సారాంశం
పోషకాహార లోపం అనగా కేవలం అసంపూర్ణ పోషణ అని అర్థం. ఇది పోషకాహారాన్ని మరియు పోషకాహారలోపాన్ని రెండిటినీ కలిగి ఉన్న ఒక విస్తారమైన పదం. పోషకాహార లోపం అనేది ప్రపంచవ్యాప్తoగా లక్షలాది మందిని ప్రభావితం చేస్తున్న ఒక అంతర్జాతీయ సమస్య. ఈ వ్యాసం ప్రధానంగా ప్రపంచ వ్యాప్తంగా అధిక ప్రాబల్యంగా ఉన్న పోషకాహార లోపంపై దృష్టి సారించడమైనది. అధిక సంఖ్యలో పిల్లలు మరియు పెద్దలలో పోషకాహార లోపం మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. పోషకాహారలోపం యొక్క లక్షణాలు బరువులో అసాధారణమైన మార్పులు, అలసట, రోజువారీ కార్యకలాపాలు నిర్వహించలేకపోవడం, మరియు ఏకాగ్రత లేకపోవడం. కొన్ని సందర్భాల్లో, పోషకాహారలోపాన్ని గుర్తించడం కష్టమవుతుంది ఎందుకంటే ఎటువంటి ముఖ్యమైన లక్షణాలు కలిగి ఉండదు. సరికాని ఆహారపు అలవాట్లు, సామాజిక-ఆర్ధిక కారకాలు, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులు కారణంగా పోషకాహార లోపం ఏర్పడుతుంది. చికిత్స చేయకుండా వదిలేస్తే, పోషకాహార లోపం పిల్లల్లో, అలాగే పెద్దలలో పెద్ద సమస్యలకు దారితీస్తుంది. పోషకాహారలోపం యొక్క చికిత్స ఒక బహుళ-పరిమాణాల విధానాన్ని అనుసరిస్తుంది, ఇది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మరియు రెగ్యులర్గా హెల్త్ చెక్-అప్లు చేసుకోవడం వంటివి ఉంటాయి. చికిత్స సమయంలో స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల నిరంతర మద్దతు కూడా మంచి చికిత్స ఫలితాన్ని ఇస్తుంది. సమాజ స్థాయిలో, సమాజంలోని బలహీనమైన సామాజిక-ఆర్థిక విభాగానికి చెందిన ప్రజలకు వైద్య సహాయం మరియు ఆహార వనరులను అందించడం, పోషకాహారలోపానికి సంబంధించిన ప్రాబల్యం, సమస్యలు మరియు మరణాలను తగ్గించడంలో సహాయపడుతుంది.