మయోక్లోనస్ అంటే ఏమిటి?
మయోక్లోనస్ అనేది ఒక కదలికల రుగ్మత, ఇందులో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కండరాలలో ఆకస్మికంగా కుదుపు, అసంకల్పిత కదలికలు ఏర్పడతాయి. ఈ రుగ్మత శరీరంలోని ఒక భాగం లో ప్రారంభమయ్యి తరువాత ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. ఈ పరిస్థితి పురుషులు మరియు స్త్రీలను సమానంగా ప్రభావితం చేస్తుంది. మయోక్లోనస్ ఒక్కటే ఉంటే అది వ్యాధిలా పరిగణింపబడదు.
సాధారణంగా, ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఒక లక్ష మందికి 1.3 కేసులగా ఈ వ్యాధి ప్రాబల్యం ఉంటుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ఈ రుగ్మతలో కనిపించే లక్షణాలు మయోక్లోనస్ యొక్క కారణం మీద ఆధారపడి ఉంటాయి. ఏ విధమైన నరాల వ్యాధి లేని ప్రజలలో సాధారణంగా కనిపించే లక్షణాలు:
- నిద్రలో కుదుపుతో కూడిన కదలికలు
- వెక్కిళ్లు
- నిద్ర రావడం/పోవడంలో సమస్య
- నడవడం లేదా మాట్లాడడం లేదా తినడం లో ఇబ్బంది
- అస్థిరమైన నడక
- జ్ఞాపక శక్తి నష్టం
మయోక్లోనస్ యొక్క ఫ్రీక్వెన్సీ (తరచూ దనం) మరియు తీవ్రత అంతర్లీన కారణం మీద ఆధారపడి ఉంటుంది మరియు ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికీ మారుతూ ఉంటుంది.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
అసంకల్పిత (Involuntary), ఆకస్మిక (Involuntary) కదలికలు 2 క్రియావిధానాల (mechanisms) ద్వారా సంభవించవచ్చు:
- పాజిటివ్ మయోక్లోనస్ అని పిలవబడే కండరాల సంకోచాల కారణంగా
- నెగటివ్ మయోక్లోనస్ అని పిలవబడే కండర చర్యలలో/పనితీరులో నిరోధం కారణంగా
సాధారణంగా పాజిటివ్ మయోక్లోనస్ నెగటివ్ మియోక్లోనస్ కంటే ఎక్కువగా కనిపిస్తుంది.
ఈ క్రింది పరిస్థితులు మయోక్లోనస్ కారణమవుతాయి:
- కాలేయం మరియు మూత్రపిండాల పనితీరు యొక్క వైఫల్యం
- మూర్ఛ
- తలకు గాయం
- ఆక్సిజన్ లేకపోవడం
- ఇన్ఫెక్షన్
- సోడియం, పొటాషియం, మరియు కాల్షియం స్థాయిలలో అసంతుల్యతలు
- ఓపియాయిడ్స్ (opioids), యాంటీ-పార్కిన్సన్స్, యాంటీడిప్రజంట్స్ మరియు యాంటిహిస్టామైన్లు వంటి మందులు
- అల్జీమర్స్, పార్కిన్సోనిజం వంటి నరాల వ్యాధులు
- స్ట్రోక్
- మెదడులో కణితి
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
ముందుగా, వైద్యులు ఆరోగ్య చరిత్ర గురించి వివరణాత్మకంగా తెలుసుకోవడం మరియు భౌతిక పరీక్ష నిర్వహించడం ద్వారా మయోక్లోనస్ యొక్క కారణం గుర్తించడానికి ప్రయత్నిస్తారు. కారణాన్ని నిర్ధారించడానికి, ఎలెక్ట్రోలైట్స్ స్థాయిలలో అసాధారణతలను గుర్తించడం కోసం రక్త పరీక్షలు నిర్వహిస్తారు. మెదడు అసాధారణాతల అనుమానం ఉన్నట్లయితే వైద్యులు మాగ్నెటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్ (MRI) అని పిలిచే ఇమేజింగ్ టెస్ట్ను సిఫారసు చేస్తారు, లేదా మూర్ఛ విషయంలో ఎలక్ట్రోఎన్సెఫాలోగ్రామ్ (EEG, electroencephalogram) సిఫారసు చేస్తారు. అరుదుగా, జన్యు పరీక్ష మరియు చర్మ బయాప్సీ కూడా రోగ నిర్ధారణకు అవసరమవుతాయి.
వ్యక్తి అనుభవించే ప్రతి ఒక్క మయోక్లోనస్ ఎపిసోడ్ కోసం చికిత్స అవసరం ఉండదు. ఈ పరిస్థితి యొక్క కారణాన్ని సరిచేయడం అనేది మయోక్లోనస్ లక్షణాలకు మరింత చికిత్స అవసరం లేకుండా తగ్గిస్తుంది. ఉదాహరణకు, మయోక్లోనస్ కొన్ని మందుల ద్వారా సంభవించినట్లయితే, ఆ మందుల యొక్క వాడకాన్ని నిలుపివేయడం లేదా మూత్రపిండ వైఫల్య విషయంలో, హిమోడయాలసిస్ (haemodialysis) అనేవి ఈ కుదుపుల కదలికల నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి.