పురుషులలో హైపోగోనాడిజం అంటే ఏమిటి?
పురుషులలో హైపోగోనాడిజం అనేది టెస్టోస్టెరోన్ స్థాయిలలో (ఈ హార్మోన్ యుక్తవయస్సులో పురుషుల పెరుగుదల మరియు పురుష లక్షణాల అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తుంది) లోపం వలన ఏర్పడుతుంది, ఎందుకంటే శరీరానికి తగినంత పరిమాణంలో దీనిని ఉత్పత్తి చేయలేదు. ఈ సమస్య బాధిత వ్యక్తి యొక్క జీవిత నాణ్యత మీద గొప్ప ప్రభావాన్ని కలిగి ఉంటుంది. లైంగిక హార్మోన్ గా ఉండటంతో పాటు, టెస్టోస్టెరోన్ను లైంగిక, మేధాశక్తి మరియు శరీరక విధులకు (మెదడు మరియు జీవక్రియ మరియు నాడీ వ్యవస్థల పనితీరులో ముఖ్య పాత్రను కలిగి ఉంటుంది) మరియు అభివృద్ధి కోసం ముఖ్యమైనది భావిస్తారు.
హైపోగోనాడిజం అనేది రెండు రకాలు, అనగా ప్రాధమిక (వృషణాలలో) మరియు ద్వితీయ (హైపోథాలమస్ లేదా పిట్యూటరీ గ్రంధిలో).
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
హైపోగోనాడిజం యొక్క సాధారణ సంకేతాలు మరియు లక్షణాలు
- రక్తహీనత
- కండరాల నష్టం
- తగ్గించిన ఎముక ద్రవ్యరాశి లేదా ఎముక ఖనిజ సాంద్రత లేదా బోలు ఎముకల వ్యాధి
- కడుపులో కొవ్వు పేరుకుపోవడం
- శరీరం నుండి వేడి ఆవిర్లు
- శరీర జుట్టు తగ్గిపోవడం
- ఎపిఫైసీయల్ క్లోసుర్ (epiphyseal closure)లో ఆలస్యం
- గైనకోమెస్టియా (Gynaecomastia, మగవారిలో రొమ్ములు పెరగడం)
- లైంగికపరమైన/శృంగారపరమైన సమస్యలు
- అంగస్తంభన లోపం
- శక్తి, సామర్థ్యం, లైంగికవాంఛ, పురుషాంగ చలనం లేదా వీర్య కణాల సంఖ్య తగ్గిపోవడం
- భావప్రాప్తి పొందడంలో కష్టం
- చిన్న వృషణాలు
- కోరిక (మూడ్) తగ్గిపోవడం లేదా చిరాకు పెరగడం
- ఏకాగ్రతా లోపం
- కొలెస్ట్రాల్ స్థాయిలలో మార్పులు
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
ప్రాథమిక హైపోగోనాడిజం యొక్క ప్రధాన కారణాలు
- వయస్సు పెరగడం
- క్లిన్ఫిల్టర్స్ సిండ్రోమ్ (Klinefelter's syndrome)
- మమ్స్ ఆర్కైటిస్ (Mumps orchitis)
- హిమోక్రామెటోసిస్ (Haemochromatosis)
- గాయపడిన లేదా ముడుచుకుపోయిన వృషణాలు
- కీమోథెరపీ లేదా రేడియేషన్ థెరపీతో క్యాన్సర్ చికిత్స
ద్వితీయ హైపోగోనాడిజం యొక్క ప్రధాన కారణాలు
- ఊబకాయం
- పిట్యూటరీ గ్రంథి యొక్క లోపాలు
- ఒత్తిడి ప్రేరిత హైపర్ కార్టిసోలిజం (Stress-induced hypercortisolism)
- హెచ్ఐవి/ఎయిడ్స్
- కెల్మ్యాన్ సిండ్రోమ్ (Kallmann syndrome)
- క్షయవ్యాధి, సార్కోడియోసిస్ (sarcodiosis), హిస్టియోసైటోసిస్ (histiocytosis) వంటి వ్యాధులు
- ఒపియేట్ నొప్పి మందులు (opiate pain drugs) మరియు హార్మోన్లు వంటి మందులు
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
వైద్యులు నిర్ధారణ ప్రధానంగా లక్షణాలు ఆధారంగా చేస్తారు, మరియు ఈ క్రింది పరీక్షలు సూచించబడతాయి:
- హార్మోన్ పరీక్ష
- సీరం టెస్టోస్టెరోన్ లేదా ఫ్రీ టెస్టోస్టెరాన్
- ద్వితీయ హైపోగోనాడిజమ్ కోసం సీరం లుయూటినైజింగ్ హార్మోన్ (LH, luteinizing hormone) మరియు ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (FSH, follicle stimulating hormone)
- వీర్య విశ్లేషణ (Semen analysis)
- పిట్యూటరీ ఇమేజింగ్ (Pituitary imaging)
- వృషణాల బయాప్సీ (Testicular biopsy)
- జన్యు అధ్యయనాలు (Genetic studies)
చికిత్స యొక్క మొదటి శ్రేణి టెస్టోస్టెరాన్ భర్తీ చికిత్స (testosterone replacement therapy), దీనిలో 300-800 ng / dL టెస్టోస్టెరాన్ ను అందించాలి. అది ఈ క్రింది రూపంలో ఉండవచ్చు:
- నిరంతరంగా 24-గంటల సమయం పాటు టెస్టోస్టెరాన్ ను విడుదల చేసే ట్రాన్స్డెర్మల్ పాచ్ (transdermal patch).
- టెస్టోస్టెరాన్ యొక్క పల్సటైల్ (pulsatile) విడుదలకు ఉపయోగించే బకల్ టెస్టోస్టెరాన్ మాత్రలు (Buccal testosterone tablets).
- టెస్టోస్టెరాన్ నెమ్మదిగా విడుదల కావడానికి ఉద్దేశించిన శస్త్రచికిత్స ద్వారా అమర్చిన ఇంప్లాంట్బిల్ పెల్లెట్ (శరీరంలోకి ప్రవేశపెట్టే చిన్న గుళిక).
- సీరంలో టెస్టోస్టెరాన్ అధిక సమయం పాటు ఉండేందుకు ఉపయోగించే సమయోచిత జెల్ (Topical gel).
- ఇంట్రాముస్కులర్ ఇంజెక్షన్లు దీర్ఘకాల శోషణకు (absorption) ఉపయోగిస్తారు, ఇవి నూనెలో ఉంచ బడతాయి (సస్పెండ్ చేయబడతాయి).
- ఓరల్ (నోటి ద్వారా తీసుకునేవి)టెస్టోస్టెరాన్ మాత్రలు, ప్రస్తుతం భారతదేశంలో అందుబాటులో లేవు.