మెంటిల్ సెల్ లింఫోమా (ఎంసిఎల్) అంటే ఏమిటి?
మాంటిల్ సెల్ లైమోఫోమా (ఎంసిఎల్) అనేది హాజ్కిన్ కాని లింఫోమా (non-hodgkin lymphoma) యొక్క రకం, ఇది మరింత తీవ్రమైనది మరియు అరుదైనది. ఎంసిఎల్ లో, లైంఫోమా మెంటిల్ జోన్ (mantle zone) లేదా లింఫ్ నోడ్ల (lymph node) యొక్క కరోనా నుండి ఉత్పన్నమవుతుంది. మెంటిల్ సెల్ లింఫోమా సాధారణంగా జీర్ణవ్యవస్థ మరియు ఎముక మజ్జలలో ఉంటుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
మెంటిల్ సెల్ లింఫోమా యొక్క లక్షణాలు ఇతర లింఫోమాల మాదిరిగానే ఉంటాయి. ఎంసిఎల్ యొక్క ప్రారంభ దశ లక్షణాలు మాములుగా ఇతర సాధారణ ఆరోగ్య సమస్యలుగా పరిగణించబడతాయి లేదా తరచూ నిర్ల్యక్షం చేయబడతాయి. ఎంసిఎల్ యొక్క కొన్ని ప్రారంభ లక్షణాలు:
- మెడ లేదా గజ్జలు లేదా చంకలలో లింఫ్ నోడ్ల (శోషరస కణుపుల) వాపు
- అలసట
- అస్థిరమైన లేదా అప్పుడప్పుడు వచ్చే జ్వరం
- రాత్రి సమయంలో చెమటలు పట్టడం
- ఆకస్మిక మరియు కారణం తెలియని బరువు తగ్గుదల
ఎంసిఎల్ యొక్క చివరి దశ లక్షణాలు:
- ఎముకల నొప్పి
- శ్వాసలో కష్టం
- దీర్ఘకాలిక బలహీనత మరియు నీరసం
- పైన పేర్కొన్న లక్షణాలు అధికమవుతాయి
దీని ముఖ్య కారణాలు ఏమిటి?
ఎంసిఎల్ సంభవించడానికి అనేక కారణాలు ఉన్నాయి కానీ, ఎంసిఎల్ కు దారితీసే ఖచ్చితమైన కారణం గురించి ఇంకా తెలియలేదు. ఎంసిఎల్ ఉన్న 90% మంది రోగులలో ప్రోటీన్ సైక్లిన్ D1 యొక్క ఉత్పత్తి సాధారణం కంటే అధికంగా ఉంటుంది . అలాగే లాక్టాట్ డీహైడ్రోజినేస్ (lactate dehydrogenase) మరియు బీటా 2 మైక్రోగ్లోబ్యులిన్ (beta 2 microglobulin) వంటి ప్రోటీన్లు కూడా అధికంగా ఉంటాయి.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
రోగి యొక్క లక్షణాలు లింఫ్ (శోషరస) యొక్క కణితిని లేదా క్యాన్సర్ను సూచిస్తున్నట్లైతే, అప్పుడు వైద్యులు లేదా పేథాలజిస్ట్ క్యాన్సర్ వృద్ధిలో ఉన్న కణాల యొక్క రకాన్ని పరిశీలించడానికి మరియు నిర్ణయించడానికి బయోప్సీని (జీవాణుపరీక్ష) సూచిస్తారు.
లింఫోమా కణాలను గుర్తించిన తర్వాత, పెరుగుదలను మరియు ప్రభావిత ప్రాంతాలను గుర్తించడానికి మరిన్ని పరీక్షలు నిర్వహించబడతాయి, అందులో ఛాతీ యొక్క ఎక్స్-రే, రక్త పరీక్షలు, కంప్యూటెడ్ టోమోగ్రఫీ (CT) లేదా మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (MRI) వంటి ఇమేజింగ్ స్కాన్లు ఉంటాయి.
ఎంసిఎల్ చికిత్స క్యాన్సర్ యొక్క దశపై ఆధారపడి ఉంటుంది.
ప్రారంభ దశల్లో ఉపయోగించే అత్యంత సాధారణమైన చికిత్స మందులు/ఫార్మకోలజికల్; అయితే, తరువాతి దశలలో, కీమోథెరపీ మరియు రేడియేషన్ థెరపీని ప్రవేశపెట్టారు. క్యాన్సర్ ఉన్న B- కణాలను లక్ష్యంగా చేసుకుని వాటిని నిర్ములించే రిట్యుక్సిమాబ్ (rituximab) వంటి ఔషధాలు కూడా ఆఖరి దశలలో ఉపయోగపడతాయి. తీవ్రమైన రోగనిరోధక శక్తి లోపం ఉన్నటువంటి ప్రత్యేక సందర్భాలలో, వైద్యులు ఎముక మజ్జ లేదా మూల కణ (stem cell) మార్పిడిని నిర్వహిస్తారు, ఇది కొత్త మరియు ఆరోగ్యకరమైన రోగనిరోధక కణాలను నిర్మించడానికి/పునరుద్ధరించడానికి సహాయపడుతుంది.