ఊబకాయం - Obesity in Telugu

Dr. Anurag Shahi (AIIMS)MBBS,MD

February 05, 2019

March 06, 2020

ఊబకాయం
ఊబకాయం

సారాంశం

స్థూలకాయం(ఊబకాయం) అనునది  ప్రపంచ వ్యాప్తముగా నిర్లక్ష్యము చేయబడిన మరియు తక్కువ అంచనా కలిగిన వైద్య పరిస్థితి. ఇది శరీరములో అధిక క్రొవ్వు చేరడం ద్వారా వర్గీకరించబడింది మరియు ఇది సాధారణముగా పెద్దలు మరియు పిల్లలలో కనుగొనబడింది.  ఊబకాయ జనాభాలో యుఎస్ మరియు చైనా తరువాత ఇండియా అనునది మూడవ అధిక ర్యాంకు కలిగినదిగా భావించబడుతుంది.  ఊబకాయం సంబంధ ప్రమాదకర కారకాలు అనగా హృదయ సంబంధ వ్యాధుల వలన ఊబకాయం అనునది ఒక గొప్ప ప్రజా ఆరోగ్య ప్రాముఖ్యతను తెచ్చింది హృదయ సంబంధ వ్యాధులు అనగా, మధుమేహంహైపర్టెన్షన్ (అధికరక్తపోటు), ఆస్టియోఆర్థరైటిస్ మరియు మూత్ర పిండాల వ్యాధులు మంచి శుభవార్త ఏమిటంటే, ఊబకాయం అనునది నివారించగల పరిస్థితి మరియు దానిని సమర్థవంతముగా త్రిప్పి కొట్టవచ్చు. జీవనశైలిలో మార్పులు, ఆహారములో మార్పులు, భౌతిక కార్యక్రమాలు, మరియు శస్త్రచికిత్సలు అనునవి దీర్ఘకాలం ఊబకాయం నుండి బాధపడే రోగులను సరిదిద్దడానికి వీటిని అమలుచేస్తారు.

ఊబకాయం అంటే ఏమిటి? - What is Obesity in Telugu

లావుపాటి (ఊబకాయం) అంటే ఏమిటి?

లావుపాటి: ఈ పరిస్థితి గురించి మనము విన్న వెంటనే మన మనస్సులోనికి వచ్చే మొదటి విషయం ఒక “లావుపాటి వ్యక్తి”, రెండు గడ్డాలతో, కేలరీలతో నిండి ఉండడం, బహుశా కొన్ని భౌతికమైన కార్యక్రమాలను చేసే సామర్థ్యము కలిగిఉండక పోవడం. ఇవి మనకు వెంటనే వచ్చే ఆలోచనాలా?  అవును, లావు అనగా అధికబరువు కలిగి ఉండడం, అయితే మనం అందరూ అవగాహన చేసుకోవాల్సిన విషయం ఇది ఒక వైద్య పరిస్థితి, ఇది శరీరము యొక్క వివిధ భాగాలలో అసాధారణమైన శరీర క్రొవ్వు చేరి ఉండడం, దీని ఫలితముగా అదనపు శరీర బరువు ఏర్పడుతుంది, ఇది మొత్తం ఆరోగ్యము పైన చాలా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది.

ఒక వ్యక్తి అధిక బరువు లేక లావు కలిగియున్నాడని ఏ విధముగా నిర్ధారిస్తారు? దీనికి సమాధానం బాడీ మాస్ ఇండెక్స్ (BMI). బిఎమ్ఐ అనునది మీ యొక్క ఎత్తు మరియు బరువు నుండి ఉత్పన్నం చేయబడిన ఒక గణాంక ప్రమాణము.  బిఎమ్ఐ ప్రమాణము అనునది ఒక వ్యక్తి యొక్క ఊబకాయమును లెక్కించడం కొరకు ఒక ఉపయోగకరమైన సూచిక.   ఒక వ్యక్తి ఊబకాయమును కలిగియున్నాడని ఏ విధముగా సూచిస్తారంటే, ఆ వ్యక్తి యొక్క శరీర బరువు ఉండవలసిన దానికంటే 20% శాతం అధికముగా ఉన్నచో, అప్పుడు అతడు లేక ఆమె ఊబకాయం కలిగిన వ్యక్తిగా పరిగణించబడతాడు.  మీ యొక్క బిఎమ్ఐ ఒకవేళ 25 మరియు 29.9 మధ్య ఉంటే మీరు అధికబరువు గల వ్యక్తిగా పరిగణింపబడతారు.  ఒకవేళ మీ యొక్క బిఎమ్ఐ 30 లేక అంతకు మించి ఉంటే మీరు ఊబకాయం కలిగిఉంటారు.

