియు రోగి తెలిపిన లక్షణాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు.
గర్భధారణ సమయంలో నొప్పికి చికిత్స చేయడానికి సాధారణంగా ఈ క్రింది చికిత్సలు ఉపయోగిస్తారు:
- ఓపియాయిడ్ అనాల్జెసిక్స్, నాన్ స్టీరాయిడల్ యాంటీఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (NSAID లు) మరియు నొప్పి నివారిణులు వంటివి నొప్పిని తగ్గించడానికి సూచిస్తారు
- స్థిరమైన నొప్పి నుండి ఉపశమనం అందించడానికి ఫెంటానీల్ పాచెస్ (Fentanyl patches)
- గర్భధారణకు సంభందంలేని కారణాలైన పిత్తాశయ వాపు, ఆంత్రము (appendix) సమస్య, మూత్రపిండాలలో రాళ్ళు, జీర్ణాశయ పుండు/పూతలు వంటి తదితర కారణాలకు శస్త్రచికిత్స అవసరం అవుతుంది.