మాక్యులర్ డీజెనరేషన్ అంటే ఏమిటి?

కంటిలోని రెటీనాను బాధించే వ్యాధే “మాకులర్ డీజెనరేషన్” కంటి వ్యాధి. స్పష్టమైన, పదునైన మరియు కేంద్ర దృష్టి (central vision) కోసం కంటిమచ్చ (macula of the eye) అవసరమవుతుంది. “మాకులా” గా పిలువబడే ఈ కంటిమచ్చ రెటీనా కేంద్రం సమీపంలో ఒక చిన్న మచ్చలా కనిపిస్తుంది. ఈ మాకులా కంటిమచ్చ నేరుగా వస్తువులను  గుర్తించడంలో మనకు సహాయపడుతుంది. ఈ కంటిమచ్చ క్షీణత (macular degeneration) అనేది ఒక సాధారణ కంటి రుగ్మత. మాకులా కంటిమచ్చ దెబ్బ తినడంవల్లనే ఈ కంటివ్యాధి సంభవిస్తుంది. ఈ రుగ్మత కొంతమంది వ్యక్తులలో దృష్టి నష్టానికి (vision loss) దారి తీస్తుంది. మాక్యులర్ క్షీణత రెండు రకాలు, ఒకటి పొడి మాక్యులర్ క్షీణత మరియు రెండు తడి మాక్యులర్ క్షీణత.

దీని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

కంటిమచ్చ క్షీణత (macular degeneration) యొక్క చిహ్నాలు మరియు లక్షణాలు:

  • ఎర్రబారిన బాధాకరమైన కళ్ళు (మరింత సమాచారం:  కళ్ళ ఎరుపుదనం కారణాలు )
  • ఒక నీడ లేదా చీకటి పరదా దృష్టిలో ఉన్నట్లు కలిగే భావన
  • చక్కని గీతలు వంకరగా కనిపిస్తాయి
  • అస్పష్టమైన లేదా వక్రీకృత దృష్టి (మరింత సమాచారం: అస్పష్టమైన దృష్టికి చికిత్స)
  • మామూలు (ఉన్న ప్రమాణం) కంటే తక్కువ సైజులో వస్తువులు కనిపించడం
  • దృష్టి ప్రకాశంలో మార్పులు
  • భ్రాంతులు (లేని వస్తువుల్నిచూస్తున్న భావన)
  • మీ దృష్టి మధ్యలోని వస్తువులు చూడటంలో చాలా సంకటం
  • దృష్టి నష్టం లేదా బాగా కనిపించే స్థాయిలో నష్టం

దీనికి ప్రధాన కారణాలు ఏమిటి?

మాక్యులార్ క్షీణత ప్రధానంగా రెటీనాకు దెబ్బ తగలడం లేదా నష్టం కలగడంవల్ల రెటీనా  యొక్క కేంద్ర భాగం యొక్క క్షీణతకు దారితీస్తుంది. కంటి మచ్చల క్షీణత యొక్క కారకాలు:

  • వంశపారంపర్యం కారకాలు  
  • పర్యావరణ కారకాలు  
  • వయసు కారకాలు  
  • జన్యు సంబంధిత కారకాలు, Stargardt వ్యాధిలో కనిపించే కారకాలు

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

కింది పద్ధతులతో నేత్ర వైద్యుడు కళ్ళను పూర్తిగా పరీక్ష చేసి కంటిమచ్చ క్షీణత (macular degeneration)ను నిర్ధారణ చేస్తారు:

  • అమ్స్లర్ (Amsler) గ్రిడ్: మీరు ఒక అమెస్లర్ గ్రిడ్ వైపు చూస్తుండగా ప్రత్యేక కటకాన్ని ఉపయోగించి కంటి పరీక్షను చేస్తారు, ఇది రెటీనా మరియు కంటిమచ్చలో (మాకులాలో) మార్పులను గుర్తించడంలో సహాయపడుతుంది.
  • విస్తారమైన కంటి పరీక్ష: పరీక్ష సమయంలో రెటీనాను సులభంగా చూడటానికి మీ కళ్ళను విస్తరించడం కోసం మరియు కనుపాపల్ని విస్తరించేందుకు కంటి చుక్కలమందును వాడవచ్చు.
  • కంటి పటాలలో లభించే కొలతలు ఉపయోగించి కంటి తీక్ష్ణతా పరీక్ష.
  • రేడియోలాజికల్ పద్ధతుల్లో కింద సూచించినవి ఉంటాయి:
    • ఫ్లూరేసేయిన్ ఆంజియోగ్రఫీ (పసుపు రంగు డై)
    • ఆప్టికల్ కోహెరెన్సు టోమోగ్రఫీ (OCT), ఇది రెటీనాను స్కాన్ చేయడానికి సహాయపడుతుంది

కంటి మచ్చల క్షీణతకు చేసే చికిత్స కిందివాటిని కలిగి ఉంటుంది:

  • పొడి కంటిమచ్చ క్షీణత (dry macular degeneration)కు ఖనిజాలు మరియు విటమిన్లుతో చికిత్స చేయవచ్చు
  • వెట్ మాక్యులార్ డిజెనరేషన్ రుగ్మతకు కిందివాటి ద్వారా చికిత్స చేయవచ్చు:
    • ఫొటోడైనమిక్ థెరపీ, దీనిలో vertoporfin మందును నరాల ద్వారా ఇవ్వడం
    • మీ రెటీనాలో అసాధారణ రక్తనాళాల తగ్గింపులో సహాయపడే వ్యతిరేక వాస్కులర్ ఎండోథెలియల్ పెరుగుదల కారకం (anti-VEGF) మందులతో చికిత్స
    • లేజర్ శస్త్రచికిత్స

Dr. Vikram Bhalla

Ophthalmology
14 Years of Experience

Dr. Rajesh Ranjan

Ophthalmology
22 Years of Experience

Dr. Nikhilesh Shete

Ophthalmology
2 Years of Experience

Dr. Ekansh Lalit

Ophthalmology
6 Years of Experience

Medicines listed below are available for మాక్యులర్ డీజెనరేషన్. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.

OTC Medicine NamePack SizePrice (Rs.)
Jagat Pharma Isotine Gold Kit1 Kit in 1 Combo Pack1169.0
Oxidon Plus Capsule10 Capsule in 1 Strip129.2
Jagat Pharma Isotine Plus Eye Drop Pack of 6 (10ml Each)1 Kit in 1 Combo Pack585.0
Jagat Pharma Isotine Eye Drops Pack of 6 Drops (10ml Each)1 Kit in 1 Combo Pack419.0
Eye Vital Capsule (30)30 Capsule in 1 Strip96.0
Eye Vital LX Capsule10 Capsule in 1 Strip139.0
Vitamin E 200 mg Capsule10 Capsule in 1 Strip8.13
Healthvit Lutein Capsule60 Capsule in 1 Bottle1200.0
Lucentis Injection1 Injection in 1 Packet70160.0
Visudyne Powder for Injection1 Injection in 1 Packet55769.0
Read more...
Read on app