మాలిగ్నెంట్ హైపర్ థెర్మియా (ఎంహెచ్) అంటే ఏమిటి?

అధిక శరీర ఉష్ణోగ్రత హైపర్ థెర్మియా అని పిలుస్తారు. మాలిగ్నెంట్ హైపర్ థెర్మియా (ఎంహెచ్)  ఒక కుటుంబపరంగా వారసత్వంగా సంభవిస్తుంది, దీనిలో శస్త్రచికిత్సల సమయంలో ఉపయోగించే కొన్ని మందులకు (ప్రత్యేకంగా మత్తుమందు ఉండే వాయువులు [anaesthetic gases]) వ్యక్తి వేగమవమైన ప్రతిస్పందనను అనుభవిస్తాడు. తీవ్రమైన కండరాల సంకోచాలు మరియు శరీర ఉష్ణోగ్రతలో వేగంగా పెరగడం వంటివి మాలిగ్నెంట్ హైపర్ థెర్మియాలో గమనింపబడతాయి. ఈ పరిస్థితిలో కనిపించే హైపర్ థెర్మియా  ఇన్ఫెక్షన్ లేదా వడ దెబ్బ (హీట్ స్ట్రోక్) వంటి ఇతర ఆరోగ్య సమస్యలలో ఉండే హైపర్ థెర్మియాల కంటే భిన్నంగా ఉంటుంది

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

ఎంహెచ్ యొక్క సాధారణ సంకేతాలు మరియు లక్షణాలు:

  • శరీర ఉష్ణోగ్రత 105 ° F (40.6 ° C) లేదా అంతకంటే ఎక్కువగా పెరుగుతుంది (మరింత సమాచారం: జ్వరం చికిత్స)
  • కండరాల బిగుసుకుపోవడం, గట్టిబడం మరియు నొప్పి (కారణం తెలియకుండా)
  • వేగవంతమైన గుండె స్పందన రేటు
  • యాసిడోసిస్
  • బ్లీడింగ్
  • ముదురు గోధుమ రంగులోకి మూత్రం రంగు మారిపోవడం

దాని ప్రధాన కారణాలు ఏమిటి?

ఎంహెచ్  (MH) వీటి వలన సంభవించవచ్చు:

  • వారసత్వంగా ఈ  సమస్య సంక్రమించడం (తల్లిదండ్రులలో ఎవరోఒకరు ఈ వ్యాధిని కలిగి ఉన్న పిల్లలకి ఎంహెచ్ అభివృద్ధి చెండానికి దారి తీస్తుంది).
  • వారసత్వంగా సంక్రమించిన ఇతర కండరాల వ్యాధులు:
    • మల్టీమినికోర్ మైయోపాటీ (Multiminicore myopathy)
    • సెంట్రల్ కోర్ డిసీజ్ (Central core disease)

ఈ రెండు వ్యాధులు స్కెలిటల్ కండరాలను ప్రభావితం చేస్తాయి, తద్వారా కండరాల బలహీనతకు దారితీస్తాయి.

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

శస్త్రచికిత్స సమయంలో ఒక వ్యక్తి అనస్థీషియా (మత్తు) ఇచ్చిన తర్వాత సాధారణంగా ఈ పరిస్థితి గుర్తించబడుతుంది. ఎంహెచ్ తో బాధపడుతున్న వ్యక్తి  వేగవంతమైన మరియు క్రమరహిత హృదయ స్పందనకు గురిఅవుతాడు మరియు అనస్థీషియా సమయంలో కొన్నిసార్లు కారణం తెలియకుండా మరణాన్ని కూడా పొందవచ్చు. అందువల్ల,అనస్థీషియాని నిర్వహించడానికి ముందు వైద్యులు ఎంహెచ్ యొక్క కుటుంబ చరిత్రను గురించి తెలుసుకుంటారు. ఈ పరిస్థితిని విశ్లేషించడానికి సూచించే కొన్ని పరీక్షలు:

  • రక్త పరీక్షలు:
    • క్లోట్టింగ్ పరీక్షలు (clotting tests): ప్రోథ్రాంబిన్ టైం (PT) మరియు పా ర్షియల్ త్రాంబోప్లాస్టిన్ సమయం (PTT)
    • బ్లడ్ కెమిస్ట్రీ పానెల్, ఇందులో క్రిటిటిన్ ఫాస్ఫోకైనేస్ (CPK, creatinine phosphokisane) ఉంటుంది
  • మయోగ్లోబిన్ (myoglobin)  అనే కండర ప్రోటీన్ స్థాయిల అంచనా కోసం మూత్ర పరీక్ష.
  • జన్యు పరీక్ష (Genetic testing)
  • కండరాల జీవాణుపరీక్ష (muscle biopsy)

ఎంహెచ్ యొక్క నిర్వహణలో ఇవి ఉంటాయి:

  • డేన్ట్రోలిన్(Dantrolene), ఇది ఎంహెచ్ యొక్క నిర్వహణ ఉపయోగించే మందుగా పరిగణించబడుతుంది.
  • శీతలీకరణ దుప్పటిలో (cooling blanket) వ్యక్తిని చుట్టడం ద్వారా జ్వరం లేదా మరిన్ని తీవ్రమైన సమస్యల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
  • ఎంహెచ్ ఉన్న సమయాలలో వ్యక్తికీ నరాల ద్వారా ద్రవాలు ఎక్కించబడతాయి, ఇది మూత్రపిండాలకి జరిగే హానిని నివారించడానికి సహాయపడుతుంది, తద్వారా వాటి పనితీరును కాపాడుతుంది.

Medicines listed below are available for మాలిగ్నెంట్ హైపర్ థెర్మియా. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.

OTC Medicine NamePack SizePrice (Rs.)
Lomoother Capsule6 Capsule in 1 Strip419.83
Dantrolene sodium Injection1 Injection in 1 Vial485.0
Read more...
Read on app