ముక్కు దిబ్బడ అంటే ఏమిటి?
ముక్కు దిబ్బడ లేదా నేసల్ కాంజెషన్ అనేది ముక్కు యొక్క అంతర్గత లైనింగ్లో (పూతలో) వాపు మూలంగా ముక్కు మూసుకుపోవడం/నిరోధించబడం. ఇది సాధారణంగా జలుబు వలన కనిపించే లక్షణాలలో ఒకటి. ఈ పరిస్థితి సాధారణంగా ఒక చిన్నపాటిది/తేలికపాటిది మరియు మందుల అవసరం లేకుండా కూడా కొద్ది కాలంలోనే నయమవుతుంది/తగ్గిపోతుంది. ఇది అన్ని వయస్సుల వారిని ప్రభావితం చేస్తుంది మరియు ముఖ్యంగా పిల్లల్లో గమనించవచ్చు. ముక్కు దిబ్బడ అనేది తరచుగా అలెర్జీలు లేదా ఒక జలుబు వంటి ఇతర వ్యాధులతో ముడిపడి ఉంటుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
వ్యక్తి ముక్కు దిబ్బడతో పాటు క్రింది లక్షణాలను అనుభవించవచ్చు:
- శ్వాస తీసుకోవడంలో కష్టం
- ముక్కులో ఏదోఉన్న భావన
- ముక్కు కారడం మరియు కళ్ళ నుండి నీళ్లు కారడం
- వాసన మరియు రుచి యొక్క భావన తగ్గిపోవడం
- నిద్ర చెదిరిపోతుంది
అరుదుగా, ఈ క్రింది లక్షణాలను అనుభవించవచ్చు:
- ముక్కు నొప్పి మరియు రక్తస్రావం
- రక్తంతో కూడిన శ్లేష్మం (Mucus)
- ముక్కు లోపల ఒక గట్టి పెచ్చు (hard crust) ఏర్పడడం
- అధిక లాలాజల ఉత్పత్తి
- శ్వాసలో గురక శబ్దం
- తలనొప్పి
- మింగడంలో కఠినత
ఇవి సైనసైటిస్ మరియు ఉబ్బసం వంటి ఇతర కారణాలతో ముడిపడి ఉండే అరుదైన లక్షణాలు .
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
ముక్కు లోపలి రక్తనాళాల వాపు, కణజాలపు వాపు మరియు ముక్కు రంధ్రలలో శ్లేష్మం అధికంగా స్రవించడం వల్ల ముక్కు దిబ్బడను అనుభవించవచ్చు. ముక్కు అంతర్గత లైనింగ్ను చికాకు కలిగించే మరియు వాపుకు కారణమయ్యే పరిస్థితులు:
- అలెర్జిక్ రినిటిస్
- సైనసైటిస్
- జలుబు
- నేసల్ పాలిప్స్ (Nasal polyps)
- బయటి పదార్థం ముక్కులోకి ప్రవేశించడం
- ఓటైటిస్ మీడియా (చెవి సంక్రమణం)
- ఆస్తమా
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
వైద్యులు ఇటీవలి శ్వాసకోశ అంటువ్యాధులు/ఇన్ఫెక్షన్లు లేదా అలెర్జీల వంటి వ్యాధుల యొక్క చరిత్ర గురించి కొన్ని ప్రశ్నలను అడుగుతారు. వైద్యులు పాలిప్స్ లాంటి అడ్డంకులకు కారణాలుగా ముక్కు నిరోధించబడినదా తెలుసుకోవడానికి ముక్కుని కూడా పరిశీలిస్తారు.
చికిత్సలో డికాంగిస్టెంట్స్ (decongestants) ఉంటాయి, వీటిని ఓరల్ (నోటి ద్వారా) తీసుకోవచ్చు లేదా స్ప్రేలు లేదా నేసల్ డ్రాప్స్ గా ఉపయోగించవచ్చు. వాటితో పాటు, ముక్కు దిబ్బడ యొక్క కారణం బట్టి ఇతర మందులను వైద్యులు సూచిస్తారు.
నేసల్ పాలిప్స్ విషయంలో, సాధారణంగా వాటి పరిమాణాన్ని తగ్గించడానికి మందులు ఇవ్వబడతాయి. చికిత్స ప్రభావవంతంగా లేకపోతే, శస్త్రచికిత్స సిఫార్సు చేయబడుతుంది.