ఒకవేళ మీ యొక్క బిఎమ్ఐ 25 కంటే ఎక్కువగా ఉంటే, అప్పుడు మీరు బరువు తగ్గే కార్యక్రమాలు చేయాలి మరియు ఒకవేళ మీ యొక్క బిఎమ్ఐ 30 కంటే ఎక్కువగా ఉంటే, అప్పుడు మీరు  బరువు తగ్గడము కొరకు డాక్టరు నుండి సీరియస్ గా సలహాలను తీసుకోవాలి.   ఇది ప్రాముఖ్యమైనది ఎందుకనగా ఊబకాయం అనునది అనేక వైద్య పరిస్థితులు అనగా మధుమేహం, హృదయ ధమని వ్యాధి, హైపర్ టెన్షన్, ప్రతిబంధక నిద్ర రుగ్మతలు, కీళ్ల ఎముకల నొప్పులు మొ. వంటి అనేక వైద్య పరిస్థితులు ఏర్పడటానికి లేక పెరగడానికి సాధ్యపడుతుంది. ఈ పరిస్థితితో వ్యవహరించవలసిన మొదటి అడుగు ఏమనగా మీ యొక్క ఊబకాయానికి మూలకారణం కనుగొనడం.  ఒక వ్యక్తి తన యొక్క రోజువారీ జీవనశైలిని పరిశీలించడం ద్వారా దీనిని చేయాలి లేక మీ డాక్టరును సంప్రదించాలి లేక ఒక న్యూట్రిషనిస్టును సంప్రదించాలి.

మీకు తెలుసా?

మీ నడుము యొక్క చుట్టుకొలత అనునది మీ ఆరోగ్యమును నిర్ధారించడానికి ఒక ముఖ్యమైన కారకము.  మీ ఆరోగ్యం ప్రమాదములో ఉంటుంది, ఒకవేళ: మీరు ఒక  పురుషుడు మరియు మీ యొక్క నడుము చుట్టుకొలత ప్రమాణము అనునది 94 సెంటిమీటర్లు (37ఇంచులు) లేక అంతకంటే ఎక్కువగా ఉంటే మరియు మీరు ఒక స్త్రీ మరియు మీ యొక్క నడుము చుట్టుకొలత ప్రమాణము అనునది 80 సెంటిమీటర్లు (31.5 ఇంచులు) లేక అంతకంటే ఎక్కువగా ఉంటే మీ ఆరోగ్యం ప్రమాదములో ఉంటుంది.

ఊబకాయం గల వారుగా మీరు చాలా అసౌకర్యానికి గురవుతారు మరియు మీ రోజువారీ జీవితాలలో అవాంతరాలను తెచ్చుకుంటారు.  మీకు ఊపిరి తీసుకోవడం కష్టముగా ఉంటుంది మరియు నడవడం కూడా మీకు ఒక్కోసారి కష్టముగా ఉంటుంది లేక బౌతికముగా యాక్టివ్ గా ఉండడం కూడా  కష్టముగా ఉంటుంది.  మీ శరీర రకానికి సరిపోయే సౌకర్యవంతమైన దుస్తులు కనుగొనడం కష్టముగా ఉంటుంది.  ఊబకాయం గలవారు కనీసం కొంచెం పని చేసిన తరువాత ఎక్కువగా చెమటను కలిగిఉంటారు.  అదనముగా, ఒకవేళ మీరు ఊబకాయిలైతే, మీ యొక్క భావోద్వేగాల పైన కూడా ప్రభావితం చేస్తుంది.  మీ యొక్క ఆత్మగౌరవం మరియు నమ్మకం తక్కువగా ఉంటుంది.  మరియు కొంతమంది ఊబకాయమును నెగటివ్ గా చూపిస్తున్నారు కాబట్టి మీరు తిరస్కారము, తప్పు, సిగ్గు పడడము మరియు దిగజారిపోవడం వంటి అనేక వాటిని అనుభవిస్తారు.  అన్ని సామాజిక నిందలను అధిగమించే క్రమములో, దీని యొక్క కారణాల గురించి మనము తెలుసుకోవాలి మరియు తరువాతి సెక్షన్ లో నివారణము చేపట్టాలి, అందువలన మీరు మీ యొక్క పరిస్థితి నుండి బయటకు వస్తారు మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవిస్తారు.

