మేజ్ సిండ్రోమ్ అంటే ఏమిటి?
దవడ, నాలుక మరియు కండ్ల చుట్టూ ఉన్న కండరాల అసంకల్పిత సంకోచం లేదా నరాల కదలికల (కళ్ళ చుట్టుపక్కల నరాల పెడసరం లేక సంకోచం-బ్లీఫారోస్పాస్మ్) రుగ్మతనే మేజ్ సిండ్రోమ్ అంటారు. మేజ్ సిండ్రోమ్ అనేది ఒక రకమైన కండరాల పెడసరం (కండరాలు పట్టేయడం, కండరాలు బిగదీయడం లేక ఓ రకమైన డిస్టోనియా). ఇదోరకమైన నాడీవ్యవస్థ కదలికల రుగ్మత.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
మేజ్ సిండ్రోమ్ రుగ్మతలో ప్రధానంగా కళ్ళ చుట్టూ ఉండే కండరాలు మరియు ముఖకండరాల సంకోచం అనే ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలను కలిగి ఉంటుంది. దీన్నే డిస్టోనియా (ముఖకండరాలకు సంబంధించిన) మరియు బ్లెఫరోస్పాస్మ్ అని కూడా వ్యవహరిస్తారు.
- ముఖకండరాలకు సంబంధించిన సంకోచం (ఓరమండిబులర్ డిస్టోనియా)- ఈ రకమైన కండరాల సంకోచం (లేక డిస్టోనియా) రుగ్మతలో నాలుకతో పాటు దవడ కండరాలు అసంకల్పితంగా మన ప్రమేయం లేకుండా బలవంతంగా (forcefully) సంకోచిస్తాయి, దాంతో మనం ముఖ కండరాల్ని కదలించలేని స్థితికి గురై మాట్లాడటం లేదా తినిపించడం వంటి చర్యలు చేయలేని కష్టమైన పరిస్థితికి లోనవుతాం.
- కళ్ళ చుట్టూఉన్న కండరాల సంకోచం (బ్లెఫరోస్పాస్మ్) - గాలి, ప్రకాశవంతమైన కాంతి వంటి బాహ్య ఉత్తేజితాల కారణంగా కళ్ళను తరచుగా బలవంతంగా మూయడం, మిటకరించడం (blinking) చర్యనే కాళ్ళచుట్టూ కండరాల సంకోచం అని నిర్వచించవచ్చు. ఈ రుగ్మత కారణంగా క్రమంగా సంభవించే కండరాల సంకోచాలు (అధిక పౌనఃపున్యం) అధికమై, చివరకు వారు తమ కళ్ళను తెరిచి ఉంచలేని స్థితికి చేరిపోయి, బాధపడతారు. కళ్ళ చుట్టుపక్కల నరాల పెడసరం లేక సంకోచం-బ్లీఫారోస్పాస్మ్ రుగ్మత సాధారణంగా మొదట ఒక కన్నునే బాధిస్తుంది, మరియు తర్వాత రెండో దాన్ని కూడా బాధిస్తుంది.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
మేజ్ సిండ్రోమ్కు కారణాలు అంటూ ఏమీ లేవు. ఈ వ్యాధికి సంబంధించిన కొన్ని కారణాలు క్రింద ఇవ్వబడ్డాయి:
- మెదడు (బాసల్ గాంగ్లియా)లోని యంత్రాంగం (నెట్వర్క్) పనిచేయకపోవడం - మెదడు కణాల లోపం ఇది-కళ్ళ రెప్పలు కొట్టుకోవడం (blinking)తో బాటు అసంకల్పిత కదలికల్ని నియంత్రించే మెదడులోని “బాసలు గాంగ్లియా” అనే భాగంలో ఏర్పడే లోపమే ఇది. దీన్నే “మేజ్ రుగ్మత”గా పిలుస్తారు.
- దుష్ప్రభావాలు (సైడ్ ఎఫెక్ట్స్) - పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో ఉపయోగించే కొన్ని మందులు మేజ్ రుగ్మతకు అభివృద్ధికి దారితీసే కొన్ని దుష్ప్రభావాలకు దారి తీయవచ్చు.
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
మేజ్ రుగ్మత అరుదుగా ఉన్న కారణంగా, ఈ పరిస్థితికి ఖచ్చితమైన నిర్ధారణ (diagnosis) లేదు. అయినప్పటికీ, నరాలవ్యాధి నిపుణుడు మేజ్ రుగ్మతను నిర్ధారించడానికి వ్యాధి లక్షణాలను మరియు వ్యాధి నమూనాలను గుర్తించగలరు.
కండరాల సంకోచ నివారణా (యాంటీ-స్పాస్మ్) మాత్రలు కాలక్రమేణా ఈ రుగ్మతను మెరుగుపరుస్తాయి.
క్లోనాజపం, ట్రైహెక్షీఫినిడైల్, డైయాజపం మరియు బాక్లోఫెన్ వంటి మందులు మేజ్ వ్యాధి లేదా “బ్లేఫరోస్పాస్మ్” చికిత్సకు ఉపయోగిస్తారు, కానీ ఫలితాలు తరచుగా తాత్కాలికంగా ఉంటాయి, లేదా అసంతృప్తికరంగా ఉంటాయి. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) విభాగం ఇటీవల జరిపిన అధ్యయనంలో, ఔషధకారక సూక్ష్మజీవి జీవాణు (విష) పదార్థాన్ని (botulinum) కళ్ళ చుట్టుపక్కల నరాల పెడసరం లేక సంకోచం (blepharospasm) చికిత్స కోసం నిర్వచించారు మరియు ఈ రుగ్మత చికిత్సకు ఇది అత్యంత సాధారణ మందు. అయితే, కొందరు రోగులు బోటాక్స్ (botox) చికిత్సకు బాగా స్పందించరు.