దవడ పంటి నొప్పి అంటే ఏమిటి?
దవడ మరియు దాని దంతాల చుట్టూ ఉండే నొప్పి దవడ పంటి నొప్పిని సూచిస్తుంది. ఇది సాధారణంగా దంత క్షయం వలన సంభవిస్తుంది. దవడ పళ్ళు (మొలార్ పళ్ళు) నోటి వెనుక భాగంలో ఉంటాయి. నాలుగు మోలార్ (దవడ) పళ్ళు, ఉంటాయి రెండు పై దవడలో మరియు రెండు కింద దవడలో ఉంటాయి. కొందరు వ్యక్తులలో తక్కువ మోలార్ (దవడ) పళ్ళు/దంతాలు ఉంటాయి లేదా అసలు ఉండవు. కొందరు వ్యక్తులలో, మోలార్ పళ్ళు ఒక కోణంలో అభివృద్ధి చెందుతాయి, అవి చుట్టుపక్కల ఉన్న పళ్ళను/దంతాలను లేదా పంటి చిగురును పక్కకు తోసేస్తాయి. ఈ ప్రక్రియ చాలా బాధాకరముగా ఉంటుంది, మరియు ఆ పంటి చుట్టూ ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేయడం కష్టం అవుతుంది.
దాని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
దవడ పంటి నొప్పితో ముడి పడి ఉన్న ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు:
- మోలార్/దవడ పంటి దగ్గర ఉండే దవడ భాగం బిరుసుగా మారిపోవడం లేదా నొప్పిగా ఉండడం
- మింగడంలో కష్టం, పళ్ళు తోమడం మరియు నోరు తెరవడంలో కష్టం
- దంత క్షయం
- పళ్ళ మీద పళ్ళు ఏర్పడడం
- చిగుళ్లలో చీము ఏర్పడడం
- మోలార్ పళ్ళ చుట్టూ ఉన్న చిగుళ్ల యొక్క ఇన్ఫెక్షన్ లేదా వాపు
- చెడు శ్వాస
- అశాంతి
- జ్ఞాన దంతాలు మరియు వాటి పక్కన ఉండే దంతాల మధ్య ఆహారం మరియు బాక్టీరియా చేరడం
- లింఫ్ నోడ్లలో (శోషరస కణుపులలో) వాపు
- పళ్ళు తప్పు కోణంలో పెరగడం వలన నాలుక, చెంప, నోటిలో పైన లేదా కింద నొప్పి లేదా చికాకు
- చిగుళ్ల వ్యాధి
- జ్వరం
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
దవడ పంటి నొప్పి యొక్క ప్రధాన కారణాలు:
- డెంటల్ పల్ప్ (dental pulp, పంటి లోపలి పొర) లో వాపు
- పంటి కురుపులు (పంటి మధ్యభాగంలో బ్యాక్టీరియా మరియు ఇన్ఫెక్టేడ్ పదార్దాల యొక్క చేరిక)
- చిగుళ్ళ పరిమాణం తగ్గిపోవడం ఇది మోలార్/దవడ పళ్ళ మూలలను సున్నితముగా చేస్తుంది
- పరిశుభ్రత లేకపోవడం
- చీము ఏర్పడటం
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
దంతవైద్యులు పంటి చెక్-అప్/తనిఖీ ద్వారా దవడ దంతంలో నొప్పిని నిర్ధారింస్తారు మరియు నిర్వహించడం మరియు ఎక్స్- రే ఆధారంగా ఏ మోలార్ పంటి వలన నొప్పి సంభవిస్తుందో గుర్తిస్తారు.
దవడ పంటి నొప్పికి ఈ కింది పద్ధతుల ద్వారా చికిత్స జరుగుతుంది:
- ఓవర్ ది కౌంటర్ నొప్పి నివారుణులు (పెయిన్ కిల్లర్స్)
- యాంటిబయోటిక్స్
- ఇన్ఫెక్షన్ సోకిన ప్రాంతాలను శుభ్రపరచడం
- పన్ను తీవ్రంగా పాడయినట్లైతే పన్ను పీకివేయడం
- వెచ్చని ఉప్పు నీటితో నోరు పుక్కిలించడం
- రూట్ కెనాల్ (Root canal)