Weight Loss Juice
₹539  ₹599  10% OFF
BUY NOW

ఊబకాయం యొక్క లక్షణాలు - Symptoms of Obesity in Telugu

ఊబకాయం యొక్క అత్యంత సాధారణ లక్షణాలు:

  • విపరీతముగా అధిక బరువు పెరుగుట.
  • నియంత్రించలేని అధిక రక్తపోటు మరియు అధిక బరువు వలన  ఒత్తిడి.  
  • రోజువారీ కార్యక్రమాలు చేయడం ద్వారా శ్వాస సంబంధ సమస్యలు ఎదుర్కొనుట.  
  • అదనపు శరీర బరువు వలన కీళ్ల నొప్పులు.
  • అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు.
  • అనియంత్రిత ఆకలి దు:ఖాలు
  • అతి బద్ధకం 

మీరు ఎప్పుడు డాక్టర్ ను కలువవచ్చు

ఊబకాయం అనునది ఎప్పుడూ వైద్య అత్యవసరమైనది కాదు. అయితే కొన్ని కారకాలు మరియు లక్షణాల పైన ఆధారపడి, మీరు ఎప్పుడు డాక్టరును కలవాలో కాల్ చేయడం ద్వారా ఎంపికచేసుకోవచ్చు.  అధిక భాగం ప్రజలు వారి యొక్క మానసిక మరియు సమాజిక కారణాల వల్ల డాక్టరు దగ్గరకు వెళ్ళడాన్ని నిర్లక్ష్యము చేస్తారు మరియు వెళ్లడాన్ని మానివేస్తారు అని పరిశోధకులు నిర్ధారించారు.  ఈ విధముగా చేయడం ద్వారా, వ్యాధి మరింతగా వ్యాపించడానికి వారు సహాయం చేస్తున్నారని తరువాత పరిశీలించబడింది.

మీరు ఒకవేళ మీ శరీర బరువు వల్ల మీ భౌతిక కార్యక్రమాలను చేసుకోవడములో అనగా మెట్లు ఎక్కడం, నడవడం, పరుగెత్తడం,  మీ రోజువారీ పనులను చేయడములో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే  మీరు ఖచ్చితముగా మీ ఆరోగ్య శిక్షకునితో సాధ్యమైనంత త్వరగా మాట్లాడాలి.  ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహించే సామర్థ్యము లేకపోవడం వెంటనే చర్యలను తీసుకునేలా సూచిస్తుంది.

ఒకవేళ మీరు క్రింద ఇవ్వబడిన లక్షణాలు కలిగియుంటే వెంటనే డాక్టరు యొక్క సలహాను తీసుకోవాలి.

  • అధిక రక్తపోటు మరియు శ్వాస సంబంధ రుగ్మతలు
  • ఆహార కోరికలను తగ్గించే నిద్ర
  • గుండెల్లో నొప్పి లేక గుండె దడ
  • పెరిగిన రక్త చక్కెర స్థాయి లేక మధుమేహం 
  • కృంగుబాటు మరియు అధిక స్థాయి  ఒత్తిడి
  • గ్యాట్రో, కాలేయం మరియు పిత్తాశయ సమస్యలు
  • అధిక కొలెస్ట్రాల్
  • మోకాళ్లు మరియు నడుము క్రింద నొప్పి
  • ఒక నిరర్థక స్వభావం మరియు దూరముగా ఉండే ఒక ధోరణి.

ఊబకాయం యొక్క చికిత్స - Treatment of Obesity in Telugu

ఊబకాయం కొరకు ఎప్పుడు చికిత్స అవసరమవుతుంది?

