శిశువుల్లో చిన్నపేగు వాపు అంటే ఏమిటి?
కణాల్ని చంపేసే చిన్నపేగువ్యాధి (నెక్రోటైజింగ్ ఎంటెరోకోలిటీస్) నవజాత శిశువుల్లో పేగుల్లో సంభవించే ఓ తీవ్రమైన వ్యాధి. ఈ జబ్బు సాధారణంగా 1.5 కిలోల కంటే తక్కువ బరువు ఉన్న అపరిపక్వ (premature) శిశువులలో కనిపిస్తుంది. ఈ వ్యాధిలో, ఒక రకమైన బ్యాక్టీరియా సంక్రమణ ప్రేగుల్లో చిల్లులు పడటానికి దారి తీసే పేగు గోడలల్లో వాపును కలుగజేస్తుంది. చిల్లులు పడిన ప్రేగుల నుండి మలం కారి కుహరంలోకి చేరుతుంది, ఇది తీవ్రమైన సంక్రమణకు కారణమవుతుంది.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ప్రతి శిశువులోనూ వ్యాధి లక్షణాలు మారుతూ ఉంటాయి మరియు ఈ లక్షణాలు శిశువు పుట్టిన మొదటి రెండు వారాలలో గుర్తించబడతాయి. ఈ వ్యాధికి సంబంధించి కింది సంకేతాలు మరియు లక్షణాలను సాధారణంగా గమనించవచ్చు:
- ఉదరం యొక్క ఉబ్బరం మరియు వాపు
- మలంలో రక్తం
- తగ్గిన హృదయ స్పందన రేటు (మరింత చదవండి: బ్రాడికార్డియా కారణాలు మరియు చికిత్స)
- అతిసారం
- రక్తపోటు తగ్గిపోవడం
- తాత్కాలిక శ్వాస విరమణ
- బద్ధకం
- ఎరుపుదేలిన మరియు సున్నితత్వంతో కూడిన లేత కడుపు ప్రాంతం
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
ఈవ్యాధికి ఖచ్చితమైన కారణాన్ని ఇంకా కనుక్కోలేదు. తక్కువ-ఆక్సిజన్ సరఫరా మరియు రక్త ప్రసరణ కారణంగా బలహీనమైన ప్రేగు గోడల వలన నెక్రోటైసింగ్ ఎంటెరోకోలిటీస్ వ్యాధి ప్రమాదం నవజాత శిశువుల్లో పెరుగుతుంది మరియు ఈవ్యాధిపరిస్థితికి బహుశా ఇదే కారణమై ఉండవచ్చు. ఆహారం నుండి బ్యాక్టీరియా పేగు యొక్క బలహీన గోడలపై దాడి చేయవచ్చు, తద్వారా ప్రేగువాపు మరియు పేగుల్లో చిల్లులు ఏర్పడడానికి దారి తీస్తుంది.
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
కింది పరీక్షలు నెక్రోటైజింగ్ ఎంటెరోకోలిటిస్ వ్యాధి నిర్ధారణ కొరకు జరుగుతాయి:
- ఎక్స్- రే: ఎక్స్-రే ఉదరం లో గల బుడగల ఉనికిని చూపుతుంది.
- ఇతర రేడియోగ్రాఫిక్ పద్దతులు: ఈ పరీక్షలు కాలేయము లేదా ప్రేగు బయట ఉదర కుహరంలోకి రక్తం సరఫరా చేసే రక్త నాళాల్లోని గాలి బుడగల ఉనికిని సూచిస్తాయి.
- సూది చొప్పించడం: ఉదర కుహరంలోనికి చొప్పించిన సూది ప్రేగులోని ద్రవాన్ని వెలికి తీసివేయగలిగినట్లైతే ఇది ప్రేగుల్లో రంధ్రాలు పడటాన్ని సూచిస్తుంది.
కణాల్ని చంపేసే చిన్నపేగు వాపు వ్యాధి యొక్క చికిత్సా విధానం వ్యాధికల్గిన ఆ శిశువు యొక్క పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. ఈ కింది పద్ధతులను నెక్రోటైసింగ్ ఎంటెరోకోలిటీస్ చికిత్సలో ఉపయోగిస్తారు:
- నోటిద్వారా ఆహార సేవనాన్ని ఆపడం
- “ఓరోగాస్ట్రిక్ (Orogastric) ట్యూబ్” అనే ట్యూబ్ ఉపయోగించి కడుపు మరియు ప్రేగు నుండి ద్రవం మరియు గాలి బుడగలు తొలగించడం.
- ఇంట్రావీనస్ ద్రవాల (అడ్మినిస్ట్రేషన్) నిర్వహణ
- యాంటీబయాటిక్స్ నిర్వహణ
- శిశువు యొక్క పరిస్థితిని తనిఖీ చేయడానికి ఎక్స్-రే ఉపయోగించి చేసే సాధారణ పరీక్ష
- పొత్తికడుపు వాపు విషయంలో శ్వాస తీసుకోవడానికి బాహ్య ఆక్సిజన్ మద్దతు