వికారం మరియు వాంతులు అంటే ఏమిటి?
వికారం మరియు వాంతులు సాధారణంగా ప్రేగు సంభందిత వ్యాధుల యొక్క లక్షణాలతో ముడిపడి ఉంటాయి, కొన్ని బాధాకరమైన/నొప్పితో కూడిన సమస్యలు మరియు కొన్ని మందుల యొక్క దుష్ప్రభావాల కారణంగా కూడా కలుగుతాయి. అనేక సార్లు, ఈ లక్షణాలు సాధారణ (జనరల్) అనస్తీషియా యొక్క తరువాత ప్రభావంగా కనిపిస్తాయి. వాంతులు అంటే నోటి ద్వారా కడుపులోని పదార్దాలను ఖాళీ చేయటం మరియు వికారం అంటే వాంతికి ముందు ఎదుర్కునే అసౌకర్య భావన. ఈ రెండు పరిస్థితులకు చికిత్స చేయవచ్చు, మరియు సాధారణంగా, అవి ఏ విధమైన తీవ్ర ఆరోగ్య సమస్యను సూచించవు.
దాని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
వికారం మరియు వాంతులు కొన్ని వ్యాధుల పరిస్థితిని సూచించే సంకేతాలు; అయినప్పటికీ, వికారం మరియు వాంతులుతో పాటు ఈ క్రింది లక్షణాలను గమనించవచ్చు:
- నాడి వేగంగా కట్టుకోవడం (రాపిడ్ పల్స్).
- నోరు పొడిబారడం .
- సృహ తప్పడం లేదా మైకము.
- తల తిప్పు
- గందరగోళం.
- పొత్తి కడుపు నొప్పి.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
ఈ క్రింద ఉన్న అనేక కారణాల వలన వికారం మరియు వాంతులు అనుభవించబడతాయి:
- మోషన్ సిక్నెస్ లేదా సి సిక్నెస్.
- కడుపులో ఇన్ఫెక్షన్.
- పిత్తాశయ వాపు.
- మైగ్రెయిన్ (పార్శ్యపు తలనొప్పి).
- వెర్టిగో.
- మెదడుకి గాయం లేదా మెదడులో కణితి.
- కడుపులో పుండ్లు.
- అధిక ఆమ్లత (Hyperacidity).
- గర్భాధారణ యొక్క మొదటి త్రైమాసికంలో.
- భయం.
- అసహ్యకరమైన వాసనలు వచ్చినప్పుడు.
- తినడంలో రుగ్మతలు (ఈటింగ్ డిజార్డర్స్).
- ఫుడ్ పాయిజనింగ్.
- ఔషధాల/మందుల యొక్క దుష్ప్రభావాలు.
- జనరల్ అనస్థీషియా
- కెమోథెరపీ మరియు రేడియేషన్ థెరపీ
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
వికారం మరియు వాంతులకు విస్తృతమైన/అధికమైన కారణాలు ఉండవచ్చు, అందువల్ల ఈ లక్షణాల యొక్క ఖచ్చితమైన కారణం తెలుసుకోవడం అనేది వాటికి (కారణానికి) అనుకూలంగా చికిత్స చేయడంలో సహాయపడుతుంది. వివరణాత్మక ఆరోగ్య మరియు వ్యక్తిగత చరిత్రను గురించి తెలుసుకోవడం అనేది లక్షణాలు యొక్క సంభావ్య కారణాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది, మరియు సాధారణంగా, ఇతర నిర్దిష్ట/ముఖ్య లక్షణాల ద్వారా వ్యాధికి సంబంధించిన అంతర్లీన కారణాన్ని సూచించవచ్చు. ఇమేజింగ్ అధ్యయనాలు, రక్త పరీక్షలు లేదా ఒక నిర్దిష్ట వ్యాధికి పరీక్షలు వ్యాధి పరిస్థితిని తెలుసుకోవడానికి నిర్వహించబడతాయి.
చాలా సందర్భాలలో, కడుపులోని పదార్దాలు బయటకు వచ్చేసిన తర్వాత వాంతులు వాటికవే ఆగిపోతాయి, కానీ కొన్నిసార్లు చికిత్స అవసరం కావచ్చు. వికారం మరియు వాంతులకు మాత్రమే కాక అంతర్లీన కారణానికి కూడా చికిత్స చేయవలసిన అవసరం ఉంటుంది. ఈ క్రింది చికిత్సలు సాధారణంగా సలహా ఇవ్వబడతాయి.
- వికారం వ్యతిరేక (Anti-nausea) మరియు యాంటీ-ఎమేటిక్ (anti-emetic) మందులు. గర్భవతులు అయితే, గైనకాలజిస్ట్ను సంప్రదించిన తర్వాత మాత్రమే మందులు తీసుకోవాలి.
- యాంటీ-మోషన్ సిక్నెస్ (anti-motion sickness) మందులు.
- ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ లేదా ఇంట్రావీనస్ ఫ్లూయిడ్ ఇన్ఫ్యూషన్ (నరాలలోకి ద్రవాలు ఎక్కించడం) రూపంలో శరీరం కోల్పోయిన ద్రవాలను భర్తీ చేయడానికి రీహైడ్రేషన్ థెరపీ (Rehydration therapy).
- నోటిలో చిన్న అల్లం ముక్క లేదా లవంగం పట్టుకోవడం వంటి కొన్ని సహజ చిట్కాలను పాటించడం కూడా వికారం నుండి ఉపశమనం కలిగిస్తాయి.
భోజనాన్ని చిన్న మొత్తంలో తీసుకోవడం, భోజనంతో పాటుగా నీళ్లు తాగడం కాకుండా భోజనం తర్వాత నీళ్లు తాగడం వంటివి కూడా వికారాన్ని నివారించడంలో సహాయం చేస్తాయి. వాంతులు మందుల ద్వారా నియంత్రించబడకపోతే మరియు అధిక సమయం పాటు కొనసాగితే, వైద్యుడిని ఆలస్యం చేయకుండా సంప్రదించాలి.