పెక్కు సందర్భాలలో అండాశయ తిత్తి ఎలాంటి చికిత్స లేకుండా కొన్ని నెలలలో కరిగిపోతుంది.. అట్టి సందర్భాలలో లక్షణాలను గమనించే అవసరం ఉండదు.
థెరపీ లేదా చికిత్స క్రిందివాటిపై ఆధారపడి ఉంటాయి
- తిత్తి పరిమాణం
- అది కల్పించే లక్షణాలు
- మహిళకు రుతుక్రమం నిలిచిపోవడం
కొంతకాలం పాటు తిత్తులను పరిశీలనలో ఉంచడం
కొన్ని సందర్భాలలో డాక్టరు మీకు వెంటనే చికిత్స అవసరం లేదని సిఫార్సు చేసి, వైద్యపరీక్షలు కొనసాగించవచ్చు. అవి అల్ట్రాసౌండ్స్ మరియు తిత్తి నయమవుతున్నదా అని పరీక్ష వంటివి. రుతుక్రమం (మేనోపాస్) ఆగిపోయిన సమయంలో కనీసం ఏడాది పాటు ప్రతి నాలుగు నెలలకు ఒకమారు అల్ట్రాసౌండ్ స్కాన్ జరిపించుకోవాలని సూచించవచ్చు. ఎందుకంటే అట్టి రోగులలో అండాశయం కేన్సర్ ప్రబలే ప్రమాదం పొంచి ఉంటుంది. ఆ పరీక్షలలో తిత్తి లేదని తెలిస్తే తదుపరి చికిత్స అవసరం ఉండదు.
ఔషదాలతో చికిత్స
ఆరోగ్య పరిరక్షణకర్త అండోత్సర్గమును (ఓవులేషన్) నిలపడానికి హార్మొన్లతో కూడిన (గర్భనిరోధక మాత్రలతో కూడినది) ఔషధాలను సూచించవచ్చు. ఈ ప్రక్రియ క్రియాత్మకమైన తిత్తి ఏర్పడటాన్ని నిలుపుతుంది.
శస్త్ర చికిత్స
నొప్పి మరియు మంట లేదా వాపునకు దారితీసే లక్షణాలు కలిగిన పెద్ద పరిమాణం తిత్తులను శస్త్ర చికిత్స్ద ద్వారా తొలగించవలసి ఉంటుంది. ఈ శస్త్రచికిత్స రెందు విభిన్న రకాలలో చేపట్టవచ్చు.
- లాప్రోస్కోపీ
కేన్సరుకు దారితీయనట్టి చిన్న పరిమాణం తిత్తులకు లాప్రోస్కోపిక్ శస్త్ర చికిత్స నిర్వహిస్తారు. ఈ శస్త్రచికిత్స (సర్జరీ) లో డాక్టరు బొడ్దువద్ద చిన్న కోత జరిపి తద్వారా ఒక సాధనాన్ని లోనికి చొప్పించి తిత్తిని వెలుపలకు తీస్తాడు.
- లాపటోరమీ
పెద్ద పరిమాణం కలిగి మరియు కేన్సరుకు దారితీసే తిత్తిని తొలగించదానికి ఉపయోగించే ప్రక్రియను లాపటోరమీ అంటారు. ఈ శస్త్రచికిత్స తిత్తిని తొలగిమ్చి దానిని తదుపరి పరీక్షకు పంపడానికి డాక్టరుకు వీలు కలిగిస్తుంది. తిత్తి కేన్సరుకు దారితీసేదయితే కేన్సర్ నిపుణుడు (ఆంకాలజిస్ట్) తదుపరి చికిత్స నిర్వహిస్తాడు. దాని తీవ్రతను బట్టి అండాశయాన్ని తొలగించవలసి వస్తుంది.
శస్త్రచికిత్స తర్వాత రోగికి పొత్తికడుపులో కొద్దిపాటి అసౌకర్యం, నొప్పి కలుగవచ్చు. అయితే శస్త్రనికిత్స వల్ల ఎదురవుతున్న నిప్పి కొద్దిరోజులలో నయమవుతుంది లాపరొస్కోపీ తర్వాత చికిత్స పొందిన వ్యక్తి రెండువారాలలో, లాపరోటమీ తర్వాత ఎనిమిది వారాలలో సరిపరచుకొంటాడు.
శస్త్ర చికిత్స తర్వాత క్రింది లక్షణాలలో ఏదైనా కనిపిస్తే అవి ఇన్ఫెక్షన్ ను సూచిస్తాయి. దానిని వెంటనే డాక్టరుకు తెలియజేయాలి.
జీవనసరళి/ విధానం
అండాశయ తిత్తుల విషయంలో పరిశీలనకు పెక్కు సహాయక చర్యలు లభిస్తున్నాయి. ఆరోగ్య పరిరక్షణ క్రింద చేపట్టవలసిన మరియు చేయకూడని అంశాల పట్టికలో ఇవి చూపబడినాయి.
- ధూమపానం వదలివేయండి.
