ఆర్గానోఫాస్ఫేట్ పాయిజనింగ్ అంటే ఏమిటి?
ఆర్గానోఫాస్ఫేట్ పాయిజనింగ్ అనేది శరీరంలో ఆర్గానోఫాస్ఫేట్ విషతుల్య స్థాయిలలో ఉండడం. అనుకోకుండా లేదా ఉద్దేశపూర్వకంగా ఈ రసాయనాలకు శరీరం బహిర్గతం కావడం వలన ఇది సంభవిస్తుంది. ఆర్గానోఫాస్ఫేట్ అనేది ఒక రసాయనిక సమ్మేళనం (chemical compound) ఇది సాధారణంగా పురుగుమందులు మరియు క్రిమిసంహారకాలలో ఉంటుంది, కీటకాలు, పురుగులు మరియు సూక్ష్మజీవుల నుండి మొక్కలను మరియు పంటలను రక్షించడానికి దీనిని ఉపయోగిస్తారు. ఓరల్ (నోటి ద్వారా), నేసల్ (పీల్చడం ద్వారా), ఇంట్రావీనస్ (ఇంజెక్షన్ ద్వారా), లేదా చర్మం ద్వారా వివిధ మార్గాల గుండా ఈ విషప్రయోగం (పాయిజనింగ్) సంభవించవచ్చు. ఇది భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో సాధారణంగా నమోదు చేయబడే విషప్రయోగం (పాయిజనింగ్).
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
పాయిజనింగ్ సంభవించిన విధానం మరియు శరీరంలో ఉన్న ఆర్గానోఫాస్ఫేట్ స్థాయి మీద ఆధారపడి, ఆర్గానోఫాస్ఫేట్ పాయిజనింగ్ యొక్క సంకేతాలు మరియు లక్షణాలను పరిస్థితి యొక్క తీవ్రతను బట్టి వర్గీకరించవచ్చు:
- తేలికపాటి విషప్రయోగం యొక్క లక్షణాలు
- తలనొప్పి
- బలహీనత
- వికారం మరియు వాంతులు
- దగ్గు
- ముక్కు కారడం
- రక్తపోటు తగ్గిపోవడం
- హృదయ స్పందన రేటు తగ్గిపోవడం
- మధ్యస్థ పాయిజనింగ్ యొక్క లక్షణాలు
- శ్వాస తీసుకోవడంలో కష్టం
- గందరగోళం
- కడుపు నొప్పి
- పాలిపోయినట్టు కనిపించడం
- కండరాల సంకోచాలు
- తీవ్రమైన పాయిజనింగ్ యొక్క లక్షణాలు
- స్పృహ కోల్పోవడం
- మూర్ఛలు
- పక్షవాతం
- మూత్రవిసర్జన మరియు మలవిసర్జన పై నియంత్రణ కోల్పోవడం
ఆర్గానోఫాస్ఫేట్కు గురైన/బహిర్గతమైన తరువాత 30 నిమిషాల నుండి 3 గంటలలోపు లక్షణాలు సంభవిస్తాయి.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
ఆర్గానోఫాస్ఫేట్కు గురికావడం వలన అది శరీరంలోని కొన్ని ఎంజైమ్లను నిరోధిస్తుంది మరియు తేలికపాటి, మధ్యస్థ లేదా తీవ్రమైన లక్షణాలకు దారితీస్తుంది. స్వీయ హాని లేదా ప్రమాదవశాత్తూ ఆర్గానోఫాస్ఫేట్కు గురికావడం వలన పాయిజనింగ్ సంభవించవచ్చు. పురుగుమందులు లేదా క్రిమిసంహారకాలతో పని చేసేవారిలో లేదా ఆర్గానోఫాస్ఫేట్తో కలుషితమైన ఆహారము లేదా నీటి వినియోగం వలన ప్రమాదవశాత్తు ఆర్గానోఫాస్ఫేట్ పాయిజనింగ్ సంభవించవచ్చు.
ఆర్గానోఫాస్ఫేట్లు యాంటీ-కోలినెస్టరేసెస్ (anti-cholinesterases), అంటే, అవి ఎంజైమ్ కోలినెస్టేరేజ్ యొక్క చర్యను ఆపివేస్తాయి. ఈ ఎంజైమ్ న్యూరోకెమికల్ అసిటైల్కోలిన్ (neurochemical acetylcholine) ను విచ్ఛిన్నం (breaks) చేస్తుంది. ఎంజైమ్ యొక్క విచ్ఛిన్న (breakdown) చర్యను ఆపివేయడం ద్వారా, ఆర్గానోఫాస్ఫేట్లు ఈ క్రింది వాటికి దారితీస్తాయి:
- ప్రాణానికి హానికలిగించే తీవ్రమైన కొలినెర్జిక్ సంక్షోభం (cholinergic crisis).
- క్రేనియల్ నరములు (cranial nerves), శ్వాసకోశ కండరాలు మరియు ఇతర అస్థిపంజర (స్కెలిటల్) కండరముల పక్షవాతం కలిగించే ఒక ఇంటర్మీడియారీ సిండ్రోమ్ (intermediary syndrome).
- ఆలస్య నరాల హాని/నష్టం.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
ఆసుపత్రిలో చేర్చిన వ్యక్తి యొక్క లక్షణాల ఆధారంగా మరియు దగ్గరి బంధువులు లేదా ప్రత్యేక్ష సాక్షుల నుండి విషానికి బహిర్గతం కావడం గురించిన చరిత్రను తీసుకుని ఆర్గానోఫాస్ఫేట్ పాయిజనింగ్ను నిర్ధారిస్తారు. ఆర్గానోఫాస్ఫేట్లచే నిరోధించబడిన శరీర ఎంజైమ్ల స్థాయిలను గుర్తించడానికి వైద్యులు రక్త పరీక్షను నిర్వహిస్తారు.
ప్రాధమిక చికిత్సలో వ్యక్తి కడుపులోకి తీసుకున్న ఆర్గానోఫాస్ఫేట్లను శరీరం నుండి తొలగించడానికి గ్యాస్ట్రిక్ లావెజ్(కడుపును శుభ్రం చేయడం)ను చేస్తారు. వ్యక్తి యొక్క దుస్తుల మీద కూడా ఆర్గానోఫాస్ఫేట్లు ఒలిగినట్లైతే, కలుషితమైన బట్టలను తొలగించి, నీరు మరియు సబ్బుతో శుభ్రంచేస్తారు. శ్వాస తీసుకోవడంలో కష్టాన్ని తగ్గించడానికి, కృత్రిమ ఆక్సిజన్ అందించబడుతుంది మరియు ఇతర లక్షణాల చికిత్సకు మరియు అవి మరింత తీవ్రతరం కాకుండా చూసేందుకు తగిన మందులు సూచించబడతాయి . పాయిజన్ను నోటితో తీసుకున్నట్లయితే, అది కడుపులోకి శోషించబడకముందే ముందే పాయిజన్ని కడుపు నుండి తొలగించడానికి కడుపును శుభ్రపరచాలి (వాష్) .