సారాంశం
మెడనొప్పి గురించి చెప్పేవారిలో ప్రతి ముగ్గురిలోనూ ఒకరిలో అది సాధారణ ఆరోగ్య సమస్యగా ఉంది. ఇందుకు కారణం మెడ కండరాలలో శ్రమ కలగడం అంతటి సులువైనది కావచ్చు, లేదా వెన్నెముక యొక్క నరాలు సంపీడనం కావడం లాంటి తీవ్రమైనది కావచ్చు. వెన్నుపూస (వెన్నెముక యొక్క ఎముకలు) యొక్క వ్యాధులు, ఆర్థరైటిస్, సెర్వికల్ స్పాండిలోసిస్, మరియు ఇతర స్థితులు కూడా మెడనొప్పికి దారితీయవచ్చు మరియు తక్షణ వైద్య సహాయం అవసరం కావచ్చు. మెడనొప్పిని వృద్ధి చేసుకునే ప్రమాదావకాశము ఎక్కువగా ఉండే వ్యక్తులలో మహిళలు, ప్రత్యేకించి ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు మరియు ఆరోగ్యము బాగా లేని వ్యక్తులు ఉంటారు. మెడ బెణుకు (సాధారణంగా ఒక ఆక్సిడెంటు సందర్భంగా ఏర్పడుతుంది) వల్ల కలిగే మెడనొప్పి అనేక సంవత్సరాల పాటు లక్షణాలను చూపవచ్చు. మెడనొప్పికి చికిత్స చాలా వ్యత్యాసముగా ఉంటుంది మరియు దాగియున్న కారణాలపై ఆధారపడి ఉంటుంది. అనేక సమయాల్లో మెడనొప్పి ఒక వారం లోపున నయమైపోతుంది. చాలా అరుదుగా, అది ఏళ్ళపాటు ఉంటుంది. వ్యాయామము, మందులు తీసుకోవడం, మరియు భంగిమ సరిచేసుకోవడం అనేవి, మెడనొప్పి యొక్క యాజమాన్యం కొరకు వినియోగించుకోబడే వ్యూహాలుగా ఉంటాయి. శస్త్రచికిత్స అనేది చికిత్స యొక్క మొదటి ఐచ్ఛికం కాదు. అన్ని ఐచ్ఛికాలూ అయిపోయేవరకూ దీన్ని నివారించాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక మెడనొప్పి కొరకు, వ్యాయామాలు, కండర ధృఢత్వ శిక్షణ, మందుల వాడకం మరియు జీవనశైలి మార్పులతోకూడిన ఒక బహుళ-మార్గాల పద్ధతిని అవలంబించవలసి ఉంటుంది.