పొగసేవించే మహిళలలో అండాశయ తిత్తులు ఏర్పడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అధ్యయనాలు, పరిశీలనలు వెల్లడిస్తున్నాయి.. ఈ కారణంగా ఎట్తి పరిస్థితులలోను హెచ్చు మోతాదులో పొగత్రాగడం మద్యపానం మానికోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
- పరిమితమైన మొతాదులూ కాఫిన్ సేవించడం
కఫిన్ అండాశయ తిత్తి పెరగడానికి వీలు కల్పించవచ్చు. దీనితో కాఫీ వంటి పానీయాలను తగిన మోతాదులో సేవించాలి
- చక్కెర మోతాదు పై అదుపు
ఎక్కువ మోతాదులో చక్కెర సేవించడం మంటకు మరియు వాపునకు దారితీయవచ్చు. రోగి తిత్తితో బాధ పడుతుంటే చక్కెర మరియు రీఫైన్డ్ కార్బోహైడ్రేట్ల వనరులు హెచ్చు నొప్పికి దారితీస్తాయి. దీనితో చక్కెర మోతాదును అదుపు చేయవలసి ఉన్నది. పరిష్కృత ఆహార పదార్థాలను సేవించడం కూడా ఆపివేయాలి.
- ఈస్ట్రోజన్ వాడకాన్ని తగ్గించాలి
సోయా మరియు ఆహార పదార్థాలలో కలిపే వనరులు ఎక్కువ మోతాదులో ఈస్టోజన్ మరియు జెనోఎస్టోజన్ లను కలిగి ఉంటాయి. శరీరంలో ఎక్కువ స్థాయిలో ఈస్ట్రోజన్ నిలువలు హార్మోన్ల సమతౌల్యతపై దెబ్బతీస్తాయి. తత్ఫలితంగా అండాశయ తిత్తులు ఏర్పడవచ్చు
- స్టెరాయిడ్ మందుల వాడకం నిలిపివేయండి
స్టెరాయిడ్ మందులు హర్మోన్ల సమతౌల్యతపై దెబ్బ తీస్తాయి కూడా. దాని కారణంగా అండశయ తిత్తులు ఏర్పడవచ్చు. దీనితో వీటిని వాడట తగదు. నొప్పి నివారణకు సాధారణ నొప్పి నివారణ మాత్రల స్థానే పారాసెటమాల్ ను ఉపయోగించవచ్చు
- సమతుల్య ఆహరం సేవించండి
మీరు ఇప్పటికే అండాశయ తిత్తి వల్ల బాధితులయినట్లయితే ఆరోగ్యకరమైన మరియు సమతుల్యమైన ఆహారాన్ని సేవించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మీరు తీసుకొనే ఆహారంలో పళ్లు, కూరగాయలు, చిరుధాన్యాలు ఉందాలి అవి తిత్తి మళ్లీ రాకుండా చేస్తాయి. ఈ పదార్థలలో పీచుపదార్థం హెచ్చుగా ఉంటుంది. ఈ పీచుపదార్థాలు తిత్తిని నయం చేయడంలో దోహదం చేస్తాయి. అది మళ్లీ రాకుండా కూడా సహకరిస్తాయి.
- క్రమం తప్పకుండా వ్యాయామం
యోగా మరియు శరీరంలోని కండరాలను లాగే వ్యాయామం అండాశయ తిత్తిని వాసి చేయడమే కాకుండా రుతు క్రమం సందర్భంగా ఎదురయ్యే అసౌకర్యాలను కూడా నివారిస్తుంది. అవి ఆ సందర్భంగా ఎదురయ్యే నొప్పిని నివారించడం, కడుపులో, వీపులో తిమ్మిరిని తొలగిస్తుంది. క్రమం తప్పకుండా జరిపే వ్యాయామం మానసిక ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది. శరీరంలో పూర్తిగా రక్తప్రసారాన్ని పెంచుతుంది. పర్యవసానంగా అండాశయ తిత్తులను తగ్గించదంలో సఫలత కల్పిస్తుంది.
- రుతుక్రమం సందర్భంగా సౌకర్యవంతమైన దుస్తులు ధరించండి
మీ పీరియడ్ల సందర్భంగా బిగువైన మరియు అసౌకర్యమైన దుస్తులు పొత్తికడుపుపై ఒత్తిడి కలిగించి నొప్పికి దారితీయిస్తుంది. ఈ కారణంగా వదులైన మరియు సౌకర్యవంతమైన దుస్తులు ధరించడం మంచిది .
- ఎక్కువ మోతాదులో నీరు త్రాగండి
రోజూ 7-8 గ్లాసుల నీరు త్రాగడం శరీరంలోని విష పూరిత పదార్థాలు వెలుపలకు పంపడానికి దోహదం చేస్తుంది అలాగే మంటను కూడా తగ్గిస్తుంది. దీనితో మీరు హెచ్చు స్థాయిలో నీరు త్రాగడం శ్రేయస్కరం
- సరళంగా సడలింపుగా ఉండే ప్రక్రియలను పాటించండి
మానసిక ఒత్తిడి మరియు ఆందోళన చెందే స్వభావం ఆరోగ్యంపై దెబ్బతీస్తాయి. ఎందుకంటే ఇవి హార్మోన్ల స్థాయిపై అసమతౌల్యత కల్పిస్తాయి. ఒత్తిడి కారణంగా కూడా క్రియాత్మక అండాశయ తిత్తి ఏర్పడవచ్చు. ఈ కారణంగా దీర్ఘ శ్వాసక్రియ ధ్యానం, వ్యాయామం, థెరపీ చేయించుకోవడం వంటి సడలించిన ప్రక్రియలను పాటించడం వల్ల శరీరాన్ని మరియు మనసు సమతుల్య స్థితిని పునరుద్ధరిస్తాయి.