ఆహారములో మార్పులను చేసుకోవాలి మరియు భౌతికముగా  ఎక్కువ యాక్టివ్ గా ఉండడము కూడా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.  అయితే, కొన్ని పరిస్థితులలో, మీ డాక్టరు కొన్ని మందులు సూచిస్తారు లేక బరువు తగ్గే శస్త్ర చికిత్సలు సూచిస్తారు.  ఒంటరిగా వ్యాయామం చేయడం మరియు ఆహారములో మార్పులు గుండా శరీరములో బరువును తగ్గించలేనప్పుడు, ఇది ప్రత్యేకముగా అవసరమవుతుంది.  మీ యొక్క రోజువారీ క్రియలపై ప్రత్యక్షముగా ప్రభావితం చూపిస్తుంది.  

మెడికల్ చికిత్సలు:

డాక్టర్ల ద్వారా సూచించబడిన వివిధ రకాల సిఫార్సు చేయబడిన డ్రగ్స్ మరియు మందులు మనము కలిగియున్నాము, వీటిని క్రింద ఇవ్వబడిన ఆహార నియమాలు మరియు వ్యాయామాలతో పాటు వైద్య పర్యవేక్షణలో తీసుకోవాలి.  అవి ఈ క్రింది విధముగా ఉంటాయి:

  • పిల్లలు మరియు ఊబకాయ కౌమార దశలో, ఇన్సులిన్ మరియు హైపర్ఇన్సులినేమియా సందర్భాలలో మెట్ఫార్మిన్ ను ఉపయోగిస్తారు.
  • హైపోథాలమిక్ ఊబకాయం కొరకు ఆక్టిరియోటైడ్ ను ఉపయోగిస్తారు.
  • మీ ఆహారములో ఉన్న క్రొవ్వునంతటినీ మీ శరీరం గ్రహించకుండా ఓర్లిస్టాట్ అడ్డుకుంటుంది.  బిఎమ్ఐ 30 లేక అంతకంటే ఎక్కువ ఉన్న వ్యక్తుల కొరకు దీనిని రికమెండ్ చేస్తారు వీరి యొక్క జీవనశైలి మరియు ప్రవర్తనా మార్పులు సమర్థవంతమైనవి కావు.

అయితే, ఈ మందులన్నింటినీ రిజిస్టర్డ్ ప్రాక్టీషనర్ ద్వారా సూచించబడినప్పుడు మాత్రమే వీటిని తీసుకోవాలి, ఎందుకనగా అవి వాటి యొక్క స్వీయ దుష్ప్రభావాలను కలిగిఉంటాయి. గర్భవతులైన స్త్రీలు, పిల్లలు, మరియు ముసలి వ్యక్తులు ఏ విధమైన దోసును తీసుకొనేకంటే ముందుగా డాక్టరును సంప్రదించాలి.

సర్జికల్ చికిత్స

ఒక వ్యక్తి బరువు కోలోవడానికి సంబంధించి తగిన మార్గాలన్నింటినీ అనుసరించి విఫలమయిన తరువాత మరియు ఇవి సర్జరీ మరియు సాధారణ అనస్థీషియా కొరకు  సరిపోయినప్పుడు మాత్రమే సర్జికల్ పరిస్థితులు రికమెండ్ చేయబడతాయి.  సాధారణముగా సిఫార్సు ఎంపికలు అనునవి బిఎమ్ ఐ యొక్క స్కోరు 50 కంటే ఎక్కువైనప్పుడు సర్జరీ సిఫార్స్ చేయబడుతుంది.  దీనికి సంబంధించిన మెడికల్ పదము బారియాట్రిక్ శస్త్ర చికిత్స. రెండు సాధారణ రకాల శస్త్ర చికిత్సలు గ్యాస్ట్రిక్ బ్యాండింగ్ (నాడకట్టు) మరియు గ్యాస్ట్రిక్ బైపాస్. అవి కడుపు యొక్క పరిమాణమును తగ్గించడములో పాల్గొంటాయి, కావున మీరు తక్కువ తిన్నను, లేక మీ ఆంత్రము యొక్క బైపాసింగ్ భాగము తక్కువ ఆహారమును గ్రహించుకుంటుంది.  మీరు ఒక దీర్ఘకాల చికిత్స తీసుకోవాల్సిన అవసరముంటుంది మరియు బారియాట్రిక్ సర్జరీ తరువాత అనుసరణ కార్యక్రమం చేయాలి. 

