సారాంశం
ఓరల్ క్యాన్సర్ లేక నోటి క్యాన్సర్ అనునది ఎటువంటి వయసు ఉన్నా మరియు ఏ విధమైన మనిషినైనా ప్రభావితం చేసే ఒక ప్రాంణాతక (క్యాన్సర్) స్థితి గా ప్రముఖముగా తెలుపబడింది. పరిశోధనలు తెలిపినదేమనగా, క్యాన్సర్ సంఘటనలు ఎక్కువగా (29-50 సంవత్సరముల) వారిని ప్రభావితం చేస్తాయి, దీని ఫలితముగా అకాల మరణాలు సంభవిస్తాయి. అత్యధిక పొగాకు వినియోగమువలన, భారతదేశమును ప్రధానముగా ప్రభావితము చేసే మూడు క్యాన్సర్ లలో ఓరల్ క్యాన్సర్ అనునది ముఖ్యమైనదని ప్రపంచవ్యాప్త ఓరల్ క్యాన్సర్ గణాంకము సూచించింది. ఏమైననూ, వైధ్య శాస్త్ర అభివృద్ధితో, నోటి క్యాన్సర్ ప్రారంభ దశలలోనే కనుగొనబడినప్పుడు, దానిని సమర్థవంతముగా నయం చేయవచ్చు. ఓరల్ క్యాన్సర్ చికిత్స అనునది ఔషధ లక్ష్య చికిత్స, రేడియోధార్మిక చికిత్స, కోమోథెరపీ మరియు నోటి కుహరము యొక్క సహ శస్త్రచికిత్స అను చికిత్సలను కలిగిఉన్నది. నోటి క్యా న్సర్ గురించి ప్రతీ విషయము తెలుసుకోవడానికి దీనిని చదవండి.