కండరాల బలహీనత అంటే ఏమిటి?
సాధారణ కార్యకలాపాలు నిర్వహించడానికి మీ కండరాల్లో సామర్ధ్యం తగ్గినట్లయితే దాన్నే కండరాల బలహీనత గా చెప్పవచ్చు. ఒక నిర్దిష్టమైన పని చేయడానికి కండరాల్లో బలం లేకపోవడమే ఈ కండరాల బలహీనత. కండరాల బలహీనత తాత్కాలికంగా ఉంటుంది, ఉదాహరణకు, వ్యాయామం తర్వాత కండరాల బలహీనత అనుభవించవచ్చు కానీ విశ్రాంతి తీసుకొన్న మీదట కండరాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాయి. అయితే, స్పష్టమైన కారణం లేకుండా కండరాల స్థిరమైన బలహీనతకు గురైతే అందుకు కొన్ని అంతర్లీనంగా ఉండే తీవ్రమైన కారణం కావచ్చు. అయితే, కండరాల బలహీనత అనేది అలసటకు భిన్నంగా ఉంటుంది .
దీని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
కండరాల బలహీనత క్రింది అనుబంధ సంకేతాలను చూపుతుంది:
- ఒక వస్తువుని పట్టుకోవటానికి కూడా కండరాలు బలం కోల్పోతాయి.
- తిమురు ఎక్కడం లేక కండరాలు (స్పర్శ) జ్ఞానాన్నికోల్పోవడం .
- అవయవాలను కదపటం కష్టం కావడం, నిలబడటానికి, నడవడానికి లేదా నిటారుగా కూర్చోవటానికి సమస్య.
- ముఖ కండరాలు కదల్చలేకపోవడం లేదా మాట్లాడటానికి అసమర్థత.
- శ్వాసలో సమస్య.
- స్పృహ కోల్పోవడం.
దీనికి ప్రధాన కారణాలు ఏమిటి?
కండరాల బలహీనతకు అనేక కారణాలు ఉండవచ్చు. ఆ కారణాలు క్రింది విధంగా ఉన్నాయి:
- కండరాల డిస్ట్రోఫీ
- స్ట్రోక్
- ఎలక్ట్రోలైట్ అసమతుల్యత
- విటమిన్ D లోపం
- నరాలు దెబ్బ తినిఉండడం
- ప్రమాదం లేదా గాయం
- కండరాల వాపు
- పోలియో
- మిస్టేనియా గ్రావిస్
- గ్రేవ్స్ వ్యాధి
- గిలియన్ బారే సిండ్రోమ్
- మల్టిపుల్ స్క్లేరోసిస్
- కొన్ని మందులు మరియు మద్యసేవనం
- కుంగుబాటు (డిప్రెషన్)
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
కండరాల బలహీనత కు నిస్త్రాణకు మధ్య భేదాన్నిగుర్తించడం అవసరం; నిస్త్రాణ లేదా అలసట అనేది పునరావృత ప్రయత్నాల తర్వాత కూడా కదలిక ను చేయడంలో విఫలం కావడం, అదే కండరాల బలహీనత అనేది మొదటి ప్రయత్నంలోనే కదలికను చేయలేకపోవడం. రోగనిర్ధారణకు ఒక ప్రాథమిక దశగా మీ వైద్యుడు సంపూర్ణ వైద్య చరిత్రను అడిగి తెలుసుకుంటారు, దీని తరువాత క్షుణ్ణమైన భౌతిక పరీక్ష ఉంటుంది. సాధారణ విశ్లేషణ పరీక్షలు క్రింది విధంగా ఉన్నాయి:
- కండరాల కదలికలు, వాటి (మోటార్) కార్యాచరణ పరీక్ష.
- ఊపిరితిత్తుల మరియు గుండె పనితీరు అంచనా.
- విటమిన్లు, ఎలెక్ట్రోలైట్స్ మరియు హార్మోన్ స్థాయిలు స్థాయిని పరిశీలించడానికి రక్త పరిశోధన.
- నరాల పనితీరు పరీక్షించడానికి ఎలెక్ట్రోమ్యోగ్రఫి.
- MRI మరియు CT స్కాన్లు.
- కండరాల జీవాణు పరీక్ష.
చికిత్స పద్ధతులు క్రింది విధంగా ఉన్నాయి:
- విటమిన్ ఔషధాలు, నొప్పి-నివారిణులు (పెయిన్ కిల్లర్స్), యాంటీ ఇన్ఫ్లమేటరీ లేదా ఇమ్యునోస్ప్రస్సాంట్స్ ఔషధాల వంటి మందులు, అంతర్లీన వ్యాధిని బట్టి ఉంటాయి.
- కండరాలను బలోపేతం చేయడానికి మరియు చలనశీలతను మెరుగుపరచడానికి ఫిజియోథెరపీ మరియు ఎలెక్ట్రోథెరపీ.
- ప్రమాదం లేదా గాయం విషయంలో శస్త్రచికిత్స.
ఒక ఫిజియోథెరపిస్ట్ పర్యవేక్షణలో రెగ్యులర్గా వ్యాయామాలు చేయడం మరియు అవసరమైన ఖనిజాలు మరియు విటమిన్లు సమృద్ధిగా ఉండే సమతుల్య ఆహారసేవనం మీ కండరాల బలాన్ని తిరిగిపొందడానికి సహాయపడవచ్చు. దయచేసి గమనించండి, వ్యాధి లక్షణాలు తీవ్రమైన ఆరోగ్య సమస్యను సూచిస్తాయి కాబట్టి సరైన రోగ నిర్ధారణ మరియు తక్షణ చికిత్స అవసరమవుతుంది . కాబట్టి, లక్షణాలు కొనసాగితే మీ వైద్యుడి నుండి సలహాలను తీసుకుని పాంటించి వ్యాధిని నయం చేసుకోండి .