జీవనశైలి సవరణలు

మందులు తీసుకున్నంత మాత్రము చేత లేక సర్జరీ చేయించుకోవడము మాత్రము చేతనే సామర్థముగా పని చేయలేము, వాటితో పాటు మీ యొక్క జీవనశైలిలో మార్పులు చేసుకోవడము కూడా సమర్థవంతముగా పనిచేస్తాయి.  సర్జరీ తరువాత కూడా, చివరకు కొన్ని సంవత్సరాల తరువాత మీ యొక్క జీవనశైలి మంచిగా ఉండకపోతే మీరు తిరిగి బరువు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.  క్రింద ఇవ్వబడిన వాటిని అనుసరించడము వలన ఒక వ్యక్తి ఉన్నతముగా తనను తాను నిర్వహించుకోగలడు మరియు నిలబడగలడు.  

  • ప్రతీరోజూ నిరంతర భౌతిక కార్యకలాపాలలో పాల్గొనడం.
  • సరియైన పరిమాణములో మరియు సరియైన ఆహారమును తినడం.  
  • సరియైన నిద్రను తీసుకోవడం (కనీసం 6-8 గంటలు). 
  • అధిక చక్కెర కలిగిన పధార్థాలను దూరముగా ఉంచడం (బేకరీ పదార్థాలు, చాకొలేట్స్, స్వీట్లు)
  • ప్రాసెసింగ్ ఫుడ్స్ మరియు జంక్ పుడ్ ను దూరముగా ఉంచడం.
  • ఆల్కహాలును తక్కువగా తీసుకోవడం 
  • బరువుకు సంబంధించి క్రమముగా చెక్ చేయించుకోవడం.
  • సంవత్సరానికి ఒకసారి పూర్తి శరీరమును చెక్ చేయించుకోవాలి.  
  • ప్రతీ ఆరు నెలలకొకసారి క్రమముగా రక్త పరీక్షలు చేయించుకోవాలి.  
  •  ఫైబర్లు, పండ్లు, శాకాహారము, తక్కువ ప్రొటీన్లు, బహుధాన్యాలు కార్బోహైడ్రేట్లు, వారి ఆహారములో పాలు ఉండేలా చూసుకోవడం మొదలగునవి కలిగిఉండాలి.
  • ఫిజిషియన్ల ద్వారా సూచించబడిన మందులను తీసుకోవాలి.  నిర్ధిష్టమైన ఆరోగ్య పరిస్థితులు అనగా థైరాయిడ్ సమస్యలకు, ప్రతీరోజూ మందులు అవసరమవుతాయి, వీటిని తీసుకోకపోతే బరువు మరలా పెరుగుతుంది మరియు ఇతర ప్రాణహాని పరిస్థితులు ఏర్పడతాయి.
Amla Juice
₹269  ₹299  10% OFF
BUY NOW


వనరులు

  1. National Heart, Lung, and Blood Institute [Internet]: U.S. Department of Health and Human Services; Overweight and Obesity
  2. World Health Organization [Internet]. Geneva (SUI): World Health Organization; Obesity.
  3. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Overweight & Obesity
  4. National Health Service [Internet]. UK; Obesity.
  5. National Health Information Center, Washington, DC [Internet] U.S. Department of Health and Human Services; Obesity Prevention

ఊబకాయం వైద్యులు

Dr. Narayanan N K Dr. Narayanan N K Endocrinology
16 Years of Experience
Dr. Tanmay Bharani Dr. Tanmay Bharani Endocrinology
15 Years of Experience
Dr. Sunil Kumar Mishra Dr. Sunil Kumar Mishra Endocrinology
23 Years of Experience
Dr. Parjeet Kaur Dr. Parjeet Kaur Endocrinology
19 Years of Experience
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

ఊబకాయం కొరకు మందులు

Medicines listed below are available for ఊబకాయం. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.