సారాంశం
నోటి పూత అనేది తేలికపాటి వాపు మరియు నొప్పితో కూడుకున్న మృదువైన పుండులా కనిపించే సాధారణ స్థితి. ఇది ప్రధానంగా నోటిలోని పొర సున్నితంగా మరియు మృదువుగా ఉండటం వల్ల దానికి హాని కలిగినప్పుడు వస్తుంది. నోటి పూతలు వివిధ వయస్సుల వారిలో చాలా సాధారణం మరియు గాయం, పోషకాహార లోపాలు లేదా నోటి అపరిశుభ్రత వంటివి దీనికి కారణాలు కావచ్చు. అవి క్లినికల్ పరీక్షలో సులభంగా నిర్ధారించవచ్చు మరియు రక్త పరీక్షలు అవసరం లేదు. అయినప్పటికీ, పునరావృత నోటి పూతల యొక్క కారణాన్ని గుర్తించడానికి రక్త పరీక్షలను నిర్వహించవచ్చు. సాధారణంగా, వైద్యుడు పుండు వేగంగా నయంకావడానికి మందులని సూచిస్తాడు. నోటి పూతలను నయం చేయడంలో సహాయపడే అనేకమైన ఇంటి చిట్కాలు కూడా ఉన్నాయి. నోటి పూతల చికిత్స చాలావరకు ప్రాచీనమైనది మరియు యాంటీమైక్రోబియల్ మౌత్వాషెస్, విటమిన్ బి కాంప్లెక్స్ సప్లిమెంట్లు మరియు పై పూతగా రాసే నొప్పి తెలీకుండా చేసే జెల్స్ వంటివాటి వాడకం కలిగి ఉంటుంది. విటమిన్ B12 మరియు ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల నివారించవచ్చు.